ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది.. పేటీఎం యూజర్లు చేసే యూపీఐ లావాదేవీలపై రూ.100 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 20వరకు Paytm India వర్సెస్ West Indies ODI, T20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లు జరిగే సమయంలో Paytm ద్వారా యూజర్లు UPI మనీ ట్రాన్సాక్షన్లు చేస్తే.. వారికి క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డ్‌లను అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మ్యాచ్ జరిగే రోజులలో పేటీఎం కొత్త యూజర్లు '4 ka 100 cashback offer’ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. Paytm UPI ద్వారా నగదు బదిలీ చేసిన యూజర్లకు రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. పేటీఎం కొత్త యూజర్లు రూ. 4 నుంచి అన్ని నగదు బదిలీలపై ఈ ఆఫర్‌కు వర్తిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. UPI నగదు బదిలీలకు Paytm యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేయొచ్చు. ఇలా ప్రతిసారి యూజర్ రెఫరర్, రిఫరీ ఇద్దరూ గరిష్టంగా రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ప్రమోట్ చేసేందుకు పేటీఎం కంపెనీ భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, హర్భజన్ సింగ్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌లతో ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. పేటీఎం యూజర్లు పేటీఎం యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే Paytm UPI లో రిజిస్టర్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన అకౌంట్ బ్యాలెన్స్‌ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్స్ చేసుకోనేందుకు అనుమతిస్తుంది.
0 Comments