Ad Code

కోమకి ఎల్‌వై ఇ-స్కూటర్ పై డిస్కౌంట్ ఆఫర్ !


లక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ కోమకి ఎల్‌వై ఇ-స్కూటర్ మోడల్‌పై రూ. 19 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 97 వేలుగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు రూ. 78 వేల బడ్జెట్‌కే కొనొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇందులో 62వీ30 ఏహెచ్ బ్యాటరీ అమర్చింది. ఇంకా అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. టీఎఫ్‌టీ స్క్రీన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలింగ్ ఫీచర్ వంటివి ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్రంట్ వింకర్స్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటివి కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ బ్యాటరీ చార్జింగ్‌కు 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా మూడు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ఫీచర్లు, ధర మారుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 56,890 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఎక్స్‌జీటీ కేఎం 60వీ28ఏహెచ్ జెల్ వేరియంట్ ధర రూ. 56 వేల రేంజ్‌లో ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ మోడల్ 60 నుంచి 65 కిలోమీటర్లు దూరం వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇక ఎక్స్‌జీటీ కేఎం 51వీ33ఏహెచ్ వేరియంట్ రేటు 79,258గా ఉంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి చార్జింగ్ పెడితే 85 కిలోమీట్ల నుంచి 90 కి.మి వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇక ఎక్స్‌జీటీ కేఎం అడ్వాన్స్ లిథియం టెక్నాలజీ వేరియంట్ అయితే ఒక్కసారి చార్జింగ్ పెడితే 130 కిమి నుంచి 150 కిమి వరకు వెళ్తుంది. ఈ మోడల్ ధర రూ. 93 వేలుగా ఉంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ ధరలు ఎక్కువగా ఉండొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu