Ad Code

గిరాకీ పెరిగిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ !


టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటికి భారీ గిరాకీ ఉంది. గత మూడు నాలుగు నెలల కాలంలో చూస్తే ఓలా ఎలక్ట్రిక్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అదేసమయంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2021 నవంబర్ నెలలో ఐక్యూబ్ అమ్మకాలు కేవలం 699 యూనిట్లు కాగా, 2022 నవంబర్ నెలలో 10,056 యూనిట్లు. అంటే టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో వార్షికంగా ఏకంగా 1339 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. నవంబర్ నెలలో ఎక్కువగా విక్రయమైన టాప్ 10 బెస్ట్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ 9వ స్థానంలో నిలిచింది. కంపెనీ తన ఐక్యూబ్ అధికారిక సైట్‌లో స్కూటర్ కొనడం వల్ల ఎంత లాభం పొందవచ్చో వివరించింది. పెట్రోల్ స్కూటర్ 50 వేల కిలోమీటర్లు తిరగడానికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. ఇక్కడ పెట్రోల్ ధరను లీటరుకు రూ.100గా తీసుకున్నారు. అదే ఐక్యూబ్ స్కూటర్ కొంటే రూ.6,466కే 50 వేల కిలోమీటర్లు తిరగొచ్చని కంపెనీ తెలిపింది. ఇంకా జీఎస్‌టీ , సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ వంటి రూపంలో మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే 50 వేల కిలోమీటర్లపై రూ. 93,500 వరకు ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంటోందిఅంతేకాకుండా ఒక్కసారి చార్జింగ్ పెట్టుకోవడానికి రూ. 18.75 ఖర్చు అవుతుందని పేర్కొంటోంది. ఐక్యూబ్‌లో ఎస్‌టీ మోడల్‌ చార్జింగ్ టైమ్ 4 గంటల 6 నిమిషాలు. 145 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మీరు రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించినా.. వారానికి రెండు సార్లు చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఖర్చు రూ.37.5 అవుతుంది. అంటే నెలకు రూ. 150 మేర ఖర్చు అవుతుంది. అంటే రోజుకు రూ. 3 ఖర్చు అవుతుంది. ఐక్యూబ్ ధర విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో టీవీఎస్ ఐక్యూబ్ రేటు రూ. 1.15 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu