Ad Code

ఒకాయా ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్


దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు రోజురోజుకి డిమాండ్​ పెరుగుతోంది. దీంతో ఈ మార్కెట్​ను క్యాష్​ చేసుకునేందుకు ఆటో కంపెనీలు పోటీపోటీగా ఇ-స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు కూడా ఇందులో అడుగుపెడుతున్నాయి. తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్​ ప్రొవైడర్​ ఒకాయా గ్రూప్​ ఫ్రీడమ్​ పేరుతో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసింది. దీని ధరను రూ. 69,900 గా నిర్ణయించింది. ఒకాయా ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్​లో విక్రయిస్తోంది. అవియోన్ ఐక్యూ సిరీస్, క్లాస్ఐక్యూ సిరీస్ పేర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మూడవ ఉత్పత్తిగా విడుదలైన ఫ్రీడమ్ మోడల్​​ లిథియం అయాన్, లెడ్​ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.

250 కిలోమీటర్ల రేంజ్

హిమాచల్​ ప్రదేశ్​లోని బద్ది తయారీ యూనిట్​లో దీన్ని రూపొందించినట్లు ఒకాయా​ వెల్లడించింది. ఈ కొత్త మోడల్​ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లో స్పీడ్​, హై స్పీడ్ ట్రిమ్​ వేరియంట్లు కూడా ఉంటాయి. ఈ స్కూటర్లు ఒక్కో ఛార్జ్​కి గరిష్టంగా 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ కొత్త స్కూటర్​ లాంచింగ్​​పై ఒకాయా పవర్​ గ్రూప్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అనిల్​ గుప్తా మాట్లాడుతూ " భారత్​లో ఎలక్ట్రిక్ మార్కెట్​ ఆశాజనకంగా ఉంది. ఈ మార్కెట్​ భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ప్రతి భారతీయుడికి తాము పెట్టిన డబ్బకు అధిక నాణ్యత, విలువను అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇప్పటికే ఎనర్జీ సొల్యూషన్స్​ వ్యాపారంలో ఉన్నందున ఈ-మార్కెట్​లో మాకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నాం" అని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu