బడ్జెట్ ధరలో బెస్ట్ Wi-Fi రూటర్‌ల కొనుగోలు కోసం చూస్తున్నారా?


COVID-19 మహమ్మారి భయంతో ప్రజలు గత రెండు సంవత్సరాలుగా ఎక్కడి వారు అక్కడ జీవిస్తున్నారు. ఇప్పటికే రెండు వేరియంట్లతో ప్రజలు చాలా కష్టాలను ఎదురుకున్నారు. ఇప్పుడు ఓమ్రికాన్ మూడవ వేరియంట్ రాకతో COVID-19 మహమ్మారి మందగించే సంకేతాలు కనిపించకపోవడంతో ప్రజలు ఎక్కువ మంది ఇప్పటికి ఇంటి వద్దనే ఉండి పనిచేయడంతో చాలా మందికి ఇంట్లో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాథమిక అవసరంగా మారింది. తగినంత నెట్‌వర్క్ కవరేజ్ కోసం చూసే సాధారణ ఇంటర్నెట్ వినియోగదారు అవసరాలకు ఎంట్రీ-లెవల్ Wi-Fi సరిపోతుంది. మార్కెట్‌లో Wi-Fi రూటర్‌ల కోసం అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే రూ. 1000లోపు బడ్జెట్ ధరలో లభించే Wi-Fi రూటర్‌ల గురించి తెలుసుకోండి. ప్రస్తుతం Amazon Indiaలో 48% తగ్గింపుతో రూ. 944 ధర వద్ద D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్ IEEE 802.11n/g టెక్నాలజీతో వస్తుంది. ఇది కంప్యూటర్‌లు మరియు గేమ్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను షేర్ చేయడానికి వీలుగా అధిక-సామర్ధ్యం కలిగిన యాంటెనాలు మరియు వేగవంతమైన ఈథర్‌నెట్ పోర్ట్‌లను (WAN/LAN) కలిగి ఉంది. ఇది WPA/WPA2 మరియు ఫైర్‌వాల్ NAT, SPI, IP ఫిల్టర్, MAC ఫిల్టర్, DMZ, DDos మరియు IPv6, TR-069, VLAN, స్టాటిక్ రూటింగ్ మొదలైన వాటితో కూడిన అధునాతన భద్రతతో వస్తుంది. D-Link DIR -615 వైర్‌లెస్ రూటర్ దాని మూడేళ్ల బ్రాండ్ వారంటీ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది. టెండా N301 వైర్‌లెస్ రూటర్ కూడా గృహ వినియోగం కోసం రూ.1000 ధర పరిధిలో లభించే మరొక ఆకట్టుకునే ఎంపిక. ఇది IEEE802.11nకి అనుగుణంగా 300 Mbps వరకు వైర్‌లెస్ వేగాన్ని అందిస్తుంది. ఇది రోజువారీ ఇంటర్నెట్ వెబ్ కార్యకలాపాలకు సరైనది. N301 ISP నెట్‌వర్క్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి క్లయింట్ రూటర్‌గా కూడా ఇది పని చేస్తుంది లేదా డెడ్ పాయింట్‌ను తొలగిస్తూ ప్రతి మూలకు ఇంటర్నెట్‌ను భాగస్వామ్యం చేయడానికి APని అప్‌లింక్ చేస్తుంది. ఈ సులభమైన సెటప్ రూటర్ అనధికార యాక్సిస్ ను నిరోధించడానికి మరియు మీ ముఖ్యమైన డేటాను రక్షించడానికి బహుళ-స్థాయి వైర్‌లెస్ ఎన్‌క్రిప్షన్ ఎంపికలను కూడా అందిస్తుంది. Tenda N301 ఉపయోగ సమయం మరియు డొమైన్ బ్లాకింగ్ వంటి పేరెంటల్ నియంత్రణలను సమీకృతం చేసింది. ఈ రూటర్ ను కూడా అమెజాన్ ఇండియాలో 50% తగ్గింపుతో రూ.999 ధర వద్ద పొందవచ్చు. TP-Link TL-WR820N అనేది రూ.1000 ధరలోపు లభించే వైర్‌లెస్ రూటర్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలలో ఒకటి. ఇది IEE 802.11b/g/n టెక్నాలజీకి అనుకూలమైనది మరియు TP-Link TL-WR820N ఆన్‌లైన్ టాస్క్‌లకు 300 Mbps వైర్‌లెస్ ప్రసార వేగాన్ని ఆదర్శంగా అందిస్తుంది. ఇందులో గల రెండు 5dBi యాంటెనాలు మరియు 2×2 MIMO మెరుగైన వైర్‌లెస్ ప్రసారాన్ని అందిస్తాయి మరియు బలమైన సిగ్నల్ తీవ్రతతో కవరేజీని అందిస్తాయి. వైర్‌లెస్ రూటర్‌లో IPTV సపోర్ట్, IGMP ప్రాక్సీ/స్నూపింగ్, బ్రిడ్జ్ మరియు IPTV స్ట్రీమింగ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి VLAN ట్యాగ్ ఉన్నాయి. ఇది హోమ్ నెట్‌వర్క్‌ను భద్రపరిచే అతిథుల కోసం కూడా నెట్‌వర్క్‌ను ఎటువంటి ఆటంకులు లేకుండా అందివ్వడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ పరికరం 23% తగ్గింపుతో రూ.999 ధర వద్ద అమెజాన్ లో విక్రయించబడుతున్నది.

Post a Comment

0 Comments