Ad Code

నెట్‌ఫ్లిక్స్ 'బేసిక్ విత్ యాడ్స్' ప్లాన్ లాంచ్


నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ విత్ యాడ్స్  అనే కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌ను 12 దేశాల్లో ప్రారంభించింది. పేరు సూచించినట్లుగా ఈ ప్లాన్ తీసుకున్న సబ్‌స్క్రైబర్స్‌ వీడియోస్ చూస్తున్నప్పుడు యాడ్స్ చూడాల్సి వస్తుంది. కాకపోతే ప్రీమియం, స్టాండర్డ్, బేసిక్ ప్లాన్స్‌తో పోలిస్తే దీనికి తక్కువ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇండియాలో ఈ కొత్త ప్లాన్‌ను ఎప్పుడు తీసుకొస్తామనే దానిపై కంపెనీ ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా ఈ చౌకైన ప్లాన్ ఈ ఏడాది చివరిలోగా ఇండియాలో కూడా అందుబాటులోకి రావచ్చు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్ యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్‌లోని సబ్‌స్క్రైబర్‌ల కోసం తాజాగా రిలీజ్ అయింది. కొత్త బేసిక్ విత్ యాడ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర అమెరికాలో నెలకు 6.99 డాలర్లు అంటే దాదాపు రూ.578 వరకు ఉంటుంది. అక్కడ బేసిక్ ప్లాన్ ధర 9.99 డాలర్లుగా ఉంది. అంటే కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్ మూడు డాలర్ల తక్కువ ధరతో వస్తోంది. ఈ ప్లాన్‌ కింద కంపేటబుల్ ఫోన్/ట్యాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీ డివైజ్‌లో 720P HD క్వాలిటీలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ చూడవచ్చు. అంతేకాకుండా, ఎలాంటి యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. కొత్త బేసిక్ ప్లాన్ వల్ల ఇప్పటికే ఉన్న బేసిక్ ప్యాక్‌తో కంటెంట్ వీక్షిస్తున్న యూజర్లు, ప్రస్తుత రన్నింగ్ ప్లాన్‌లు ప్రభావితం కాబోవని ప్లాట్‌ఫామ్ క్లారిటీ ఇచ్చింది. పాత బేసిక్ ప్లాన్ యాడ్-ఫ్రీగానే ఉంటుందని.. మొత్తం కంటెంట్‌ను యాడ్ ఫ్రీగా ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఓల్డ్ బేసిక్ ప్లాన్, న్యూ బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ ఒకే విధమైన ఫీచర్లతో వస్తాయని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే కొత్త యాడ్ సపోర్టివ్ ప్లాన్‌లో యూజర్లు గంటకు 4 నుంచి 5 నిమిషాల వరకు యాడ్స్ చూస్తారు. ఏదైనా షో లేదా సినిమా ప్రారంభించే ముందు 30 సెకన్ల వరకు నిడివి గల యాడ్స్ పొందుతారని ప్లాట్‌ఫామ్ పేర్కొంది. ఒక యాడ్ లెంగ్త్ 15 నుంచి 30 సెకన్ల వరకు ఉండొచ్చు. కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్ మూవీలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజర్లను అనుమతించదు. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం, ఈ ప్లాన్ కింద యూజర్లకు లైసెన్స్ పరిమితుల కారణంగా కొన్ని మూవీస్/టీవీ షోలు అందుబాటులో ఉండవు. మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ మూవీలు/ టీవీ షోల టైటిల్స్‌పై లాక్ ఐకాన్ ఉంటుంది. యాక్సెస్ చేయలేని కంటెంట్ 5-10% వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. యూఎస్‌తో పోల్చితే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్‌ ధరలు చాలా తక్కువ. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో రూ.149కే బేసిక్ మొబైల్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఒకవేళ బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్ ధర కూడా ఇంతకంటే తక్కువగా ఉంటే ఇండియాలో సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ రెవిన్యూ కూడా పెరుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu