సినిమాల్లో జేమ్స్‌బాండ్ ల్యాప్‌టాప్
ద్వారా శత్రువు ఎక్కడ ఉన్నాడో చూసి, శత్రువుకి సంబంధించిన డేటాను క్షణాల్లో సంపాదించటం పలుసార్లు చూశాము. కానీ మారిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరికీ తమ కంప్యూటర్ డేటాను
కాపాడుకోవటం అతిపెద్ద సమస్యగా మారింది. అందులోనూ
ల్యాప్‌టాప్‌ను వినియోగించేవారికి ఇది
మరీ ఎక్కువగా
ఉంది. గతంలో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగించుకొన్న కొద్ది రోజులకే, కొత్త మోడల్ మార్కెట్‌లోకి రావటం, లేకపోతే సరికొత్త చిప్‌ను చిప్ తయారీ కంపెనీలు విడుదల చేయటం
జరిగేది. కొత్తగా వచ్చిన వాటితో తమ ల్యాప్‌టాప్‌లను
అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అనేకరకాలైన
అవాంతరాలు ఎదురు అవుతాయి.
పాతతరం ల్యాప్‌టాప్‌లతో రిపేర్ల సమస్యలు,
ల్యాప్‌టాప్‌ను
అప్‌గ్రేడ్ చేయాలన్నా ఖరీదైన వ్యవహారంగా ల్యాప్‌టాప్
పోతే, అందులోని డేటాను తిరిగి పొందటం చాలా కష్టం. మరియు . అదీగాక,
పొరపాటున
చేతిలో నుంచి జారినా, కిందపడి డ్యామేజి అయినా, అందులో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్
కరెప్ట్ అయితే, ఇంక డేటా అంతే.
మారిన టెక్నాలజీ వల్ల
అత్యాధునికమైనటువంటి ల్యాప్‌టాప్‌లు
అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో పోయిన
ల్యాప్‌టాప్ ఆన్ చేస్తే చాలు. అందులోని డేటాను
తిరిగి మీ మెయిల్‌కు వచ్చే విధంగానూ ఏర్పాట్లు చేసుకోవచ్చు.అంతేగాక, హార్డ్‌డిస్క్‌ను, ల్యాప్‌టాప్‌ను సైతం చాలా
ధృడమైనటువంటి మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు.
దీనివల్ల ఇప్పటి ల్యాప్‌టాప్‌లు నిప్పులోనూ,
నీటిలో మునిగినా తట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.
గతంలో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్‌ల కన్నా భారీ పరిమాణంలో ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌లు లభించటం ఓ రకం అయితే, వాటిలో అత్యాధునికమైనటువంటి
ఫీచర్లు సైతం తక్కువకే లభించటం వీటి ప్రత్యేకతను
తెలుపుతున్నాయి. ప్రస్తుత తరంలో అతి తక్కువ ధరకే రూ.18వేల నుంచి లభిస్తున్నాయి. దీంతో
వీటిని వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
గతంలో 100 మందిలో 12 మంది వద్ద మాత్రమే కంప్యూటర్స్ ఉంటే, ప్రస్తుతం ఆ స్ధానాన్ని ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నాయి.
గత రెండు సంవత్సరాల్లో కంప్యూటర్లను కొనుగోలు
చేసే వారిలో ఎక్కువ మంది డెస్క్‌టాప్‌ల కంటే, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు వైపే మెగ్గు చూపుతున్నట్లు పలు
సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారత్‌లో
ల్యాప్‌టాప్ వినియోగదారులను సర్వే
చేయగా వారు
తాము కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని ప్రశిస్తే, తాము
కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ తాము ఇండోర్‌లో ఉన్నసమయంలోనూ
వర్క్ చేసుకోవటానికి అనుకూలంగా ఉండటమే కారణంగా తెలిపారు. మరొక విషయం ఏమిటంటే..తాము ఏ ల్యాప్‌టాప్ ఛాసిస్
ధృఢంగానూ, దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవటానికి
అనుకూలంగా ఉంటుందో ఆ ల్యాప్‌టాప్‌నే
కొనుగోలు
చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఇంటర్నల్‌గా బ్లూటూత్, వైర్‌లెస్ టెక్నాలజీ ఉన్నట్లయితే వాటితో ప్రయివేట్ ఛాటింగ్
చేసుకోవటం ఎంతో సులభమని పలువురు భారతీయ
యువతీయువకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధృఢంగానూ
అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకొన్నటువంటి ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న మోడల్ తొషిబా కంపెనీకి
చెందినది. ఎందువల్ల అంటే దీన్ని
అత్యాధునికమైనటువంటి పాలిమర్ మెటీరియల్ నుంచి తయారుచేశారు. ఇది గీతలు, మంటలు, నీటిలో తడిసినా అందులోని డేటాకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.
మారుతున్న టెక్నాలజీ..
ట్రస్టడ్ ఫ్లాట్‌ఫామ్ మాడ్యుల్ (టిఎమ్‌పి)ను స్టాండర్డ్‌గా
కంప్యూటర్ తయారీ కంపెనీలు తీసుకొన్నాయి. దీని
ఆధారంగానే కంప్యూటర్ తయారీ కంపెనీలు ఒక అలయెన్స్‌గా ఒప్పందం ప్రకారం హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటానికి
వీలు కల్పిస్తున్నాయి. దీని వల్ల
వినియోగదారులు తమకు నచ్చిన ప్రకారం
ల్యాప్‌టాప్‌ను
మార్చుకునే సౌలభ్యం ప్రస్తుత టెక్నాలజీ వల్ల సాధ్యమౌతోంది. అంతేగాక ఈ టిఎమ్‌పి వల్ల హార్డ్‌వేర్‌కు రక్షణ ఏర్పాట్లు
కలగటమేగాక, ఇతరుల నుంచి చౌర్యం చేసినటువంటి ల్యాప్‌టాప్‌లను ఇట్టే సులభంగా
తెలుసుకోవచ్చు. అంటే...సెక్యూరిటీ అనేది
అంతర్గతంగా ల్యాప్‌టాప్‌లో పొందుపరచటం వల్ల అల్గారిథమ్స్
ఎంబీడెడ్ ఆధారంగా మైక్రోచిప్‌ను ఇందులో అమరుస్తారు. ఈ మైక్రోచిప్ ద్వారా టిఎమ్‌పి ఎన్‌క్రిప్షన్‌గా ఉండటం వల్ల
హార్డ్‌డిస్క్‌లో ఉన్నటువంటి డేటాకు రక్షణగా
నిలుస్తుంది.
ఈ టిపిఎమ్ సిస్టమ్ ఆధారంగా ఏ ల్యాప్‌టాప్ నెట్‌వర్క్ సిస్టమ్స్ పని చేస్తాయో, ఆ
నెట్‌వర్క్‌లోకి మీరు అక్రమంగా ప్రవేశించాలని
ప్రయత్నిస్తే,
అది దుర్లభం. అంతేగాక అందులోకి మీరు
యూజర్ నేమ్,
పాస్‌వర్డ్‌ను తప్పకుండా ఎంటర్ చేయాలి. సరైన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయకపోతే మీరు
ప్రవేశించటం అడ్డుకోవటమే గాక, మీరు అక్రమంగా నెట్‌వర్క్‌లోకి
చొరబడుతున్నారని సర్వర్‌ని అలర్ట్ చేస్తుంది. పదేపదే మీరు
అక్రమంగా ప్రవేశించటానికి ప్రయత్నిస్తే మీ సిస్టమ్‌ను హ్యాంగ్
చేయగల సత్తా ఈ టెక్నాలజీకి ఉంది. ఇందులోనూ అప్‌గ్రేడ్ టెక్నాలజీ
సైతం వచ్చింది. దీని సాయంతో మీరు సిస్టమ్‌కు ఫింగర్ ప్రింట్, లేకపోతే
బయో మెట్రిక్ ఆధారిత టెక్నాలజీని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇతరులు ఎవ్వరూ అక్రమంగా డేటాను చోరీ చేయలేరు.