Ad Code

వాట్సాప్ సపోర్ట్ అకౌంట్ పేరుతో మోసాలు !


యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొద్ది రోజుల క్రితం వాట్సాప్ సపోర్ట్  చాట్ విండో పరిచయం చేసింది.  ఈ ఇంటరాక్టివ్ చాట్ థ్రెడ్ ద్వారా యూజర్లు బగ్స్ తో పాటు వాట్సాప్‌కు సంబంధించి ఇతర రిపోర్ట్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొందరు సైబర్ నేరగాళ్లు అచ్చం వాట్సాప్ సపోర్ట్ లాంటి అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఫేక్ అకౌంట్ల ముసుగులో యూజర్ల పర్సనల్ డేటా దొంగలిస్తున్నారు. అసలైన వాట్సాప్ సపోర్ట్ లాగా నకిలీ వాట్సాప్ సపోర్ట్ అకౌంట్లు సృష్టించి వీరు వ్యక్తిగత, ఇతర సున్నితమైన సమాచారం వంటి డేటాను దొంగిలిస్తున్నారని వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా తెలిపింది. దీనివల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముంది. "వాట్సాప్ సపోర్ట్‌గా కనిపించే ఒక అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపుతారు. యూజర్లు అది అసలైనదో కాదో తెలుసుకోలేరు. ఇలా యూజర్లు తమ సున్నితమైన సమాచారాన్ని వారికి షేర్ చేసే అవకాశం ఉంది" అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఒకవేళ మీ వాట్సాప్ అకౌంట్‌కు అలాంటి మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే ముందు పంపినవారి గుర్తింపును ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే రిపోర్ట్ చేసి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలి. ఈ సైబర్ నేరగాళ్లు తమ ప్రొఫైల్ ఫొటోలో వాట్సాప్ లోగోతో పాటు కన్ఫర్మ్ చేసిన టిక్‌ను చేర్చుతారు. దీని వల్ల యూజర్లు అది ఫేక్ వాట్సాప్ సపోర్ట్ అని గ్రహించలేరు. అయితే కొన్ని చిన్న గుర్తులను గమనిస్తే ఏది నిజమయిందో ఈజీగా కనుక్కోవచ్చు. "మీరు వెరిఫైడ్ వాట్సాప్ సపోర్ట్‌తో చాట్ చేస్తున్నప్పుడు, డిస్కషన్ స్క్రీన్‌లో వారి పేరు, చాట్ ఇన్ఫో పక్కన వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ గ్రీన్ కలర్‌లో రైట్ మార్క్ లా ఉంటుంది. ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ అకౌంట్ పేరు, చాట్ ఇన్ఫో పక్కన కాకుండా ప్రొఫైల్ ఫొటో వంటి వేరొక లొకేషన్‌లో కనిపిస్తే అది ఫేక్ అని అర్థం. ఆ కాంటాక్ట్ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని గ్రహించాలి" అని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. "ఈ ఫేక్ కాంటాక్ట్స్ క్రియేట్ చేసే నేరగాళ్లు మీ వాట్సాప్ అకౌంట్ రిమూవ్ అవ్వకుండా ఉండాలంటే మీ క్రెడిట్ కార్డ్ డేటా వంటి కొన్ని సున్నితమైన సమాచారాన్ని ఇవ్వాలని నమ్మబలుకుతారు" అని వాట్సాప్ బీటా ఇన్ఫో వివరించింది. కొన్ని సందర్భాల్లో మీ వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి వారు మీ 6-అంకెల కోడ్‌ను కూడా రిక్వెస్ట్ చేయొచ్చని అది హెచ్చరించింది. వాట్సాప్ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని లేదా మీ 6-అంకెల కోడ్ లేదా టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ వంటి సమాచారాన్ని ఎన్నటికీ అడగదు. అకౌంట్ బ్యాన్ చేయకుండా ఉండటానికి వాట్సాప్ డబ్బు లేదా వ్యక్తిగత వివరాలను కూడా అడగదని యూజర్లు గమనించాలి. "ఎవరైనా ఈ సమాచారాన్ని అభ్యర్థిస్తుంటే, అది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న అకౌంట్ కావచ్చు. ఇలాంటి అకౌంట్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. ఈ చాట్ నుంచి 5 రీసెంట్ మెసేజ్‌లు అఫీషియల్ వాట్సాప్ మోడరేషన్ బృందంతో షేర్ అవుతాయి. తద్వారా వారు అకౌంట్ యాక్టివిటీని గ్రహించి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయగలరు." అని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఇది కేవలం వాట్సాప్‌కు మాత్రమే పరిమితం కాదు. ఫేస్ అకౌంట్ క్రియేట్ చేసే వారు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల వలె నటించవచ్చు. కాబట్టి తెలియని నంబర్ నుంచి మీకు తెలిసిన వారిలా మెసేజ్‌లు పంపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Post a Comment

0 Comments

Close Menu