Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label X. Show all posts
Showing posts with label X. Show all posts

Tuesday, September 19, 2023

ఎక్స్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ?



సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)ను స్వాధీనం చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను తీసుకువచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా తమ సంస్థ ఆదాయం పెంచుకొనేందుకు ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటిదాకా ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితంగా ఉండగా.. ఇప్పుడు వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ట్విట్టర్ యూజర్లలందికీ మరో షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మస్క్ ఇప్పటికే బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ సేవలను తీసుకొచ్చిన విషయం అందికీ తెలిసిన
 విషయమే. అయితే అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ బ్లూటిక్ చందా విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఖాతాదారులందరి నుంచి నెలవారిగా సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అయితే ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజును వసూలు చేయాలనే ప్రతిపాదనలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరి ఈ ఫీజు ఎంత వసూలు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. మరోవైపు ఇజ్రాయెల్​ప్రధాని బెంజమిన్ నేతన్యాహూతో ఎలాన్ మస్క్‌ తాజాగా చర్చించారు. లైవ్​ స్ట్రీమింగ్‌లో జరిగినటువంటి ఈ సమావేశంలో ఇద్దరూ పలు కీలక విషయాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్​ మస్క్‌తో ఇజ్రాయిల్ ప్రధాని.. 'సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్య కారణం బాట్స్ అని వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే దీనిపై స్పందించిన మస్క్.. మేము ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే త్వరలోనే ఎక్స్​ఖాతాదారులకు నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఫీజును కూడా విధించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా చేస్తే ఈ విధానం వల్ల బాట్‌లు వినియోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టమవుతుందని అన్నారు. అయితే సబ్​స్క్రిప్షన్ ఫీజు విధిస్తామంటూ చెప్పిన మస్క్‌.. అది ఎంత మొత్తంలో ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అలాగే సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు ఉంటాయా ? లేదా? అనే విషయాల్ని కూడా ఆయన చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్స్​(ట్విట్టర్​) ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ఫీజు కింద నెలవారిగా 8 డాలర్లు వసూలు చేస్తోంది. ఇప్పుడు ఖాతాదారులందరి నుంచి సబ్​స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసినట్లేతే ట్విట్టర్ కాస్తా పెయిడ్ ప్లాట్ ఫామ్‌గా మారనున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్​) వేదికలో 550 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులు​ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. అయితే వీళ్లు ఒక రోజులో కనీసం దాదాపు 100 నుంచి 200 మిలియన్ల వరకు పోస్టులు పెడుతున్నట్లు చెప్పారు. అయితే ఒక వేళ ఈ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​అనేది అమల్లోకి తీసుకొస్తే.. ట్విట్టర్​ (ఎక్స్) కంపెనీకి మరింత ఆదాయం వస్తుంది.

Thursday, August 31, 2023

ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ !


X ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేట్ చేయబడిన ఆడియో మరియు వీడియో కాల్‌ల వంటి ఫీచర్లను X లో చూడవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS, PC మరియు Macకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మస్క్ చెప్పినట్లుగా, ఈ ఫీచర్ ద్వారా ఎటువంటి ఫోన్ నంబర్ లేకుండా కాల్స్ చేయవచ్చు. "X కి వస్తున్న వీడియో & ఆడియో కాల్‌లు: - iOS, Android, Mac & PCలో పని చేస్తుంది. దీనికి ఫోన్ నంబర్ అవసరం లేదు. సోషల్ మీడియా దిగ్గజం " X అనేది ప్రభావవంతమైన ఒక గ్లోబల్ అడ్రస్ బుక్ గా మారబోతోంది. అందులో ఈ ఫీచర్ ప్రత్యేకమైనది" అని ఆయన  X లో రాశాడు. అయితే మస్క్ ఈ ఫీచర్లను ఎప్పుడు లాంచ్ చేయడానికి ప్రణాళిక వేశారు అనే తేదీని ఇంకా ఇవ్వలేదు. జూలైలో  కంపెనీ డిజైనర్ ఆండ్రూ కాన్వే ఈ ఫీచర్‌ను సూచించాడు. Mashable నివేదిక ప్రకారం, ఒక నెల క్రితం, ఈ ఫీచర్ తో ఉన్న X  స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసారు. ఈ స్క్రీన్‌షాట్‌లో, ఆడియో మరియు వీడియో కాల్ ఎంపికలు DM స్క్రీన్ ఎగువ ఎడమవైపున జోడించబడ్డాయి. ఆడియో మరియు వీడియో కాల్‌ల తో ఎలోన్ మస్క్ X "ఎవ్రీథింగ్ యాప్"గా మారాలనే ఆలోచన వైపు మరో అడుగు ముందుకేశారు. 

Popular Posts