Ad Code

క్రెడిట్ కార్డ్స్‌కు యూపీఐ లింకింగ్ ?


క్రెడిట్ కార్డులను యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్ఫామ్ చేసింది. ముందుగా రూపే కార్డులను లింక్ చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ, వీసా, మాస్టర్ కార్డుల్లాంటి ఇతర నెట్‌వర్క్‌లకు ఓకే చెప్పనుంది. ఇప్పటివరకూ కస్టమర్లు డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐతో లింక్ చేసుకునేవారు. మానిటరీ పాలసీ స్పీచ్‌లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు. “సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్స్ మాత్రమే యూపీఐతో లింక్ అయి ఉండేవి. ఇప్పుడు యూపీఐ ప్లాట్ ఫాంపై క్రెడిట్ కార్డ్స్‌ను కూడా జత చేయనున్నారు. దీనిని రూపే క్రెడిట్ కార్డ్స్ తో ఆరంభించనున్నారు. దీంతో యూజర్లకు డిజిటల్ పేమెంట్స్ విషయంలో అదనపు సౌకర్యం చేకూరనుంది” అని వెల్లడించారు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుందనేది స్పష్టత రాలేదు. ప్రతి లావాదేవీపై, వ్యాపారి లావాదేవీ మొత్తంలో కొంత శాతాన్ని చెల్లిస్తారు. జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వచ్చిన నియమం ప్రకారం.. UPI రూపే పేమెంట్ సున్నా-MDRతో జరుగుతాయి. అంటే ఈ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు. దేశవ్యాప్తంగా వ్యాపారులు UPIని విస్తృతంగా స్వీకరించడానికి ఇదే ప్రధాన కారణం.

Post a Comment

0 Comments

Close Menu