Ad Code

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు పొందినట్లు బజాజ్ ఆటో తెలిపింది. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన బజాజ్.. దాని అత్యంత ప్రసిద్ధ స్కూటర్ బజాజ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో విడుదల చేసింది. హమారా బజాజ్’గా ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్ ఇప్పుడు ఎలక్ట్రిక్‌గా మారింది.  చాలా స్టైలిష్‌గా ఉంది. ఫ్రంట్ లైట్ కూడా గుండ్రంగా ఉంది. దీని బాడీ మొత్తం మెటల్ తో తయారు చేశారు. డిస్‌ప్లేలో బ్యాటరీ శాతంతో పాటు, GPS, బ్లూటూత్ ఛార్జింగ్, జియో మ్యాప్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, LED ల్యాంప్స్ మొదలైనవి ఉన్నాయి. ఇది 4080W BLDC ఎలక్ట్రిక్ మోటారుతో పాటు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీపై కంపెనీ మూడు సంవత్సరాల వారంటీని ఇస్తుంది. బజాజ్ చేతక్‌లో రెండు మోడ్‌లు ఉన్నాయి దాని ప్రకారం మైలేజీ నిర్ణయించబడుతుంది. దీని మొదటి మోడ్ ఎకో, దీనిలో స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు నడుస్తుంది. మరోవైపు, స్పోర్ట్స్ మోడ్ ఉంది, దీనిలో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ ప్రీమియం స్కూటర్ ధర రూ. 1.51 లక్షలుగా నిర్ణయించారు.. ఇది ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ తర్వాత రూ. 1,57,943 అవుతుంది.


Post a Comment

0 Comments

Close Menu