Header Ads Widget

మొబైల్ డేటా లేకుండానే పేమెంట్స్!


వినియోగదారులు, వ్యాపారుల కోసం పేటీఎం 'ట్యాప్ టు పే'  ఫీచర్‌ను ప్రారంభించింది.ఇది వినియోగదారులు వారి పేటీఎం రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా కేవలం PoS మెషీన్‌లో వారి ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోన్ లాక్‌లో ఉన్నా, మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పేమెంట్స్ చేయొచ్చు. పేటీఎం ఆల్ ఇన్ వన్ PoS పరికరాలు, ఇతర బ్యాంకుల PoS మెషీన్‌ల ద్వారా చెల్లించే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు పేటీఎం 'ట్యాప్ టు పే' సర్వీస్ అందుబాటులో ఉంది. ట్యాప్ టు పే సర్వీసుతో, ఎంచుకున్న కార్డ్‌లోని 16-అంకెల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డ్ నెంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా డిజిటల్ ఐడెంటిఫైయర్‌గా మార్చడానికి పేటీఎం దాని బలమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్ వినియోగదారు కార్డ్ వివరాలు వినియోగదారు వద్ద మాత్రమే ఉండేలా చూస్తుంది. ఏ థర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెసర్‌తో ఈ వివరాలను పంచుకోదు పేటీఎం. ఒక వినియోగదారు రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు, వారు లావాదేవీ ద్వారా వారి కార్డ్ వివరాలను పంచుకోనవసరం లేకుండా కేవలం PoS పరికరం పై ట్యాప్ చేసి పేమెంట్ చేయొచ్చు డేటా పరిమితులు అడ్డుపడనప్పుడు మాత్రమే ఆర్థిక సేవల నిజమైన డిజిటలైజేషన్ జరుగుతుంది. ట్యాప్ టు పే పరిచయంతో, మేము ఇప్పుడు మా వినియోగదారులకు మొబైల్ డేటా ఉన్నా లేకపోయినా అన్ని డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నాము. ఈ సేవ పేటీఎం ఆల్-ఇన్-వన్ PoS ద్వారా, మా వినియోగదారులకు విస్తృత శ్రేణి ఎంపికలను అందించడానికి చాలా ప్రధాన బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments