Ad Code

స్మార్ట్‌ఫోన్ రూ.99 ధరకే...!


షావోమీ ఇండియా 8వ యానివర్సరీ సందర్భంగా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో షావోమీ, రెడ్‌మీ బ్రాండ్స్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 99 స్టోర్ గురించి. ఈ స్టోర్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ని రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ మొదటి రోజున రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.99 ధరకే అమ్ముతోంది షావోమీ. ఏప్రిల్ 6 సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్ సేల్‌లో రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.99 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లాష్ సేల్‌లో కేవలం కొన్ని యూనిట్స్ మాత్రమే అమ్ముతుంది షావోమీ. కాబట్టి ఈ సేల్ క్షణాల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో పాల్గొనాలనుకునే వారు ముందుగానే లాగిన్ చేసి సిద్ధంగా ఉండాలి. ఫ్లాష్ సేల్ ప్రారంభం కాగానే ఆర్డర్ ప్లేస్ చేసేందుకు ప్రయత్నిచాలి. 99 స్టోర్‌లో ప్రతీ రోజూ కొన్ని ప్రొడక్ట్స్‌ని రూ.99 ధరకు అమ్ముతుంది షావోమీ. రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరిలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. హొరైజన్ బ్లూ, పోలార్ వైట్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డాట్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 8ఐ, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.  రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ సెటప్ ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వరకు సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu