Ad Code

ప్రఫుల్లా ధరివాల్‌పై ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ ప్రశంసలు !


పెన్‌ ఏఐ నుంచి ఇటీవల GPT-4o విడుదల అయింది. దీనిపై ఆ సంస్థ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ పూణేకి చెందిన వ్యక్తి ప్రఫుల్లా ధరివాల్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రఫుల్లా లేకుండా GPT-4o విడుదల సాధ్యం అయ్యేది కాదంటూ X లో పోస్టు చేశారు. 

మహారాష్ట్రలోని పూణేకి చెందిన ప్రఫుల్లా ధరివాల్‌ ఇప్పటికే తన విజయాల ద్వారా గుర్తింపు పొందారు. 2009 లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్ స్కాలర్‌షిప్‌ను పొందారు. అదే సంవత్సరం చైనాలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. దీంతోపాటు 2012 సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ మరియు 2013 లో ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌లోనూ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించారు. చదువులోనూ ప్రఫుల్లా ధరివాల్‌ భాగా రాణించారు. క్లాస్‌ XII పరీక్షల్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో (PCM) 300 మార్కులకు గానీ 295 సాధించారు. దీంతోపాటు మహారాష్ట్ర టెక్నికల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 190 స్కోర్‌ సాధించారు. మరియు JEE - Mains లో 360 మార్కులకు గానీ 330 సాధించారు. దీంతోపాటు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ (మ్యాథమేటిక్స్‌) బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 2017 లో 5.0/5.0 GPA తో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అయితే 2016 మే నెలలో ఓపెన్‌ ఏఐలో రీసెర్ట్‌ ఇంటర్న్‌ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం పరిశోధన శాస్త్రవేత్తగా ఎదిగారు. GPT-3, టెక్ట్స్‌ టూ ఇమేజ్‌ ప్లాట్‌ఫాం DALL- E 2, ఇన్నోవేటివ్‌ మ్యూజిక్‌ జనరేటర్‌ జూక్‌బాక్స్‌ రూపొందించడంలో క్రీయాశీలకంగా పనిచేశారు.

"చాలా కాలం పాటు ప్రఫుల్లా ధరివాల్‌ దార్శనికత, ప్రతిభ, దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం లేకుండా GPT-4o రూపొందేది కాదు. దీంతోపాటు ఇతరుల కృషితో ఇదో విప్లవంగా మారుతుందని భావిస్తున్నా.." అంటూ ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ తమ X పోస్టులో పేర్కొన్నారు.


Post a Comment

0 Comments

Close Menu