Ad Code

ఐరా ఎలక్ట్రిక్ స్కూటర్ !


హయస అనే కంపెనీ ఐరా అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేసింది.  స్లీక్, స్లైలిష్, కూల్ లుక్‌తో అదరగొడుతోంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు కూడా ఉన్నాయి. స్ల్పాష్ ప్రూఫ్ డిజైన్, డిటాచబుల్ బ్యాటరీ దీని సొంతం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 230 వాట్ మోటార్ ఉంటుంది. స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 90 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. గరిష్టంగా ఈ స్కూటర్ ఇద్దరిని మాత్రమే లాగగలదు. స్వల్ప దూరపు ప్రయాణాలకు మాత్రమే ఈ స్కూటర్ అనువుగా ఉంటుందని గుర్తించుకోవాలి. ఎక్కువ దూరం, స్పీడ్ వెళ్లాలని భావిస్తే మాత్రం ఇది సరిపోదు. డిజిటల్ స్పీడో మీటర్ ఇందులో ఉంది. చూడటానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ డిజైన్‌తో ఉంది. రెడ్, ఎల్లో వంటి రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు నేరుగా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ కేవలం ఈ మోడల్‌ను మాత్రమే కాకుండా ఇతర మోడళ్లను కూడా అందిస్తోంది. ఇంకో మూడు మోడళ్లను ఈ కంపెనీ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. దక్ష, నిర్బర్, విజయ్ 2000 అనే మోడళ్లను కూడా విక్రయిస్తోంది. ఇకపోతే ఈ ఐరా అ నే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 76,750 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ స్కూటర్ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి ఐదు గంటలు పడుతుంది. స్కూటర్ ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్, వెనుక భాగంలో స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్ సిస్టమ్ ఉంది. స్కూటర్‌లో డిజిటల్ ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్స్, అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందుబాటు ధరలో అదిరే డిజైన్‌తో ఉన్న స్కూటర్ కొనాలని భావించే వారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu