మహీంద్రా SUV కార్లపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్లు..!


ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కంపెనీ మెగా ఆఫర్లను ప్రకటించింది. హోళీ పండుగను పురస్కరించుకుని మహీంద్రా SUV కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా SUV కార్ల మోడళ్లపై రూ.3.02 లక్షల వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. పండుగ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఆఫర్లను అందిస్తోంది. కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మహీంద్రా అందించే మెగా ఆఫర్లు SUV కార్ల మోడళ్లలో XUV100, XUV300, Scorpio, Bolero, Bolero Neo, Marazzo, Alturas G4 ఆఫర్ చేస్తోంది. అయితే Mahindra XUV 700, Mahindra Thar రెండు కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు, బెనిఫిట్స్ లేవు. మహీంద్రా కంపెనీ ఈ కారు మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ధర రూ. 38,055 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కాంప్యాక్ట్ SUV కారుపై కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 3,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తోంది. మహీంద్రా XUV300 కారు కొనుగోలుపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. XUV300 కొనుగోలుపై రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను పొందవచ్చు. ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 25,000 వరకు బెనిఫిట్స్ మహీంద్రా అందించనుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కూడా రూ. 4000 వరకు అందిస్తోంది. మహీంద్రా స్కార్పియో కారుపై కూడా మహీంద్రా కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ కారు కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.15వేల వరకు విలువైన యాక్ససరీస్ ఉచితంగా పొందవచ్చు. ఈ కారుకు మాత్రం కొనుగోలుదారులు ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ వర్తించదు. ఈ కారుపై కార్పొరేట్ డిస్కౌంట్ ధర రూ. 4,000 ఉండగా.. ఎక్స్ఛేంజ్ బోనస్ ధర రూ. 15,000 వరకు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ Alturas G4 కారు కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై భారీగా రూ. 2.2 లక్షల భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. రూ. 50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. రూ. 11,500 అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా మహీంద్రా అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఫ్రీగా పొందవచ్చు. మహీంద్రా కంపెనీ ) SUV బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇతర Trim వేరియంట్స్‌పై రూ. 15వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ పొందవవచ్చు. అంతేకాదు.. రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ సొంతం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5,200 వరకు కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments