Ad Code

టీకాలో 100 కోట్ల మైలురాయిని దాటాం...!

 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ''సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. టీకా పంపిణీలో 100 మైలురాయిని దాటిన సందర్భంగా మోదీ ఈ ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా లఖ్‌నవూలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు. పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu