Ad Code

మెదడును చదివే మెషీన్‌ ?


మెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి పరిశోధకులు మెదడు ఏం ఆలోచిస్తుందో అక్షర రూపంలో కనిపించేలా చేసే నూతన సాంకేతికతను  అభివృద్ధి చేశారు. ఈ వివరాలు 'నేచర్‌ హ్యూమన్‌ బిహేవియర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది మూగవారికి చాలా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. మెదడులోని నిర్దేశిత ప్రాంతాల్లో కొన్ని సూక్ష్మ పరికరాలు అమరుస్తారు. తర్వాత ఏం ఆలోచిస్తున్నారో బయట ఉండే మరో పరికరంలో అక్షర రూపంలో కనిపిస్తుంది. దీనిని ముందుగా ఇద్దరిపై ప్రయోగించారు. చెంచా, పాము, యుద్ధక్షేత్రం వంటి పదాల గురించి ఆలోచించమని కోరగా, వారి ఆలోచనలు అక్షర రూపంలో నమోదైంది. మెదడులో అమర్చిన పరికరాలతో ఇంటర్నల్‌ స్పీచ్‌కు అనుసంధానమై ఉండే నాడీ కార్యకలాపాలను గుర్తించడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu