Ad Code

నెట్‌ఫ్లిక్స్‌, టిక్‌టాక్‌ రష్యా లో సర్వీసులు బంద్!


ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ప్రపంచానికి వ్యతిరేకంగా రష్యా అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఎంతగా వారించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలను విధించాయి. అన్నివైపులా రష్యాను కట్టడి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాయి. అయినా సరే.. నేను మోనార్క్ అంటూ పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగలేదు. రష్యా ప్రవేశపెట్టిన ఫేక్ చట్టాన్ని ఆన్ లైన్ స్ట్రీమింగ్, సోషల్ ప్లాట్ ఫాంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ దిగ్గజం టిక్ టాక్, ప్రపంచ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ రష్యాకు గట్టి షాక్ ఇచ్చాయి. రష్యాలో తమ సర్వీసులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షల్లో భాగంగా రష్యాతో రిలేషన్ బ్రేక్ చేస్తున్నాం. రష్యా తెచ్చిన ఫేక్‌ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం' అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశాయి. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌కు రష్యాలో మిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు. రష్యాలో నెట్ ఫ్లిక్స్ కొత్త యూజర్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పటికే రష్యాలో నెట్ ఫ్లిక్స్ వినియోగిస్తున్న యూజర్ల మాటేంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరో సోషల్ దిగ్గజం టిక్ టాక్ కూడా రష్యాలో తమ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసులు సహా ఇతర సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. యుక్రెయిన్‌ ఆక్రమణకు సంబంధించి రష్యాపై ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ చట్టం, కఠిన శిక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా తెచ్చిన ఈ ఫేక్ చట్టానికి వ్యతిరేకంగా టిక్ టాక్, నెట్ ఫ్లిక్స్ తమ సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టుగా వెల్లడించాయి. మరోవైపు యూఎస్ క్రెడిట్ కార్డు కంపెనీలైన Visa, Mastercard, American Express కూడా రష్యాలో తమ సర్వీసులను నిలిపివేస్తామని వెల్లడించాయి. సౌత్ కొరియా దిగ్గజమైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ షిప్స్ ఉత్పత్తులను రష్యాకు తరలించడం నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ సర్వీసులను ఇతర అతిపెద్ద టెక్ దిగ్గజాలైన ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, డెల్ కంపెనీలకు తమ సర్వీసులను అందించనున్నట్టు స్పష్టం చేశాయి. అలాగే ఆపిల్, గూగుల్ కంపెనీలు రష్యాలోని తమ యాప్ స్టోర్లలో సర్వీసులను నిలిపివేసినట్టు వెల్లడించాయి. ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా తమ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నామని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu