Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label technology. Show all posts
Showing posts with label technology. Show all posts

Sunday, October 1, 2023

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ !


మెరికాలోని లాస్‌ వెగాస్‌ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గోళాకారంలో రూ. 16వేల కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ తెరను లాంఛనంగా ప్రారంభించారు. 2018లో వెనీషియన్ రిస్టార్టులో యూ2 పేరుతో ఈ స్క్రీన్ నిర్మాణం మొదలైంది. దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. హైరిజల్యూన్ ఫీచర్ ఉన్న ఈ తెరముందు 17,500 మంది కూర్చుని ప్రదర్శన తిలకించవచ్చు. మిలియన్లకొద్దీ ఎల్‌ఈడీ లైట్లను జోడించి ఈ తెరను రూపొందించారు. అమెరికా వ్యాపారవేత్త జేమ్స్‌ డోలన్‌ దీన్ని నిర్మించాడు. బయటి భాగంపై రంగురంగుల చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. లోపలి స్క్రీన్ కళ్లు తిరిగిపోయేలా ఉంటుందని, మరో గ్రహగోళంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. గత శుక్రవారం ఐరిష్‌ రాక్‌ బ్యాండ్‌ ప్రదర్శనతో ఈ తెరను ప్రారంభించారు.

లెనెవో నుంచి లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11


లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకు రానుంది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 11 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,920 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక లెనోవో ట్యాబ్‌ ఎమ్‌11 మీడియా టెక్‌ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ట్యాబ్‌ను మూడు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. 4జీబీ, 8 జీబీ, 12 జీబీ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 10 గంటల తరబడి పనిచేస్తుంది. ట్యాబ్ బరువు 466 గ్రాములు ఉంది. కెమెరా విషయానికొస్తే మాత్రం లెనోవో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ ట్యాబ్‌లో సింగిల్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆటమ్స్‌ సౌండ్ ఇవ్వనున్నారని సమాచారం. లెనోవో ట్యాబ్ ఎమ్‌11లో 5v/2A ఛార్జింగ్‌ అడాప్టర్‌ను ఇవ్వనున్నారు. 

గంటల్లోనే లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ హాట్‌ సేల్‌ !


దేశీయ మార్కెట్లో జర్మనీ లగ్జరీ కార్‌ మేకర్‌ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో తీసుకొచ్చింది. బుకింగ్స్‌ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్‌ సేల్‌లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్‌యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. లాంచింగ్‌ రోజే iX1 SUVకి 'అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్‌ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్‌లైట్లు LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్‌లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్‌ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఆల్ఫ్‌లైన్‌ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో విడుదల చేసింది. 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.

రెడ్‌మీ ఉత్పత్తులపై దివాలీ ఆఫర్లు !


దివాలీ విత్ ఎంఐ సేల్ 2023 పేరిట ఆన్ లైన్ లో జియోమీ పలు ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఇతర డివైజ్ లలో కూపన్ డిస్కౌంట్లు అందించనుంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 జరిగే సమయంలోనే ఇది కూడా ఉండే అవకాశం ఉంది. జియోమీ దివాలీ విత్ ఎంఐ సేల్ 2023 తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సేల్లో జియోమీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఆఫర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ వంటి ట్యాబ్లెట్‌లు దివాలి విత్ ఎంఐ 2023 సేల్‌లో తగ్గింపు ధరలకు లభించే అవకాశం ఉంది. ఈమేరకు కంపెనీకి చెందిన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఓ టీజర్ ను విడుదల చేసింది. దీనిలో 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌లపై స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలుదారులు గేమ్ లాంజ్ ద్వారా రివార్డ్‌లను గెలుచుకోవడంతో పాటు ప్రతిరోజూ కొత్త సర్ ప్రైజ్ లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. ఈ దివాలి విత్ ఎంఐ సేల్‌లో పాల్గొనడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడానికి, ఆహ్వానించడానికి కొనుగోలుదారులకు కంపెనీ ఫ్రీబీలను కూడా అందిస్తుంది. ఏయే ఉత్పత్తులు ఆఫర్లపై విక్రయించనుందో జియోమీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ 13 సిరీస్ ఫోన్లు అయిన రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో+ , బేస్ మోడల్, రెడ్‌మీ ఎ2+ , రెడ్‌మీ కె60, అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ 12 5జీ వంటి స్మార్ట్ ఫోన్లపై పండుగ తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. వీటితో పటు ఇటీవల ప్రారంభించిన కొన్ని ఎంఐ ఉత్పత్తులు కూడా అమ్మకానికి వెళ్ళవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గృహోపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీ స్టిక్‌ల వరకు సేల్ లో కనిపించే అవకాశం ఉంది.

కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్ మికా !


పోలాండ్ కు చెందిన మత్తు పానీయాలు తయారు చేసే కంపెనీ మికా హ్యుమనోయిడ్ రోబోను డిక్టేడార్ కు ప్రయోగాత్మక సీఈఓగా నియమించింది. ఈ కంపెనీ రమ్ కు ప్రసిద్ధి చెందింది. దీనిలో రోబో సంస్థ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది, ఇందులో వన్-ఆఫ్ కలెక్షన్లు, కమ్యూనికేషన్లు, వ్యూహాత్మక ప్రణాళికలు కూడా ఉంటాయి. డిక్టేడార్‌లోని యూరప్ హెడ్ మార్క్ స్జోల్డ్‌రోవ్స్కీ ప్రకారం, “డిక్టేడార్ బోర్డు నిర్ణయం విప్లవాత్మకమైనది, సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐతో కూడిన ఈ మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఓ కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ మికా రోబో కస్టమ్ బాటిళ్లను రూపొందించడానికి కళాకారులను ఎంపిక చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సంస్థ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోబోట్ తీసుకుంటుంది. లాభనష్టాలు, మార్కెటింగ్ వ్యూహం, వ్యాపార వ్యూహం సహా అన్ని విషయాలను ఈ ఏఐ చూసుకుంటుంది. కంపెనీకి మరింత మార్కెటింగ్‌కు ఎలా ముందుకు వెళ్లాలో ఇది నిర్ణయిస్తుంది. ఎక్కడ పెట్టుబడులు లాభపడతాయో అంచనా వేస్తుంది. అంతేకాదు ఈ మికా ఆఫీసు లోపల కూడా సందడి చేస్తుంది. అంటే ఏ డిపార్ట్ మెంట్ పని బాగా జరుగుతోందని, ఎవరు పని సరిగా చేయడం లేదనే విషయాలను ఈ రోబో గమనిస్తూనే ఉంటుంది. ఏ వర్కర్ ఎక్కడ అవసరం, పని పరిధి ఎలా ఉంటుందో మికానే చెబుతుంది. ప్రతి కార్మికుడి పనితీరును తనిఖీ చేస్తుంది. ప్రతి ఉద్యోగి ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఈ కృత్రిమ మేధస్సు రోబో చేతిలో ఉంటుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దీనిపై దృష్టి సారించింది.

వారంటీ తిరస్కరించినందుకు ఆపిల్ సంస్థకు రూ. లక్ష జరిమానా !

                                       

బెంగళూరు వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆపిల్ సంస్థకు రూ. లక్ష పెనాల్టీ విధించింది. బెంగళూరుకు చెందిన వాజ్ ఖాన్ (30) అనే వ్యక్తి 2021 అక్టోబర్‌ 29న ఐఫోన్13 కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ మీద  ఆపిల్ ఏడాది వారంటీ ఇచ్చింది. కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ఫోన్ బ్యాటరీ, స్పీకర్‌తో సమస్యలు రావడంతో దాని మరమ్మతు కోసం 2022 ఆగస్టు 25న స్థానిక సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. ఆగస్టు 30వ తేదీన సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది.. 'మీ ఐ-ఫోన్‌లో లోపం సరి చేశామని, ఫోన్ తీసుకెళ్లవచ్చునని` ఆ ఫోన్ కాల్ చేసిన వారు చెప్పారు. కానీ ఫోన్‌లో లోపం యధాతథంగానే కొనసాగుతున్నదని, తిరిగి సర్వీస్ సెంటర్ వారికి ఇచ్చారు. రెండు వారాల్లో మరమ్మతు చేసి ఇస్తామని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సమాధానమిచ్చారు. కానీ రెండు వారాలు దాటినా వాజ్ ఖాన్‌కు ఎటువంటి సమాధానం రాలేదు. తర్వాత తీరిగ్గా.. ఆయన కొన్న 'ఐ-ఫోన్ 13'లో ఔటర్ మెష్‌లో జిగురు పదార్థం ఉందని, వారంటీలో దాన్ని తొలగించలేమని, తొలగించాలంటే, అదనంగా మనీ చెల్లించాలని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు తీరిగ్గా చెప్పారు. దీనిపై పలుమార్లు ఆపిల్ సంస్థకు ఈ-మెయిల్స్ పంపినా స్పందన కరువైంది. గతేడాది అక్టోబర్ 27న ఆపిల్‌కు లీగల్ నోటీసు కూడా పంపాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 2022 డిసెంబర్‌లో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. వాజ్ ఖాన్ కు పరిహారం చెల్లించాలని ఆపిల్, ఆ సంస్థ సర్వీస్ భాగస్వామిని ఆదేశించింది. రూ.79,900 పరిహారంతోపాటు మరో రూ.20 వేలు వడ్డీ చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.

Saturday, September 30, 2023

వొడాఫోన్ ఐడియాకు రూ.కోటి పెనాల్టీ !


రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్‌ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్‌ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్‌, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ.కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్‌వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్‌ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది.వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌-జూన్‌ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్‌ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది.

'మోటో E13' విడుదల !


మోటో E13 కొత్త కలర్ వేరియంట్‌ను మోటొరోలా విడుదల చేసింది. ఇప్పుడు ఛార్మింగ్‌ 'స్కై బ్లూ' కలర్‌లో ఫోన్ లభిస్తుంది.8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మోటో E13 లైనప్‌లో ఇప్పటికే క్రీమీ వైట్, అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ కొత్తగా మోటో E13ని నాలుగో కలర్ ఆప్షన్‌లో అందిస్తూ, దీనిపై భారీ ఆఫర్లు సైతం ప్రకటించింది. ఈ వివరాలను మోటొరోలా, ఎక్స్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేసుకుంది.మోటొరోలా మోటో E13ని ఈ ఫిబ్రవరిలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ 2GB+64GB, 4GB+64GB అనే రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఆగస్టులో 8GB+128GB వేరియంట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. మోటో E13 పండుగ ప్రత్యేక ధర రూ.6,749తో అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్‌ అసలు ధర రూ.8,999. ఈ డిస్కౌంట్‌లో బ్యాంక్ ఆఫర్లు కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్లు లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ మోటొరోలా వెబ్‌సైట్, రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా అందుబాటులో ఉంది. కలర్‌ ఆప్షన్‌లు మినహా మోటో E13 స్పెసిఫికేషన్లు అలానే ఉంటాయి. మోటో E13లో 20:9 యాస్పెక్ట్‌ రేషియోలో, 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. వినియోగదారులకు అన్ని మల్టీమీడియా యాక్టివిటీస్‌లో ఇమ్మెర్సివ్‌ విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌తో బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. మోటో E13 మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్‌లు 64GB స్టోరేజ్‌ 2GB RAM, 64GB స్టోరేజ్‌ 4GB RAM, 128GB స్టోరేజ్ 8GB RAM అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది షార్ప్‌, వైబ్రెంట్‌ ఫోటోలను క్యాప్చర్‌ చేస్తుంది. అయితే 5MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనువుగా ఉంటుంది. మోటో E13 ప్రత్యేకమైన ఫీచర్‌లలో ఒకటి స్ట్రాంగ్‌ 5,000mAh బ్యాటరీ. ఫోన్ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో E13 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఇది విస్తృత శ్రేణి యాప్‌లు, ఫీచర్‌లకు యాక్సెస్‌తో పాటు యూజర్‌-ఫ్రెండ్లీ, అప్‌ టూ డేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.


హాట్‌స్టార్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితుల విధింపు !


డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ కూడా పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితులను పెట్టింది. ఈ తాజా వార్త డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రైబర్లకు షాకింగ్‌ విషయంగా ఉంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తన కస్టమర్‌లు తమ ఆధారాలను ఇతరులతో పంచుకోకుండా నిషేధిస్తుంది. హాట్‌ స్టార్‌ నవంబర్ 1 నుంచి కెనడాలో ఈ కొత్త నియంత్రణను అమలు చేస్తోంది. ఈ మార్పుల గురించి తెలియజేస్తూ ఖాతా షేరింగ్‌ని నిషేధించడానికి వినియోగదారులకు ఇప్పటికే ఈ-మెయిల్ పంపింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే డిస్నీప్లస్‌ కొత్త నిబంధనలను అమలు చేయడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వాటిని ఉల్లంఘించిన వారి ఖాతాలను పరిమితం చేయడం లేదా రద్దు చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ తాజా చర్య ముఖ్యంగా అర్హత కలిగిన వినియోగదారులను గుర్తించడానికి కూడా ఒక మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ తాజా చర్య సంభావ్య చెల్లింపు సభ్యులను దూరంగా ఉంచుతుంది. స్నేహితుని సభ్యత్వాన్ని ఉపయోగించడం కంటే ఎక్కువ మంది వినియోగదారులను దాని సేవ కోసం చెల్లించమని ప్రోత్సహించడానికి ప్లాట్‌ఫారమ్ సమానంగా కట్టుబడి ఉందని ఇది సూచిస్తుంది. అయితే డిస్నీ ప్లస్‌ చిరునామా ఒకే ఐపీ చిరునామాపై నడుస్తున్న వ్యక్తులు లేదా పరికరాలను కుటుంబ సభ్యులు పొందే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్లాట్‌ఫారమ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వారి స్నేహితులను ఎనేబుల్ చేయడానికి ప్రజలు అదనపు ధరను చెల్లించే అవకాశం కూడా ఉంది. నిర్దిష్ట మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డిస్నీ దాని అమలు కోసం ఫ్రేమ్‌వర్క్‌ను సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిబంధనలు భారతదేశంలో ఎప్పుడు అమలవుతుందో? అనే విషయం ఇప్పటివరకూ తెలియలేదు. నెట్‌ఫ్లిక్స్ దాని పాస్‌వర్డ్ అణిచివేత సంస్కరణను దేశంలో అమలు చేసినందున డిస్నీ ప్లస్‌ అలాగే చేస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో 3D లైట్ డ్రెస్ !


ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సార్టోరియల్ లైట్లతో మెరిసిపోయింది.. ఫ్యాషన్ ప్రముఖులను మరియు ఔత్సాహికులను ఆకట్టుకుంది. టెక్నాలజీతో అద్భుతాన్ని సృష్టించారు. 3D లైట్ లను ఉపయోగించి ఒక వెరైటీ డ్రెస్సును రూపొందించారు.. ఆ డ్రెస్సు కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'డీప్ మిస్ట్,'' అనే శీర్షికతో ఫ్యాషన్ ప్రపంచంలో షాక్ వేవ్‌లను పంపింది. అభిమానులు మరియు అనుచరుల నుండి విస్తృతమైన ప్రతిచర్యలను ప్రేరేపించింది. అండర్‌కవర్ ద్వారా 'డీప్ మిస్ట్' సేకరణ 3D సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడంతో ఫ్యాషన్‌ను నిర్దేశించని ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అద్భుతమైన భాగాలు 3D దుస్తులు, దాని ఆకృతి, లైటింగ్ మంత్రముగ్దులను చేసే పరస్పర చర్యను సృష్టిస్తుంది. ముఖ్యంగా, ఈ దుస్తులు పారదర్శకంగా ఉండే ప్యానెల్‌ను కలిగి ఉంటాయి, ఇవి సున్నితమైన పూలు, ఆకులతో రూపోందించారు. ఇది క్లిష్టమైన డిజైన్‌లకు ప్రాణం పోసింది. మోడల్‌లు వారి ప్రకాశవంతమైన వస్త్రధారణతో స్థలాన్ని ప్రకాశవంతం చేయడానికి అనుమతించారు. ఈ ఎథెరియల్ క్రియేషన్స్‌లో ఒకటి ప్రత్యక్ష సీతాకోక చిలుకలను కూడా ఉంచింది, ప్రదర్శన యొక్క వాతావరణానికి అధివాస్తవిక అందం యొక్క మూలకాన్ని జోడిస్తుంది. లైట్ డ్రెస్సు వైరల్ సెన్సేషన్‌గా మారడానికి, ఫ్యాషన్ అభిమానులను ఆకర్షించడానికి అలాగే ఫ్యాషన్ యొక్క భవిష్యత్తు గురించి సంభాషణలను రేకెత్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు..జున్ తకాషి అనే డిజైనర్ దీన్ని డిజైన్ చేశారు.. ఈ డ్రెస్సు ఆ షోకే హైలెట్ గా నిలిచింది.. అండర్‌కవర్ ప్రెజెంటేషన్‌ను పారిస్ ఫ్యాషన్ వీక్ 2023 యొక్క అత్యంత ప్రత్యేకమైన ఈవెంట్.. ఇలాంటి వింతలను డిజైనర్స్ చెయ్యడం కొత్తేమి కాదు..నిజంగా ఈ క్రియేటివ్ ఆలోచనకు మెచ్చుకోవాల్సిందే..

నావిక్ నావిగేషన్ కవరేజీ పరిధిని పెంచనున్న ఇస్రో !


చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1తో విజయాన్ని అందుకున్న ఇస్రో.. ఇప్పుడు సరికొత్త మిషన్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ఈ మిషన్ రాబోయే అంతరిక్ష కార్యక్రమాలు గగన్‌యాన్, శుక్రాయాన్‌లకు చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇది భారతదేశానికి కొత్త విజయంగా మారడమే కాకుండా, చైనా, పాకిస్తాన్ సరిహద్దులలో కూడా ఒక కన్ను వేసి ఉంచుతుందంట. శాటిలైట్ నావిసి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ISRO ఈ మిషన్‌కు సంబంధించిన పనిని ప్రారంభించింది. NAVIC ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎస్‌ఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమనాథ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో రాబోయే మిషన్‌ల గురించి సమాచారం ఇస్తూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కూడా నావిక్ నావిగేషన్ కవరేజీని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం దాని పరిధి భారతదేశం వెలుపల 1500 కి.మీ.ల వరకు ఉందని ఎస్ సోమనాథ్ చెప్పారు. రెండింతలకు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే, సార్క్ దేశాలు భారతదేశ పరిధిలోకి రావడమే కాకుండా, చైనాలో గణనీయమైన భాగం కూడా భారతదేశ అధికార పరిధిలోకి వస్తుంది. దేశ నావిగేషన్, సమయ అవసరాలను తీర్చడానికి భారతదేశం ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి భారతీయ రాశితో నావిగేషన్ అని పేరు పెట్టారు అంటే NavIC. ఇది భారతదేశపు మొట్టమొదటి భారతీయ ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా పిలువబడుతుంది. ఈ వ్యవస్థలో ఏడు ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో ఉన్నాయి. మిగిలిన నాలుగు జియోసింక్రోనస్ కక్ష్యలో ఉంచబడ్డాయి. ప్రస్తుతం, ఇవి మొత్తం దేశంపై ఒక కన్ను వేసి, భారత సరిహద్దు వెలుపల 1500 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్‌ను అందిస్తుంది. దాని రెండవ వర్గం రహస్యంగా ఉంచారు. ఇది సాయుధ దళాలు, భద్రతా సంస్థల వ్యూహం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. దీనిని RS అని పిలుస్తారు అంటే పరిమితం చేయబడిన సేవ. NavIC భారతదేశం భద్రతలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా ఆర్థిక అభివృద్ధి అవసరాలను కూడా నెరవేరుస్తుంది. 1500 నుంచి 3000 కి.మీ పరిధిని కలిగి ఉన్న తరువాత, దాని పాత్ర మరింత పెరుగుతుంది. మూడు వేల కిలోమీటర్ల వరకు భారత్ పొరుగు దేశాలపై నిఘా ఉంచగలుగుతుంది. దీంతో శత్రువుల కార్యకలాపాలపై నిఘా పెట్టవచ్చు. క్షిపణి నావిగేషన్‌లో కూడా దీనిని స్వీకరించవచ్చు. పెద్ద ఎత్తున చొరబాటు తదితరాలను కూడా నియంత్రించనున్నారు. దీంతోపాటు సముద్ర ప్రాంతాలపై కూడా నిఘా పెంచనున్నారు. రియల్ టైమ్ రైలు సమాచార వ్యవస్థ, విపత్తుల గురించిన సమాచారం కూడా చాలా ముందుగానే అందుబాటులో ఉంటుంది. నావిగేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ప్రపంచంలో నాలుగు గ్లోబల్ సిస్టమ్‌లు ఉన్నాయి. వీటిలో అమెరికా GPS, రష్యా గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ గెలీలియో, చైనా బీడూల్ ఉన్నాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ప్రపంచంలోని రెండు దేశాలు మాత్రమే తమ స్వంత ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి. నావిగేషన్ సిస్టమ్‌లు, వాటిలో ఒకటి జపాన్‌కు చెందినది. దీని నావిగేషన్ సిస్టమ్‌కు QZSS అని పేరు పెట్టారు. మరొకటి NavIC ఆఫ్ ఇండియా. దీని పరిధిని పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.

క్వాంటం చిప్స్ తయారీకి స్టార్టప్‌లకు ఆహ్వానం !


క్వాంటం చిప్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లు, టెక్ కంపెనీల నుండి సహాయం, నైపుణ్యాన్ని కోరింది. క్వాంటం చిప్స్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్‌లకు శక్తినిస్తాయి. క్వాంటం చిప్‌లను రూపొందించి, తయారు చేయగల స్టార్టప్‌లను ఆహ్వానిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఎంపిక చేసిన సంస్థ ప్రభుత్వానికి సహకార అభివృద్ధి భాగస్వామిగా వ్యవహరిస్తుంది. క్వాంటం కంప్యూటర్‌లను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు క్వాంటం టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్‌పై రూ. 6,000 కోట్ల జాతీయ ప్రాజెక్ట్ ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత ఈ చర్య తాజాగా ప్రారంభం అయింది. భారతదేశం, అమెరికా సంయుక్తంగా పరిశోధన కోసం ఇండో-యుఎస్ క్వాంటం కోఆర్డినేషన్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేశాయి. క్వాంటం కంప్యూటర్లు అత్యంత అధునాతన సూపర్ కంప్యూటర్ల కంటే 100 మిలియన్ రెట్లు వేగంగా ఉంటాయి. 'క్వాంటమ్'ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CDAC కి అప్పగించారు. CDAC క్వాంటం చిప్ అన్వేషణ , ఇతర కార్యకలాపాలతో పని చేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ ఈ రంగంలో సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. CDAC క్వాంటం కంప్యూటర్‌ను నిర్మిస్తుంది. క్వాంటం ప్రాసెసింగ్ చిప్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రంలో ఉంది. ఎంపిక చేసిన స్టార్టప్‌లతో ప్రారంభం నుండి చివరి వరకు సహకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాంట్రాక్ట్ వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. అభివృద్ధి చేయబడుతున్న క్వాంటం చిప్‌ను సమర్థవంతంగా పరీక్షించాల్సి ఉంటుంది. అంతే కాదు ఈ చిప్స్ మరింత మన్నికగా ఉండేట్లు రూపొందించడం స్టార్టప్ ల పని.

Friday, September 29, 2023

HP, Google భాగస్వామ్యంలో ల్యాప్‌టాప్‌ లు !


ప్రముఖ టెక్ దిగ్గజాలు HP మరియు Google భారతదేశంలో బడ్జెట్ ధర లో క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌లను తయారు చేయడానికి జతకట్టాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, సరసమైన నోట్‌బుక్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ సేకరణ అవసరాలను తీర్చడం ముఖ్యంగా తెలుస్తోంది. వీటి ధర సుమారుగా రూ. 20,000 ఉంటుందని అంచనా వేయబడింది. ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే వారికి ఇంకా తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ 2020 నుండి HP ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్‌టాప్‌లను తయారు చేస్తున్న చెన్నై సమీపంలోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో ఈ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాథమికంగా విద్యా రంగంలో సరసమైన PCల కోసం డిమాండ్‌ను తీర్చడంపై ప్రాథమిక దృష్టితో తయారీని అక్టోబర్ 2న ప్రారంభించనున్నారు. గూగుల్ క్రోమ్‌బుక్స్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడటం ఇదే మొదటిసారి.దీని కారణంగా తక్కువ ధరకే మీకు లాప్ టాప్ లు లభించే అవకాశం ఉంది. HP ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ, డిజిటల్ ఈక్విటీని అభివృద్ధి చేయడం మరియు భారతదేశంలో డిజిటల్ విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం కోసం HP నిబద్ధతను వ్యక్తం చేశారు. క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌లను స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా, భారతీయ విద్యార్థులు తక్కువ ఖర్చుతో కూడిన వ్యక్తిగత కంప్యూటర్‌లను పొందుతారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పట్ల హెచ్‌పి అంకితభావాన్ని కూడా బేడీ హైలైట్ చేశారు. గూగుల్ సంస్థ ఈ సహకారాన్ని బడ్జెట్‌కు అనుకూలమైన నోట్‌బుక్‌లతో భారతీయ విద్యా వ్యవస్థలో మరింతగా విలీనం చేసుకునే అవకాశంగా చూస్తుంది. గూగుల్‌లోని ఎడ్యుకేషన్ హెడ్ (దక్షిణాసియా) బని ధావన్, వివిధ ఉత్పత్తులు మరియు ఉపాధ్యాయ కార్యక్రమాల ద్వారా డిజిటల్-ఫస్ట్ లెర్నింగ్ అనుభవాలకు మారడంలో స్థానిక విద్యా పర్యావరణ వ్యవస్థకు సహాయం చేయడానికి కొనసాగుతున్న తమ ప్రయత్నాలను నొక్కి చెప్పారు. HP భాగస్వామ్యంతో క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌ల స్థానిక ఉత్పత్తి భారతదేశంలో విద్య డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇచ్చే గూగుల్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ సహకారం మరిన్ని పాఠశాలల్లో టెక్నాలజీ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, ప్రతి విద్యార్థి మరియు అధ్యాపకుడు వారి పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన సాధనాలు మరియు నైపుణ్యాలను పొందగలరని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశారు. HP మరియు Google సంస్థల మధ్య ఈ జాయింట్ వెంచర్ భారతదేశం మేక్ ఇన్ ఇండియా చొరవకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు సంస్థలకు మరింత సరసమైన మరియు అందుబాటులో ఉండే డిజిటల్ విద్యా పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. గూగుల్ సంస్థ తన పిక్సెల్ 8 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లను అక్టోబర్ 4న జరిగే 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్ వాచ్ 2తో పాటుగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. వెనిలా పిక్సెల్ 8 మరియు పిక్సెల్ 8 ప్రోతో కూడిన పిక్సెల్ 8 లైనప్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుంది.

విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌ విడుదల


మైక్రోసాఫ్ట్‌ తాజాగా విండోస్‌ 11కి అప్‌డేట్‌ను రిలీజ్‌ చేసింది.  విండోస్‌ 11లోని అవుట్‌లుక్‌ యాప్ ఇప్పుడు Gmail, Yahoo, iCloud సహా ఇతర ఇమెయిల్ అకౌంట్‌లకు ఇంటిగ్రేట్‌ అవుతుంది. ఇమెయిల్ కంపోజిషన్‌ను క్రమబద్ధీకరించడానికి ఒక ఇంటెలిజెంట్‌ రైటింగ్‌ టూల్‌ ఉంటుంది. వినియోగదారులు OneDrive నుంచి నేరుగా ఇమెయిల్స్‌కి ఫైల్స్ ఇంటిగ్రేట్‌ చేసే ఆప్షన్‌ ఉంది. ఫోటోస్‌ యాప్ AI- పవర్డ్ టూల్స్, ఎన్‌హ్యాన్స్‌డ్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ జెస్టర్స్‌తో వచ్చింది. వినియోగదారులు ఇప్పుడు ఒకే క్లిక్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు, PC, OneDriveలో స్టోర్‌ చేసిన ఫోటోలను సెర్చ్‌ చేయవచ్చు. ఇంప్రూవ్డ్‌ సెర్చ్‌ ఫంక్షనాలిటీ బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. నోట్‌ప్యాడ్‌లో కొత్తగా ట్యాబ్స్‌ ఇంట్రడ్యూస్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనితో మల్టిపుల్‌ టెక్స్ట్ ఫైల్‌లను ఒకసారి బ్రౌజ్ చేయవచ్చు. అయితే తాజాగా నోట్‌ప్యాడ్‌ ఆటోసేవ్ ఫీచర్‌ అప్‌డేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్, ప్రీవియస్‌గా ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లను రీస్టోర్‌ చేస్తుంది, సేవ్‌ చేయని కంటెంట్‌ని కూడా చూపుతుంది. మైక్రోసాఫ్ట్ పెయింట్ AI-పవర్డ్‌ డ్రాయింగ్, డిజిటల్ క్రియేషన్‌ టూల్స్‌తో అప్‌డేట్‌ అయింది. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, లేయర్స్‌ సపోర్ట్, కో-క్రియేటర్ ప్రివ్యూ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. విండోస్ బ్యాకప్ ఇప్పుడు మొత్తం యూజర్ డేటాను కలిగి ఉంటుంది. బ్యాకప్‌లో యాప్స్‌, సెట్టింగ్స్‌, ఫైల్స్‌ అన్నీ ఉంటాయి. ఇది పర్సనల్‌ కంప్యూటర్‌లను స్విచ్‌ చేయడం, సెట్టింగ్స్‌, ఫైల్స్‌ సింక్రనైజ్డ్‌గా ఉంచడాన్ని సులభతరం చేస్తుంది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ మెరుగైన యాక్సెసిబిలిటీ కోసం హోమ్, అడ్రస్ బార్, సెర్చ్ బాక్స్‌కి ఎన్‌హ్యాన్స్‌మెంట్‌తో మోడర్న్‌ రీడిజైన్‌ను పొందింది. ఫ్యూచర్‌లో ఫైల్స్‌ను, కొత్త గ్యాలరీ ఫీచర్‌ను ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేకుండా కొలాబరేటివ్‌ ఫీచర్‌లను కూడా పరిచయం చేస్తుంది. విండోస్‌ 11 లేటెస్ట్‌ అప్‌డేట్‌ వాయిస్ యాక్సెస్ కోసం టెక్స్ట్ ఆథరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరచింది. నెరేటర్‌కి కొత్త నేచురల్‌ వాయిస్‌లను పరిచయం చేసింది. యాక్సెసబిలిటీ, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరిచింది. వీడియో ఎడిటింగ్ టూల్ అయిన క్లిప్‌చాంప్, వీడియో క్రియేషన్‌ ప్రాసెస్‌ని సులభతరం చేస్తూ ఆటో- కంపోజ్‌ ఫీచర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసింది. సీన్స్‌, ఎడిట్స్‌, అలానే ఇమేజెస్‌, ఫుటేజ్‌ ఆధారంగా నెరేటివ్స్‌ సూచిస్తుంది. స్నిప్పింగ్ టూల్ ఇప్పుడు ఇమేజ్ నుంచి స్పెసిఫిక్‌ టెక్స్ట్ కంటెంట్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చేయగలదు. సులభంగా టెక్స్ట్‌ కాపీ చేసుకుని, ఇతర అప్లికేషన్‌లకు యాడ్‌ చేయవచ్చు. ఇందులో మైక్ సపోర్ట్‌తో సౌండ్ క్యాప్చరింగ్ ఆప్షన్‌లు, కంటెంట్ క్రియేటర్‌లకు క్యాటరింగ్ ఆప్షన్‌ ఉన్నాయి. Windows 11 అప్‌డేట్ కోపైలట్‌ఇంటిగ్రేషన్‌ను పరిచయం చేసింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అంతటా దీన్ని సైడ్‌బార్‌గా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫీచర్ మల్టీ టాస్కింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది, టాస్క్‌ని కంప్లీట్‌ చేస్తుంది. Win + C షార్ట్‌కట్‌ ద్వారా కోపైలట్‌ని లాంచ్‌ చేయవచ్చు.

లైవ్‌స్ట్రీమింగ్ ఫీచర్‌తో స్మార్ట్ గ్లాసెస్ విడుదల !


ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగం వినూత్న ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ టూల్స్‌పై టెకీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను ఆవిష్కరించాయి, ఇక మెటా పలు ప్రోడక్ట్స్‌తో పాటు ఏఐ అసిస్టెంట్‌ను లాంఛ్ చేసింది. కనెక్ట్ లాంఛ్ ఈవెంట్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీతో మెటా స్మార్ట్ గ్లాస్‌లను ప్రవేశపెట్టింది. ఇక మెటా ఏఐ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. యూజర్ల సెర్చి ఆధారంగా రియల్ టైం ఇన్ఫర్మేషన్‌ను మెటా ఏఐ యాక్సెస్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ బింగ్‌తో భాగస్వామ్యంతో ఇమేజ్ జనరేషన్ టూల్‌ను కూడా ఆఫర్ చేస్తుందని మెటా తన బ్లాగ్‌లో పేర్కొంది. ఏఐ అసిస్టెంట్‌తో పాటు రేబాన్‌తో కలిసి న్యూ స్మార్ట్ గ్లాసెస్‌ను మెటా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ మ్యూజిక్‌ను ప్లే చేయడం, ఫొటోలను క్యాప్చర్ చేయడం, వీడియోలను రికార్డు చేయడంతో పాటు యూజర్లు వీక్షించే కార్యక్రమాలను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌స్ట్రీమ్ చేస్తాయి. యూజర్లు స్పాట్ నుంచే ప్రివ్యూలో కామెంట్స్‌ను చూడటంతో పాటు మెసేజ్‌లను వినవచ్చని స్మార్ట్ గ్లాసెస్ లాంఛ్ చేస్తూ మెటా బ్లాగ్ పోస్ట్‌లో్ రాసుకొచ్చింది.

AI DJ ఫీచర్ పరిచయం చేసిన Spotify !


మ్యూజిక్ ప్రియులకు సుపరిచితమైన Music App Spotify కొత్తగా AI DJ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ మ్యూజిక్ ప్రియులకు మరింత సౌకర్యం మరియు సౌలభ్యంతో పాటుగా గొప్ప మ్యూజిక్ ను కూడా అందిస్తుంది. స్పోటిఫై తీసుకు వచ్చిన DJ ఫీచర్ అనేది ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డిజె టూల్. ఈ కొత్త ఫీచర్ తో మీరు కోరుకునే లేదా వినాలనుకునే మ్యూజిక్ ను పసిగట్టి మీకోసం ఆటొమ్యాటిగ్గా ప్లే చేస్తుంది. దీనికోసం, ఈ స్పోటిఫై ఎఐ డిజె మీరు ఇప్పటి వరకూ ఎక్కువగా వినడానికి ఇష్టపడిన మరియు మీ లైక్స్ తో పాటుగా ఓల్డ్ ట్రాక్ రికార్డ్ లను ఉపయోగిస్తుంది. మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చిన ఈ యాప్ లో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూనే వుంది. ఇదే దారిలో స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ ఇప్పుడు భారతీయ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ టెక్స్ట్ టూ స్పీచ్ టెక్ తో వస్తుంది. అంటే, మీ మ్యూజిక్ సెర్చ్ మరింత వేగంగా సౌకర్యవంతంగా మారుతుంది. మీరు హెడ్ ఫోన్ ను ఉపయోగిస్తున్నప్పుడు మ్యూజిక్ సెర్చ్ కోసం ఈ కొత్త స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ ను మీ ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలి? అని అనుకుంటే, ఇది చాలా సింపుల్ అని నేను చెబుతాను. ఎందుకంటే, స్పోటిఫై యాప్ లోని హోమ్ బటన్ లో కనిపించే Music బటన్ పైన నొక్కగానే AI DJ కార్డ్ వస్తుంది. అంతే, మీ స్ఫోటిఫై యాప్ లో మీ ఎఐ డిజె ఫీచర్ ఎనేబుల్ అయిపోతుంది. అంతే, Play బటన్ పైన నొక్కగానే మీ AI మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. ఈ స్పోటిఫై ఎఐ డిజె ఫీచర్ యాక్సెస్ కేవలం Premium Users కి మాత్రమే అందుతుంది. అంటే, మీరు స్పోటిఫై ప్రీమియం ఎఐ డిజె ఫీచర్ ను పొందడానికి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కలిగి ఉండాలి.

మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్ !


చంద్రయాన్-3 మిషన్ లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌ రే పోలారిమీటర్‌ శాటిలైట్‌ పై (ఎక్స్‌ పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్‌ పోశాట్‌ తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. 

600 జీబీతో పాటు ఓటీటీ యాప్ ఉచిత సబ్ స్క్రిప్షన్ !


బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్ పూర్తి బీవ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 600GB హై స్పీడ్ డేటాని కూడా బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100 SMS లిమిట్ ప్రయోజనం కూడా అంధిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో Eros Now OTT కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. అలాగే, 30 రోజుల అన్లిమిటెడ్ సాంగ్స్ తో Free PBRT లాభాన్ని కూడా పొందవచ్చు. డైలీ అధిక డేటా మరియు అన్ లిమిటెడ్ కాలింగ్ కోసం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం కోరుకునే వారికి బిఎస్ఎన్ఎల్  రూ. 2,399 మరియు రూ. 2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను పరిశీలించవచ్చు. ఈ రెండు ప్లాన్ కూడా 395 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. అలాగే, ఈ రెండు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా తీసుకు వస్తాయి. ఈ రెండు బిఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అవి అందించే డేటా పరంగా వేరు చేయబడతాయి. వీటిలో రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని అందిస్తే, రూ. 2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ డైలీ 3GB హైస్పీడ్ ని అందిస్తుంది.

Thursday, September 28, 2023

అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ !


మెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుండి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్నట్లు చెబుతున్న డీల్స్, ఆఫర్లను అమెజాన్ టీజింగ్ పేజ్ ఈరోజు బయటపెట్టింది. అంతేకాదు, ప్రైమ్ మెంబర్స్ కోసం అందించనున్న ప్రత్యేకమైన ఆఫర్స్ గురించి కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఎప్పటిలాగానే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం కూడా ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ అందుకుంటారని తెలిపింది. అంతేకాదు, ఉచిత వన్ డే డెలివరీ మరియు మరిన్ని ప్రయోజనాలను ప్రైమ్ మెంబర్స్ అందుకోవచ్చని కూడా తెలిపింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వచ్చింది అమేజాన్. అందుకే, ఈ సేల్ నుండి వస్తువులను SBI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను ఇస్తుంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ ద్వారా గొప్ప చెబుతోంది. ఈ అమేజాన్ సేల్ నుండి అమేజాన్ కూపన్స్, క్రేజి కాంబో, బై మోర్ సేవ్ మోర్ మరియు క్యాష్ బ్యాంక్ వంటి ఆఫర్లను అమేజాన్ ప్రకటించింది.  మొబైల్స్ పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ల పైన గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ పేజ్ ద్వారా అనౌన్స్ చేసింది. అంతేకాదు, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన కూడా గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. 

ఎల్‌జీ నుంచి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ !


దేశీయ మార్కెట్లో ఎల్‌జీ కొత్త ల్యాప్‌టాప్‌ ను తీసుకు రానుంది. ఈ ల్యాప్‌టాప్‌లు ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కోరుకునే వినియోగదారులపై చాలా ప్రభావం చూపాయి. ఈ ల్యాప్‌టాప్‌ 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్‌ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ కొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ గ్రామ్ ఫోల్డ్ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ అధికారికంగా అక్టోబర్ లో దక్షిణ కొరియాలో విడుదల చేస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ 2560 x 1920 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్‌ఈడీ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. టాబ్లెట్ మోడ్‌లో ల్యాప్‌టాప్ పరిమాణం 378 x 280 ఎంఎం, ఫోల్డ్ మోడ్‌లో 192 x 280 ఎంఎం డిస్‌ప్లేతో ఆకర్షణీయగా ఉంటుంది. గ్రామ్ ఫోల్డ్‌ బరువు దాదాపు 1,250 గ్రాములు (కీబోర్డ్ మినహా), 1,530 గ్రాములు కీబోర్డ్‌తో సహా బరువుతో వస్తుంది. దీని వల్ల వినియోగదారులు దానిని స్థలం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం సులభం అవుతుంది. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ ఇంటెల్‌ ఐ5 13వ జెన్‌ ప్రాసెసర్, అంతర్నిర్మిత డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్ కార్డ్‌పై పని చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో వస్తుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్‌ ద్వారా ఎల్‌జీ కంపెనీ టచ్‌ప్యాడ్‌తో కూడిన బ్లూటూత్ పూర్తి పరిమాణ కీబోర్డ్ అనుబంధాన్ని అభివృద్ధి చేసింది. ఎల్‌జీ గ్రామ్ ఫోల్డ్ విండోస్ 11 హోమ్ (64 బిట్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తో పని చేస్తుంది. యూఎస్‌బీ పోర్ట్‌ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్ యూఎస్‌బీ 4.0 జెన్‌ 3తో రెండు టైప్‌ సీ పోర్ట్‌లతో వస్తుంది. 

Popular Posts