Ad Code

త్వరలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్


స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తున్నాయి. ఇప్పటికే ఆండ్రాయిడ్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా తీసుకొస్తున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మార్కెట్‌లోకి తీసుకుస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. 2022లో రాబోయే ఎంట్రీ లేవల్ స్మార్ట్‌ఫోన్లను ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో తీసుకురానున్నట్టు గూగుల్ తెలిపింది. ఇప్పటికే గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌నే ఇన్‌స్టాల్ చేసింది. ఆండ్రాయిడ్‌లో గో ఎడిషన్ అనేది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఓఎస్‌కు ప్రస్తుతం 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు గూగుల్ వెల్లడించింది. ఈ ఓఎస్ ద్వారా గూగుల్ పలు సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది. బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు స్టోరేజ్ కెపాసిటీ కూడా తక్కువగా వాడుకోనుంది. ప్రైవసీ పరంగా కొన్ని ఫీచర్లను ఈ ఓఎస్ ద్వారా తీసుకురానున్నారు. దానికోసం ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌ను గూగుల్ యాడ్ చేసింది. దానిలో.. ఏ యాప్.. లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, ఇతర సెన్సిటివ్ డేటా పర్మిషన్‌ను తీసుకుంటుందో చెక్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu