Ad Code

బజాజ్ పల్సర్ NS400Z లాంచ్ !


దేశీయ మార్కెట్లో బజాజ్ ఆటో అతి పెద్ద పల్సర్‌ బైక్ ను లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ రూ. 1,85,000 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరతో వచ్చింది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు రూ. 5వేల టోకెన్ మొత్తంతో బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంది. కస్టమర్ డెలివరీలు జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి. బజాజ్ పల్సర్ NS400Z బైకులో 373సీసీ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. బజాజ్ డొమినార్ 400తో వస్తుంది. ఈ యూనిట్ గరిష్టంగా 40పీఎస్ పవర్, 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ NS400Z మోడల్ 43ఎమ్ఎమ్ గోల్డెన్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్‌తో వస్తుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ 17-అంగుళాలు ఉంటుంది. ముందువైపు 320ఎమ్ఎమ్ డిస్క్ ఉండగా, వెనుకవైపు 230ఎమ్ఎమ్ డిస్క్ ఉంది. అలాగే,మోటార్‌సైకిల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. బజాజ్ అత్యంత శక్తివంతమైన పల్సర్‌లో 4 రైడ్ మోడ్‌లను అందిస్తోంది. అందులో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్‌రోడ్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ మొత్తం పల్సర్ ఫ్యామిలీ అత్యంత వేగవంతమైన బైక్ కాగా.. గరిష్టంగా గంటకు 154 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. టెయిల్లాంప్, బ్లింకర్లు ఎల్ఈడీ యూనిట్లు కూడా ఉన్నాయి. మోటార్‌సైకిల్‌లో హజార్డ్ లైట్లు ఉన్నాయి. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ గ్రాఫిక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బజాజ్ పల్సర్ NS400Zలోని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ పూర్తిగా డిజిటల్ యూనిట్, బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్విచ్ ట్రాక్షన్ కంట్రోల్, 5 గేర్ క్లచ్, బ్రేక్ లివర్లు, రైడ్-బై-వైర్ ఎలక్ట్రానిక్ థొరెటల్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ మొత్తం గ్లోసీ రేసింగ్ రెడ్, పెరల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, ప్యూటర్ గ్రే అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు పల్సర్ 125, పల్సర్ NS125, పల్సర్ 150, పల్సర్ N150, పల్సర్ NS160, పల్సర్ N160, పల్సర్ NS200, పల్సర్ RS200, పల్సర్ 220F, పల్సర్ N2400, పల్సర్ N250 మోడల్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu