Ad Code

ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త అప్‌డేట్స్ ?


ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ల సెట్‌ను ప్రకటించింది. మీ స్నేహితులు లేదా బంధువులతో కనెక్ట్ అయ్యేందుకు కొత్త ఇన్ స్టా ఫీచర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. అందులో ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌ను యాడ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త ఫీచర్ బీ రియల్ యాప్‌లా పని చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు రాబోయే రోజుల్లో గ్రూప్ ప్రొఫైల్‌లు, ఇతర అప్‌డేట్‌లను కూడా అందుకోనున్నారు. ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్ క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇన్‌స్టా యూజర్లు తమ స్టోరీలో ఏదైనా విషయాన్ని క్యాప్చర్ చేయడంతో పాటు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, వారి సొంత క్యాండిడ్ స్టోరీలను షేర్ చేసుకునే వారికి మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్ BeReal యాప్‌లో ఉన్న కాన్సెప్ట్‌కి కాపీ అయినట్లు కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు తమ ఫిల్టర్‌లతో పిక్చర్-పర్ఫెక్ట్ ఫొటోలు లేదా షార్ట్ వీడియోలను షేర్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇందులో BeReal యాప్ ఆధారిత ఫీచర్‌ను యాడ్ చేస్తోంది. ఫేస్‌బుక్ స్టోరీస్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది. ఇన్‌స్టాగ్రామ్ కొత్త గ్రూప్ ప్రొఫైల్స్ ఫీచర్‌ను కూడా యాడ్ చేస్తోంది. దీంతో మీ స్నేహితులతో షేర్ చేసిన ప్రొఫైల్‌లో పోస్ట్‌లు, స్టోరీలను షేర్ చేసేందుకు యూజర్లు ఈ కొత్త టైప్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయవచ్చు. కొత్త గ్రూపు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసేందుకు '+' ఐకాన్‌పై Tap చేయాల్సి ఉంటుంది. గ్రూపు ప్రొఫైల్‌లను ముందుగా ఎంచుకోవాలి. మీరు గ్రూప్ ప్రొఫైల్‌కు కంటెంట్‌ను షేర్ చేసేందుకు కంటెంట్ మీ ఫాలోయర్‌లకు బదులుగా గ్రూప్ మెంబర్‌లకు మాత్రమే షేర్ అవుతుంది. మీ సొంతంగా కాకుండా గ్రూప్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయవచ్చునని Instagram బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్‌ను కూడా రిలీజ్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ ఆలోచనలను షేర్ చేసుకోవచ్చు. మరోమాటలో చెప్పాలంటే.. నోట్స్ కేవలం టెక్స్ట్, ఎమోజీలను ఉపయోగించి 60 అక్షరాల వరకు ఉండే షార్ట్ పోస్ట్‌లను పంపుకోవచ్చు. ఇన్‌బాక్స్ పైభాగానికి వెళ్లడం ద్వారా సులభంగా నోట్స్ పంపుకోవచ్చు. మీ ఫాలోవర్లు లేదా మీ సన్నిహిత స్నేహితుల లిస్టులో వ్యక్తులను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీ నోట్స్ మీ ఇన్‌బాక్స్ టాప్ కార్నర్‌లో 24 గంటల పాటు కనిపిస్తుంది. మీ ఇన్‌బాక్స్‌లో ఇచ్చే Notes అన్ని రిప్లేలకు DMలుగా వస్తాయని కంపెనీ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu