Ad Code

నోకియా మొట్టమొదటి టాబ్లెట్​ను విడుదల


ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ నోకియాకు చెందిన HMD గ్లోబల్ తన మొట్టమొదటి టాబ్లెట్​ను విడుదల చేసింది. నోకియా టి 20 టాబ్లెట్​ పేరుతో బుధవారం దీన్ని లాంచ్​ చేసింది. రూ. 20 వేల ధర రేంజ్​లో విడుదలైన ఈ టాబ్లెట్లో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ట్యాబ్‌​తో పాటు HMD గ్లోబల్ ఒక రగ్గుడ్​ కేస్​, రగ్గుడ్​ కేస్​ ప్లస్​ ఫ్లిప్​ కవర్​/ స్టాండ్​, నోకియా మైక్రో ఇయర్​బడ్స్​ ప్రో యాక్సెసరీస్​ను కూడా లాంచ్​ చేసింది. వీటన్నింటినీ నోకియా T20 టాబ్లెట్ కోసమే ప్రత్యేకంగా రూపొందించింది. దీనిలో వైఫై, వైఫై ప్లస్​ 4జీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని వై-ఫై వేరియంట్ EUR 199 (సుమారు రూ. 17,200), వైఫై + 4జీ వేరియంట్​ EUR 239 (సుమారు రూ. 20,600) ధర వద్ద ప్రారంభమవుతుంది. వైఫై వేరియంట్ 3జీబీ ర్యామ్​+ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్​+ 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. అయితే, వైఫై ప్లస్​ 4G మోడల్ మాత్రం సింగిల్​ 4 జీబీ + 64 జీబీ కాన్ఫిగరేషన్​లో లభిస్తుంది. ఈ వేరియంట్లు అక్టోబర్ 6 నుంచి అమ్మకానికి వచ్చాయి. నోకియా టి 20 ట్యాబ్లెట్​తో పాటు ఉచిత స్పాటిఫై సబ్​స్క్రిప్షన్​ లభిస్తుంది. ఇందులో 70 మిలియన్లకు పైగా పాటలు, 2.9 మిలియన్ పాడ్‌కాస్ట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu