Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label electric scooter. Show all posts
Showing posts with label electric scooter. Show all posts

Monday, September 25, 2023

కోమాకి LY ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్ ఆఫర్ !


కోమాకి తన LY ఎలక్ట్రిక్ స్కూటర్ పైన భారీగా 21 వేల రూపాయల ధరను తగ్గించి కస్టమర్ల కోసం ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ అసలు ధర రూ.1,34,999 రూపాయలు కలదు. ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,13,999 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ఆఫర్లను ప్రకటించింది. ఈ తగ్గింపు దీపావళి వరకు ఇండియా మొత్తం అందుబాటులో కలదు. కోమాకి LY ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు బ్యాటరీలు కలవు వీటిని ఎక్కడికైనా మనం తీసుకు వెళ్ళవచ్చట.. ఒక్కొక్క బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ కావడానికి సుమారుగా ఐదు గంటల సమయం కంటే తక్కువగా పడుతుందట. అన్ బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ కాలింగ్, సౌండ్ సిస్టమ్ వంటివి కలవు.. అలాగే TFT స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూడు గేర్ మోడ్ లు ఉంటాయట. టర్బో ఎల్ఈడి ఫ్రెంట్ వింకర్లు..3000 W అబ్ మోటర్ పార్కింగ్ అసిస్టెంట్ హూ ఇస్ కంట్రోల్ రివర్స్ అసిస్టెంట్ ఇతర ఫీచర్స్ సైతం ఇందులో కలిగి ఉన్నాయి. రెండు బ్యాటరీలు కలిపి స్కూటర్ చార్జింగ్ చేసినట్లు అయితే 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఒక్కో బ్యాటరీ 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కొమాకి గరిష్ట వేగం 55 నుంచి 60 KM వేగంతో ప్రయాణిస్తుంది. ఏడాది ఆగస్టు నెలలో ఈ బైక్ కు సంబంధించి భద్రత ఫీచర్స్ అదనపు వాటిని అప్గ్రేట్ చేసిందట. ఇవి కూడా అగ్ని నిరోధకతను కలిగి ఉంటుంది. కేవలం నాలుగు గంటలలోనే 90 శాతం వరకు చార్జింగ్ను చేయగలవు. 

Wednesday, September 20, 2023

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ !


ఓలా అద్భుతమైన ఆఫర్స్, డీల్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో ఉన్న అన్ని ఇ-స్కూటర్లకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఇవన్నీ లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ మాత్రమే. ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న వివరాల ప్రకారం, కస్టమర్లు ఓలా ఎస్1 లైనప్‌లోని స్కూటర్లు కొంటే రూ. 19,500 లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపును పొందవచ్చు.  ఇది కాకుండా, కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీలపై 50 శాతం తగ్గింపు, జీరో ప్రాసెసింగ్ ఫీజ్, జీరో-కాస్ట్ ఈఎంఐ లాంటి పలు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. ఓలా ఎస్1 లైనప్‌లో ఉన్న ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1ఎక్స్ మోడల్స్‌కు ఈ ఆఫర్స్ లభిస్తాయి. ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1.47 లక్షలు, ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ.1.1 లక్షలు, ఓలా ఎస్1ఎక్స్ ప్రారంభ ధర రూ.89,999. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. రాష్ట్రాలు, నగరాలను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు. సమీపంలో ఉన్న ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని ఎస్1 మోడల్స్ యజమానులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి, కంపెనీ బీటా వెర్షన్‌లో MoveOS 4.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వర్షన్ పరిమిత కస్టమర్లకు అందుబాటులో ఉంది. చివరి వర్షన్ అక్టోబర్ 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్‌గా అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో 20 పైగా కొత్త ఫీచర్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని సెగ్మెంట్‌లో మరింత అధునాతనంగా మార్చేందుకు ఈ అప్‌డేట్ ఉపయోగపడుతుంది. MoveOS 4.0 బీటా వర్షన్‌లో ఓలా మ్యాప్ కూడా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కంపెనీ రూపొందించిన మ్యాప్. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించడం ద్వారా రైడింగ్ సున్నితంగా, సులభంగా మారుతుంది.

Friday, September 1, 2023

అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ హవా !


ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కాలంగా ఈవీ టూవీలర్  సెగ్మెంట్‌లో మార్కెట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆగస్టులో 19వేల యూనిట్ల అమ్మకాలతో 400 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 30శాతం మార్కెట్ వాటాను ఓలా సొంతం చేసుకుంది. ఆగస్టులో Ola Gen-1 నుంచి Gen-2కి మారింది. ఈ కాలంలో కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని కూడా విస్తరించింది. ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ  'ఆగస్టులో మా పోర్ట్‌ఫోలియోను అన్ని ప్రముఖ ధరల పాయింట్లలో 5 స్కూటర్లకు విస్తరించాం. సరికొత్త S1 లైనప్ ఈవీ స్కూటర్లను వేగవంతం చేయడం జరిగింది. పండుగల సీజన్‌తో ఈ కాలంలో బలమైన అమ్మకాలను ఆశిస్తున్నాం. అధిక వినియోగదారుల డిమాండ్ కారణంగా ఈవీ పరిశ్రమ ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్‌ను చూస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ఓలా లేటెస్ట్ S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోకు అద్భుతమైన స్పందన లభించిందని అగర్వాల్ తెలిపారు. ఓలా S1 స్కూటర్ లాంచ్ అయిన 2 వారాల్లోనే 75వేల బుకింగ్‌లను పొందింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పెంచడానికి, మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి 3 షిఫ్టులలో పనిచేస్తుంది. ఓలా వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన S1 Pro, S1 Air , S1X+, S1X (3kWh), S1X (2kWh) సరికొత్త, అత్యంత అధునాతనమైన Gen-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించినట్టు ఓలా సీఈఓ పేర్కొన్నారు. ఓలా S1ప్రో స్కూటర్.. రూ. 1,47,499 ధరతో, (Gen-2 S1 Pro) ఇప్పుడు ట్విన్-ఫోర్క్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్‌తో పాటు మెరుగైన 195kతో వస్తుంది. 120కి.మీ పరిధిని అందిస్తుంది. ఇప్పటికే, S1 ప్రో Gen 2 కొనుగోలు విండో ఓపెన్ అయింది. అయితే స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమవుతాయి. ఓలా S1 ఎయిర్ స్కూటర్ ధర రూ. 1,19,999, S1 ఎయిర్ బలమైన 3kWh బ్యాటరీ కెపాసిటీ, 6kW గరిష్ట మోటార్ పవర్, 151కి.మీ సర్టిఫైడ్ రేంజ్, 90కి.మీ/గంట గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఇటీవల 100 కన్నా ఎక్కువ నగరాల్లో S1 ఎయిర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ ICE-కిల్లర్ స్కూటర్ S1X మోడల్‌పై అన్ని రకాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) అనే మొత్తం 3 వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. అయితే, S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ శక్తివంతమైన 6kW మోటార్, 3kWh బ్యాటరీ, 151కి.మీ పరిధి, 90 km/h గరిష్ట వేగంతో వస్తాయి. S1 X (2kWh) శక్తివంతమైన 6kW మోటార్‌తో కూడా వస్తుంది. ఇందులో 91కి.మీ పరిధి, గరిష్ట వేగం గంటకు 85కి.మీ అందిస్తుంది. S1X+ మోడల్ స్కూటర్ ధర రూ. 109,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం, S1 X (3kWh), S1 X (2kWh) ప్రీ-రిజర్వేషన్ విండో రూ. 999గా కొనసాగుతోంది. ఈ స్కూటర్ల డెలివరీలు డిసెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఓలా S1X (3kWh), S1 X (2kWh) స్కూటర్ల ధర రూ. 99,999, రూ. 89,999 మధ్య అందుబాటులో ఉన్నాయి.

Thursday, August 24, 2023

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


టీవీఎస్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. భారత్ సహా విదేశాలలో మిలీనియల్స్, Gen Z జనాభాను లక్ష్యంగా చేసుకుని ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ టూ-వీలర్ ని కంపెనీ ఆవిష్కరించింది. రూ. 2.50 లక్షల ప్రారంభ ధరతో వచ్చింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం హై-పర్పార్మెన్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 4.44kWh కేపాసిటీ ఎనర్జీని అందిస్తుంది, 2.6 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని గరిష్టంగా 105kmph వేగంతో వస్తుంది. టీవీఎస్ మోటార్‌లో అంతర్గతంగా అభివృద్ధి చేసిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పవర్ ప్లోను నిరంతరం మానిటరింగ్ చేయడం ద్వారా సెల్‌ సేఫ్ ఆపరేషన్, సుదీర్ఘ లైఫ్ టైమ్ అందిస్తుంది. 50 నిమిషాల్లో 0-50 శాతం (ఆప్షనల్ యాడ్-ఆన్ 3 kW ఫాస్ట్ ఛార్జర్) లేదా పోర్టబుల్ ఛార్జర్ 4 గంటల 30 నిమిషాల్లో (950W ఛార్జర్), 0-80 శాతం డెలివరీ చేయగల స్మార్ట్ X హోమ్ రాపిడ్ ఛార్జర్ ఆప్షన్‌ను కస్టమర్లు పొందవచ్చు. TVS X థ్రిల్-ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 2,49,990 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు), పోర్టబుల్ 950W ఛార్జర్‌లతో రూ. 16,275 (GSTతో సహా), 3kW స్మార్ట్ X హోమ్ రాపిడ్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుందని దుబాయ్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. TVS X స్కూటర్ బుకింగ్‌లు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ముందుగా.. 15 నగరాల్లో డెలివరీలు నవంబర్ 2023 నుంచి దశల వారీగా ప్రారంభం అవుతాయని, మోడల్‌కు ప్రభుత్వ FAME ప్రోత్సాహకం వర్తించదని రాధాకృష్ణన్ అన్నారు. TVS మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ.. 'మిలీనియల్స్, Gen Z వంటి కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నాం. హరిత, మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో అంకితభావం ఈ అద్భుతమైన స్కూటర్‌ను తీసుకువచ్చింది. సాధారణంగా మిలీనియల్స్ అంటే.. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వ్యక్తులు, అలాగే, 1996 నుంచి 2010 మధ్య జన్మించిన వారిని Gen Z (జనరేషన్ Z)గా సూచిస్తారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడల్ ప్రపంచ పౌరుల కోసం రూపొందించింది. ప్రీమియం ఇంకా స్థిరమైన టెక్నాలజీతో అభివృద్ధి చెందిన మొబిలిటీ సొల్యూషన్‌ల వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉందని వేణు చెప్పారు. కొత్త మోడల్ ఉత్పత్తి కోసం కంపెనీ మూలధన వ్యయంగా రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో విక్రయించడంతో పాటు, బంగ్లాదేశ్, నేపాల్, యూరప్ లాటిన్ అమెరికాలకు కూడా మోడల్‌ను ఎగుమతి చేయడానికి కంపెనీ దృష్టి సారిస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 10.2-అంగుళాల HD+ TFT టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఈ క్లాసులో ఇదే అతిపెద్దది, రైడర్‌కు నావిగేషన్, మ్యూజిక్, వీడియో ఆఫర్‌లు, గేమింగ్ ఆప్షన్లను అందిస్తుంది.

ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ప్రారంభం !


ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన సరికొత్త S1 ఎయిర్‌లను డెలివరీ చేయడం ప్రారంభించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే, S1 ఎయిర్ స్కూటర్లు 50వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. S1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలతో ప్రారంభమైంది. అయితే, ఆ తరువాత సవరించగా.. అప్పటి నుంచి ఎక్స్-షోరూమ్ రూ. 1.20 లక్షలకు విక్రయిస్తోంది. దేశంలోని 100కి పైగా నగరాల్లో డెలివరీలను ప్రారంభించామని, త్వరలో మరిన్ని అనుసరించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. S1 ఎయిర్ 3.0kWh బ్యాటరీ ప్యాక్, 58Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 8.5 kW మోటార్‌ను ఉపయోగిస్తుంది. 3.3 సెకన్లలో 0 నుంచి 40kmph వరకు దూసుకెళ్లగలదు. అలాగే, 90kmph వద్ద గరిష్ట వేగంతో ఒకే ఛార్జ్‌పై 151కి.మీ పరిధిని అందిస్తుంది. 5 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా, S1 ఎయిర్‌ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, 2 చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, GPS, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల FT డాష్‌బోర్డ్ ఉన్నాయి. S1 ఎయిర్ స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూతో సహా 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. వందకన్నా ఎక్కువ నగరాల్లో ఓలా S1 ఎయిర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఇతర మార్కెట్‌లలోనూ ఓలా S1 ఎయిర్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఓలా S1 ఎయిర్ ఈవీ స్కూటర్‌ను EMI ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లోనూ ఫైనాన్స్ ఆప్షన్‌తో S1 ఎయిర్ కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి బ్యాంకులన్నీ EMI ఆప్షన్ ద్వారా అందిస్తున్నాయి.

ఓలా S1 ఎయిర్ ధర రూ.1,19,999 ఉండగా, EMI ఆప్షన్ కింద వడ్డీ రేటు 8.9 శాతం అందిస్తుంది. రూ.10 వేలు డౌన్‌పేమెంట్ చెల్లించడం ద్వారా మిగిలిన రూ.1,09,999పై లోన్ పొందవచ్చు. 48 నెలల EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.2,730 EMI, 36 నెలల ఆప్షన్‌పై నెలకు రూ.3,491 EMI చెల్లించాలి. 24 నెలల ఆప్షన్ ద్వారా నెలకు ఈఎంఐ రూ.5,018, 12 నెలల వ్యవధిలో నెలకు ఈఎంఐ రూ.9,612 చెల్లించాలి. అయితే, ఈ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదని గమనించాలి. కస్టమర్ల ప్రొఫైల్‌ ఆధారంగా వడ్డీ రేటుకే ఓలా S1 ఎయిర్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు.

Wednesday, August 16, 2023

హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లలో హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ కూడా ఒకటి. దీని ధర తక్కువగానే ఉంది. అలాగే ఫీచర్లు కూడా బాగున్నాయి.  హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 86,540గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఇది బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్‌డ్యాష్ బాటిల్ హోల్డర్, స్ల్పిట్ ఫోల్డింగ్ సీటు, కాంబీ బ్రేక్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పోర్టబుల్ బ్యాటరీ, అలాయ్ వీల్స్, యూఎస్‌బీ పోర్ట్, టెలీ స్కోపిక్ సన్సెన్షన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. మోటార్ పవర్ 1350 వాట్స్. క్రూయిజ్ కంట్రోల్ లేదు. డబుల్ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ 30 ఏహెచ్. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 138 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. 20 పైసలుతో కిలోమీటర్ వెళ్లొచ్చు. అటే రూ.10 ఖర్చుతో 50 కిలోమీటర్లు వెళ్లొచ్చని చెప్పుకోవచ్చు. కంపెనీ ఆప్టిమా సీఎక్స్ 2.0 మోడల్ అదిస్తోంది. దీని ధర రూ. 1.06 లక్షలు. అలాగే ఆప్టిమా సీఎక్స్ 5.0 మోడల్ కూడా ఉంది. దీని ధర రూ.1.29 లక్షలు. ఇక హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ ఎల్‌పీ మోడల్ కూడా ఉంది. దీని ధర రూ.1.10 లక్షలు. ఈ స్కూటర్లు అన్నింటికీ టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు ఉంటుంది. అయితే స్కూటర్ రేంజ్ మాత్రం మారుతూ ఉంటుంది. 

Saturday, July 29, 2023

ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించిన ఓలా !


లక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్‌ 1 ఎయిర్ మోడల్స్‌ ఫోకస్‌ పెట్టనుంది. ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ లాంచింగ్‌ సందర్బంగా ఎస్1​ స్కూటర్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్‌లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్‌ 1 వేరియంట్‌ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. ఎస్‌1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్‌లు ప్లాన్‌లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్‌లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్‌1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్‌ పొందడం. ఎస్‌ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్‌లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్​ స్కూటర్‌ ఓల్​ ఎస్​1 ఎయిర్​ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్‌లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్‌ షురూ అవుతుంది. ఎస్‌1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎయిర్‌ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్‌ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.   https://t.me/offerbazaramzon

Friday, July 28, 2023

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8 !


ధ్యప్రదేశ్ కు సంబందించిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్‌8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవడంతో పాటు సింగిల్‌ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాంబియర్ ఎన్‌8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.. ఇది కంపెనీ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది.. ఈ ప్రత్యేక యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్‌8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది - గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ కలర్లో లభిస్తున్నాయి.. ఈ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌ పై 200 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్‌ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.. మార్కెట్ లోకి వచ్చిన వెంటనే వీటికి డిమాండ్ కూడా పెరిగింది. https://t.me/offerbazaramzon

Thursday, July 20, 2023

యో ఎడ్జ్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ !


యో బైక్స్ కంపెనీ యో ఎడ్జ్ డీఎక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. దీనిపై మూడేళ్ల వరకు వారంటీ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 145 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, బెటర్ అండ్ బిగ్గర్ సీటు, డిజిటల్ డిస్‌ప్లే, 3 ఇన్ 1 లాకింగ్ సిస్టమ్, కీలెస్ స్టార్ట్ ఆప్షన్, మల్టీపుల్ రైడింగ్స్, రివర్స్ మోడ్, ఇన్‌బిల్ట్ మొబైల్ చార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా ఎల్ఈడీ లైట్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, లిథియం అయాన్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్ సొంతం. ఒక్కసారి చార్జింగ్ పడెతే 60 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. చార్జింగ్ టైమ్ 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కేజీల వరకు బరువును లాగగలదు. అందువల్ల మరీ ఎక్కువ బరువును ఉన్న వారు ఈ స్కూటర్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. పిలల్లను స్కూల్‌కు తీసుకువెళ్లడానికి, బజారుకు వెళ్లి కూరగాయలు కొనడానికి వంటి వాటిని ఈ స్కూటర్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధర కూడా తక్కువ. దీని రేటు రూ. 49,000 వేల నుంచి ప్రారంభం అవుతోంది. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. వివిధ కలర్ ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. అందువల్ల మీకు నచ్చిన కలర్ ఆప్ష్ కూడా ఎంచుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Friday, July 14, 2023

iVOOMi S1 ఎలక్ట్రిక్ స్కూటర్ !


iVOOMi S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి దాదాపు 3 నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల్లో ఇప్పటి వరకు వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంకా కస్టమర్ల నుండి చాలా సానుకూల స్పందనను అందుకుంటోంది. వాహన వినియోగదారులు కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఎంతో ఇష్టపడుతున్నారు. దీనికి శక్తివంతమైన మోటారును అందించారు, అలాగే 2,000 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుగా ఉంటుంది. అంతే కాదు, 60V/35Ah లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 115 కిలోమీటర్ల పరిధిని సులభంగా ప్రయాణించగలదు. ఇందులో అందించిన మోటారు తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట శక్తితో బలమైన పికప్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ స్కూటర్‌లో మీకు 55 కి.మీ/గంటకు వేగాన్ని అందించే గొప్ప స్పీడ్ అందించారు. ఈ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గొప్ప టాప్ స్పీడ్ అని రుజువు చేస్తుంది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ-స్కూటర్లకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలల్లో భారతదేశంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభించబడ్డాయి. అధునాతన బ్యాటరీ సాంకేతికత, మెరుగైన పనితీరు నుండి అధునాతన భద్రతా ఫీచర్‌లు ఇంకా స్మార్ట్ కనెక్టివిటీ వరకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు గతంలో కంటే మరింత సమర్థవంతంగా, యూజర్ ఫ్రెండ్లీ, పర్యావరణపరంగా స్థిరంగా ఉంటాయి.    https://t.me/offerbazaramzon

Tuesday, July 4, 2023

మాగ్నస్ ఎక్స్ పై భారీ తగ్గింపు !


లక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ యాంపియర్ మార్కెట్‌లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిల్లో మ్యాగ్నస్ ఈఎక్స్ కూడా ఒకటి.  ఒక్కసారి చార్జింగ్ పెడితే ఇది 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, గ్రే, బ్లూ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలోనే అందుకుంటుంది. ఇంకా పవర్‌ఫుల హబ్ మోటార్‌ అమర్చారు. రివర్స్ మోడ్ కూడా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ కావడానికి 6 నుంచి 7 గంటలు పడుతుది. రూ. 499తో ఈ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌పై 5 ఏళ్ల వరకు వారంటీ పొందొచ్చు. మూడేళ్ల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. అలాగే రూ. 4 వేలు కడితే ఎక్సెండెంట్ వారంటీ లభిస్తుంది. 2 ఏళ్లు ఈ వారంటీ వస్తుంది. ఇలా మొత్తంగా ఐదేళ్లు వారంటీ పొందొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర  రూ. 1,26,365గా ఉంది. ఇప్పుడు దీన్ని  రూ. 90 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 81,900. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూ. 8 వేలు. అంటే మీకు ఏకంగా రూ. 36 వేలకు పైగా తగ్గింపు లభిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు ఈ ఫెసిలిటీ పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈఎంఐ విషయానికి వస్తే నెలకు రూ. 2325 చెల్లిస్తే సరిపోతుంది. అయితే రూ. 27 వేల డౌన్ పేమెంట్ చెల్లించాలి. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. లేదంటే 30 నెలల వరకు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. రూ. 27 వేలు డౌన్ పేమెంట్ కట్టాలి. నెలకు రూ. 2670 పడుతుంది. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3191 కట్టాల్సి వస్తుంది. డౌన్ పేమెంట్ రూ. 27 వేలు కట్టాలి.  జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. 36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 3322 పడుతుంది. అదే 30 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3815 చెల్లించాలి. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 4559 పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 5808 చెల్లించాలి. ఏడాది పాటు ఈఎంఐ అయితే నెలకు రూ. 8316 పడుతుంది.   https://t.me/offerbazaramzon

Saturday, July 1, 2023

తక్కువ ధరలో ఎవోలెట్ పోనీ ఈ-స్కూటర్


వోలెట్ పోనీ అనే ఈవీ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇంకా ఈ స్కూటర్లు రెండు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో బేస్‌ మోడల్‌ పోనీ ధర రూ. 41,124గా ఉంటే, హై మోడల్ ధర రూ. 55,799గా ఉంది. ఎవోలెట్ పోనీ మోటారు 250 వాట్స్‌ కరెంటుని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవోలెట్ పోనీలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. పోనీ ఈజెడ్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇంకా అదే సమయంలో క్లాసిక్ వేరియంట్‌ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో మొత్తం 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెండింటి మాక్సిమం స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది. స్కూటర్ సీటు ఎత్తు మొత్తం 800 మిమీ ఉంటుంది. ఇంకా అలా కాకుండా ప్రామాణిక ఛార్జర్‌తో బ్యాటరీని 4 నుండి 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.ఈవోలెట్‌ పోనీ కొలతల పరంగా కంపెనీ అతి చిన్న ఈ-స్కూటర్. ఈ స్కూటర్ 250 వాట్ల పవర్ అవుట్‌పుట్‌తో వాటర్‌ప్రూఫ్ బీఎల్‌డీసీ మోటార్‌కు శక్తినిచ్చే లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇక పోలో పోనీ రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఈ పోలో పోనీ ఈజెడ్‌ 48వీ/24ఏహెచ్‌ వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీతో వస్తుంది. అలాగే 48వీ/24ఏహెచ్‌ లిథియం అయాన్ బ్యాటరీతో పోలో పోనీ క్లాసిక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎవోలెట్ పోనీని లీడ్-యాసిడ్ బ్యాటరీతో రావడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. https://t.me/offerbazaramzon

Sunday, June 25, 2023

ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


దేశీయ మార్కెట్ లోకి ఎల్ఎంఎల్ స్టార్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి రానున్నది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ. ఈ స్కూటీలో ఇంటరాక్టివ్ స్క్రీన్, ఫోటోసెన్సిటివ్ హెడ్‌ల్యాంప్, అడ్జస్టబుల్ సీటింగ్ వంటి ఫీచర్లు దీనికి సొంతం. ఇందులో ఇంకా 360 డిగ్రీ కెమెరా ఉంటుంది.. మొబైల్ కనెక్టివిటీ ఫెసిలిటీ, స్టార్ట్ బటన్, ఎల్ఈడీ లైట్, యూఎస్‌బీ పోర్ట్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఓడో మీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఇన్‌బిల్ట్ జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. మీకు నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు. ఫోన్ యాప్‌లో మీకు నచ్చిన పేరు లేదా కోట్స్ రాసుకోవచ్చు. అది మీ స్కూటర్ ముందు వైపున ఉన్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని ధర దాదాపు రూ. 1.4 లక్షల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే.. పలు బ్యాటరీ ఆప్షన్లలో ఈ స్కూటీ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది. అందువల్ల బ్యాటరీ ప్రాతిపదికన రేంజ్ కూడా మారే అవకాశం ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 150 నుంచి 225 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చని తెలుస్తుంది. బ్యాటరీ ఆప్షన్ ఆధారంగా రేంజ్ మారుతూ ఉండొచ్చు. ఇందులో 4 కేడబ్ల్యూహెచ్ వరకు కెపాసిటీతో బ్యాటరీ ప్యాక్ ఉండే ఛాన్స్ ఉంది.  https://t.me/offerbazaramzon

Thursday, June 22, 2023

అప్‌గ్రేడ్ ఫీచర్లతో కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్‌ !

                                       


ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి  రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే 3 వేరియంట్‌లలో తీసుకొచ్చింది.   Komaki SE ఎకో కోసం 75-90km, Komaki SE స్పోర్ట్ కోసం 110-140km, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కోసం 150-180km పరిధిగా అందిస్తుంది. 2023 Komaki SE ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి. Komaki SE Eco : రూ. 96,968, Komaki SE స్పోర్ట్ : రూ. 1,29,938, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ : రూ. 1,38,427. కొమాకి ఎకో స్పీడ్ లిమిట్ 55-60km అయితే, Komaki SE స్పోర్ట్, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ 75-80km వేగాన్ని అందిస్తుంది.ఎలక్ట్రిక్ స్కూటర్ LiFePO4 బ్యాటరీతో 3kW హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ టర్బో అనే 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో SE 20-లీటర్ బూట్‌ను కలిగి ఉంది. 2023 కొమాకి SE పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. LED ఫ్రంట్ వింకర్‌లు, LED DRLలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ విగేషన్, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్‌లను అందిస్తుంది. కొమాకి SE ఇప్పటికే కొనుగోలుదారులకు ఇష్టమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో స్టైల్‌తో క్లీన్ అండ్ సేఫ్ రైడ్ సెర్చ్ చేస్తున్న రైడర్‌లకు ఇది కచ్చితంగా సరైన ఆప్షన్ అందిస్తుందని డైరెక్టర్, గుంజన్ మల్హోత్రా అన్నారు.  https://t.me/offerbazaramzon

Sunday, June 11, 2023

బిజినెస్‌లైట్ ఇన్‌స్టా చార్జ్‌డ్ బై లాగ్9 !

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్‌ 4 గంటలకు పైనే సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ఉపయోగిస్తే 2 గంటల వరకు టైమ్ పట్టొచ్చు. ఇలా మీరు ఎలా అయినా కనీసం 2 గంటల పాటు అయినా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 గంటల పాటు వేచి ఉండాలంటే ఓపిక కావాల్సిందే. ఇంట్లో అయితే రాత్రి పూట చార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే బయటకు వెళ్లినప్పుడు ఇంత టైమ్ వెయిట్ చేయాలంటే కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఒక స్టార్టప్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీని తీసుకువస్తోంది. బెంగళూరుకు చెందిన టెక్ అండ్ బ్యాటరీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఈవీ తయారీ కంపెనీ క్వాంటం ఎనర్జీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు కంపెనీలు సంయుక్తంగా ఫాస్టెస్ట్ చార్జింగ్ టూవీలర్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్2ను ఆవిష్కరించాయి. దీని పేరు బిజినెస్‌లైట్ ఇన్‌స్టా చార్జ్‌డ్ బై లాగ్9. ఇందులో లాగ్9 ర్యాపిడిస్ 2000 బ్యాటరీస్ టెక్నాలజీతో తయారు చేశారు. 12 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇరు కంపెనీలు 2024 మర్చి కల్లా 10 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. త్వరలోనే ఇరు కంపెనీలు హైదరాబాద్‌లో 200 బిజినెస్‌లైట్ ఇ2వీలర్లను తీసుకురానున్నాయి. కంపెనీలు దీని కోసం విజ్జీ లాజిస్టక్స్‌తో కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ కస్టమర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్లను డెలివరీ చేయనుంది. కాగా క్వాంటం కంపెనీ బిజినెస్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇప్పటికే అందిస్తోంది. బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. ఇది కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కంపెనీ ఇందులో 1200 వాట్ మోటార్‌ను అమర్చింది. ఇందులో రిమోట్ లాక్ అన్‌లాక్, రివర్స్ మోడ్, యాంటీ థెఫ్ట్ అలాంరం, బూస్ట్ స్పీడ్, డ్రైవింగ్ మోడ్స్ అనే ఫీచర్లు ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. దీని ధర రూ. 95,865గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. అంటే ఆన్‌ రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి ఉంటాయి. అందువల్ల ధర రూ.లక్ష వరకు చేరొచ్చు. offerbazar24/7

Saturday, May 27, 2023

యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కోమాకి టిఎన్ 95 ఎలక్ట్రిక్ స్కూటర్ !


దేశీయ మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కోమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కోమాకి ఈవీ స్కూటర్ధర రూ. 1,31,035 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ బైకులో మోడల్ యాంటీ-స్కిడ్ టెక్నాలజీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాప్-ఆధారిత స్మార్ట్ బ్యాటరీలతో వస్తుంది. ఇందులోని బ్యాటరీలు అగ్ని-నిరోధకతను కలిగి ఉంటాయి. డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ కంట్రోల్ కొత్త కీ ఫోబ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట స్పీడ్ గంటకు 85కిమీ దూసుకెళ్తుంది. ఇందులో 18-లీటర్ బూట్ కూడా ఉంది. 2023 Komaki TN 95 ప్రత్యేక ఫీచర్లలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్, LED DRL, LED ఫ్రంట్ వింకర్‌లు, TFT స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, ఆన్-రైడ్ కాలింగ్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. కొమాకి బైకులో మెటల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. 5kW హబ్ మోటార్ ద్వారా పవర్ అందిస్తుంది. 50amp కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 3 గేర్ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్బో రీజెన్‌తో వచ్చాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. 2023 Komaki TN 95 స్కూటర్130-150km, 150-180km పరిధిని బట్టి రెండు వేరియంట్‌లలో అందిస్తోంది. 

Tuesday, May 23, 2023

దేశీయ మార్కెట్లోకి సింపుల్ వన్ ఈ-స్కూటర్‌ !


దేశీయ మార్కెట్లోకి 'సింపుల్ ఎనర్జీ' ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. దీని ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిజిటల్ డిస్‌ప్లేపై నేవీగేషన్‌, డాక్యుమెంట్ స్టోరేజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌, ఓటీఏ అప్ డేట్స్, బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు కనిపిస్తాయి. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 212 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 5.54 గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. కేవలం 2.77 సెకన్లలో 40 కి.మీ.వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో నిమిషం పాటు చార్జింగ్ చేస్తే 1.5 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ స్కూటర్ పని చేస్తుంది. ఈ మోటార్ 72 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూజర్లకు అందుబాటులో ఉంది. బ్రెజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రాజెన్ ఎక్స్, లైట్ ఎక్స్ రంగుల్లో లభిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి అవసరమైన పరికరాల్లో 95 శాతం దేశీయంగా సమకూర్చుకున్నామని సింపుల్ ఎనర్జీ ఫౌండర్‌, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. ఐపీ67 రేటింగ్‌తో కూడిన ఈ స్కూటర్‌ల్ 5 కిలోవాట్ల లిథియం అయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత స్మార్ట్‌గా ఉండే ఈ స్కూటర్ సుదీర్ఘ దూరం ప్రయాణించగలుగుతుందని, డ్యుయల్ బ్యాటరీ దీని ప్రత్యేకత అని చెప్పారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది. 750 వాట్ల పోర్టబుల్ చార్జర్ కోసం అదనంగా రూ.13 వేలు పే చేయాలి. వచ్చేనెల ఆరో తేదీ నుంచి స్కూటర్ల డెలివరీ ప్రారంభిస్తారు. తొలుత బెంగళూరు నుంచి ప్రారంభించి దశల వారీగా మిగతా నగరాల్లో డెలివరీలు చేస్తారు. ఇప్పటికే గత 18 నెలల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లక్షకు పైగా ప్రీ-బుకింగ్స్ నమోదయ్యాయి. సింపుల్ ఎనర్జీ 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' భారత్ మార్కెట్లో ఎథేర్ 450, ఓలా ఎస్1, టీవీఎస్ ఐ-క్యూబ్ వంటి స్కూటర్లతో తల పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని షూలాగిరిలో సింపుల్ విజన్ 1.0 అనే పేరుతో నూతన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది సింపుల్ ఎనర్జీ. ఇది ఏటా దాదాపు ఐదు లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.

Sunday, May 21, 2023

బ్యాట్ రే కంపెనీ స్టోర్ ఐఈ స్కూటర్ !


బ్యాట్ రే కంపెనీ స్టోర్ ఐఈ స్కూటర్ ని మార్కెట్లో లాంచ్ చేసింది. మంచి రెట్రో లుక్ తో ఈ స్కూటర్ కిక్కెక్కిస్తోంది. దీని ధర విషయానికి వస్తే రూ. 89,600గా ఉంది. బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇంకా పలు రకాల డ్రైవింగ్ మోడ్లతో విశేషమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది.అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కబ్బీ స్టోరేజ్ ఉంటుంది.యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. సైడ్ అద్దాల రియర్ వ్యూ చాలా చక్కగా ఉంటుంది. ఇంకా నైట్ హెడ్ ల్యాంప్ ఆన్ చేస్తే హార్న్ సౌండ్ తగ్గుతుంది. అలాగే ముందువైపు వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. హ్యాండిల్ కు కుడి వైపున స్కూటర్ రైడింగ్ మోడ్లను చేంజ్ చేసుకొనే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే రివర్స్ మోడ్ కూడా ఉంటుంది.బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 89,600 ఎక్స్ షోరూం ఉంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్ ఇంకా కంఫర్ట్ అనే డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో రకమైన టాప్ స్పీడ్ అనేది ఉంటుంది.అయితే టాప్ స్పీడ్ ఒక్కటే ఈ మోడ్లలో తేడా ఉంటుంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 132 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. దీని సీటు వెడల్పుగా స్టిఫ్ గా ఉంటుంది. అలాగే డైరెక్ట్ సన్ లైట్లో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వినియోగించడం కూడా కాస్త కష్టమవుతుంది. ఇంకా అలాగే హెడ్ ల్యాంప్ లో హాలోజెన్ ల్యాంప్ ను వినియోగించారు.

Saturday, May 20, 2023

రూ. 32,500 లకే ఎలక్ట్రిక్ స్కూటర్ !


వెలెవ్ మోటార్స్ వెవ్ 01 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 32,500. ఈ ధర స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఐకూ , షావోమి, శాంసంగ్ వంటి కంపెనీలు అందించే పలు మోడళ్ల ధరలో సగం రేటుకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఐకూ 11 స్మార్ట్ ధర రూ. 60 వేల వరకు ఉంది. షావోమి 13 ప్రో ధర అయితే రూ. 80 వేల వరకు ఉంది. అంటే మీరు ఫోన్ ధరలో సగం రేటుకే ఈ స్కూటర్‌ను ఇంటికి తీసుకువెళ్లొచ్చు. ఈ స్కూటర్‌లో బీఎల్‌డీసీ హబ్ మోటార్ ఉంటుంది. దీని కెపాసిటీ 250 వాట్స్. లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీని కెపాసిటీ 48వీ 20 ఏహెచ్. అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. చార్జింగ్ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఇంకా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఈ స్కూటర్ రెడ్, బ్లూ, యెల్లో రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేసే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ధర ఎక్కువ అయినా పర్వాలేదు అని అనుకుంటే.. అప్పుడు ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించొచ్చు. దాదాపు చాలా వాటి ధర రూ. లక్షకు అటు ఇటుగా ఉన్నాయి. అయితే మీరు డబ్బులు పెట్టే కొద్ది ఫీచర్లు కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక స్పీడ్‌తో దూసుకుపోవచ్చు. కొన్ని స్కూటర్ అయితే ఏకంగా 300 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉన్నాయి. టాప్ స్పీడ్ 100 కి.మీ.

Tuesday, May 2, 2023

ఓలా ఎలక్ట్రిక్ 40% వాటా కైవసం !


ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్‌ లో విక్రయాల గణాంకాలను అధికారికంగా ప్రకటించింది. ఈవీ స్కూటర్ మార్కెట్‌లో 40 శాతం వాటాను ఓలా కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో 30వేల యూనిట్లకు పైగా విక్రయించి అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. వరుసగా 8 నెలల పాటు అమ్మకాల పట్టికలో ఓలా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా స్కూటర్ విక్రయాల్లో ఏకంగా 40శాతం వాటాను అధిగమించి టాప్ ప్లేసులో నిలిచింది. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు ఎక్కువగా ప్రపంచ స్థాయి EV ప్రొడక్టులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఓలా సేల్స్ మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి విస్తరిస్తున్నామని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ అన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి D2C నెట్‌వర్క్‌ను భారీగా పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఓలా ఆఫ్‌లైన్ స్టోర్లను విస్తరిస్తున్నట్టు చెప్పారు. దేశంలో 500వ ECని త్వరలో ప్రారంభించేందుకు రెడీగా ఉందన్నారు. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి రెట్టింపు చేయాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు. ఈ సెంటర్లను ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కి.మీ దూరంలో ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓలా కస్టమర్లలో 90శాతం మంది వినియోగదారులకు సమీపంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సర్వీసులను అందించనున్నట్టు ఆయన తెలిపారు. నెలరోజులుగా ఓలా స్థిరమైన మార్కెట్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో 2025 నాటికి దేశంలోని అన్ని 2-వీలర్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోందని ఓలా చీఫ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.

Popular Posts