Ad Code

ప్రోమేట్ నుంచి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ విడుదల !


దేశీయ మార్కెట్లో ప్రోమేట్ ఈరోజు కొత్త ట్రాన్స్పరెంట్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను యూత్ ని ఆకర్షించే ట్రాన్స్పరెంట్ డిజైన్, సరికొత్త కలర్ ఆప్షన్ లతో తీసుకు వచ్చింది.  ఈ ఇయర్ బడ్స్ ను Rs.1,999 ధరతో 24 నెలల వారెంటీతో అందించింది. ఈ కొత్త బడ్స్ ను బ్లాక్, బ్లూ,పింక్,వైట్ కలర్ ఆప్షన్ లలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను ఈరోజు నుండి అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.  ప్రోమేట్ ఈ కొత్త ట్రాన్స్పరెంట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను IntelliTouch తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ కంఫర్టబుల్ డిజైన్ తో స్నగ్ ఫిట్ తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ 13mm dynamic స్పీకర్స్ తో మంచి BASS సౌండ్ తో పాటు క్రిస్టల్ క్లియర్ హై నోట్స్ ను కూడా అందిస్తుందని ప్రోమేట్ గొప్పగా చెబుతోంది.ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే, ఈ బడ్స్ యాక్టీవ్ నాయిస్ కాన్సలేషన్  సపోర్ట్ తో గొప్ప మ్యూజిక్ మరియు కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ బడ్స్ 350mAh బ్యాటరీతో 50 స్టాండ్ బై మరియు 26 గంటల టోటల్ ప్లే టైమ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu