శామ్‌సంగ్ కంపెనీ వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్లతో బ్లూ ఫెస్ట్ 2023 పేరుతో కొత్త ప్రమోషనల్ ఈవెంట్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈవెంట్ ఏప్రిల్ 30, 2023 వరకు ఉంటుంది. ఈ ఈవెంట్‌లో వినియోగదారులు శామ్‌సంగ్ ఎయిర్ కండిషనర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, సౌండ్‌బార్లు, డిష్‌వాషర్ల వంటి వివిధ వస్తువులపై అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ 2023లో వినియోగదారులు The Frame TV మోడల్ కొనుగోలు చేస్తే.. రూ.9,990 విలువైన బెజెల్/ఫ్రేమ్ కవర్ ఫ్రీగా లభిస్తుంది. కొనుగోలు చేసిన ఫ్రేమ్ టీవీ సైజుతో సంబంధం లేకుండా ఈ ఫ్రేమ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తుంది. అలానే ఎంపిక చేసిన 75-అంగుళాల, అంతకన్నా ఎక్కువ సైజు ఉన్న నియో QLED, QLED ఫ్రేమ్ టీవీలతో రూ.99,990 విలువైన సౌండ్‌బార్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ సమయంలో శామ్‌సంగ్ ప్రీమియం సిరీస్‌లోని Neo QLED, QLED, The Frame TVలను కొనుగోలు చేసే వినియోగదారులు Samsung Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. డిష్‌వాషర్లను కూడా ఇదే క్యాష్‌బ్యాక్‌తో దక్కించుకోవచ్చు. ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు చేసే వారు ఐదేళ్ల PCB కంట్రోలర్ వారంటీని, 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను, శామ్‌సంగ్ Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారు రూ.990 నుంచి జీరో డౌన్ పేమెంట్‌తో సులభమైన EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ సందర్భంగా, శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లపై కూడా ప్రత్యేక డీల్‌లను అందిస్తోంది. ఈ డీల్స్‌తో 12కేజీ కెపాసిటీ కలిగిన AI EcoBubble ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.40,000కే అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 20% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలానే వీటిని కొనుగోలు చేయడం ద్వారా 28L మైక్రోవేవ్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఇష్టపడే కస్టమర్‌ల కోసం ఇన్వర్టర్ రేంజ్ ప్రత్యేక ధర రూ.19,000 అందుబాటులో ఉంటుంది. అలాగే కస్టమర్లు 17.5% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌సంగ్ Wi-Fi సపోర్ట్‌తో బెస్పోక్ మైక్రోవేవ్‌తో వచ్చే బెస్పోక్ సైడ్-బై-సైడ్.. ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్‌ల కొత్త సిరీస్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ఆఫర్ సమయంలో బెస్పోక్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.1,03,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.2,490 నుంచి ప్రారంభమయ్యే జీరో డౌన్ పేమెంట్, EMI వంటి ఆప్షన్స్ సైతం పొందవచ్చు. Curd Maestro Frost ఫ్రీ మోడల్స్ కొనే కస్టమర్లు 15% వరకు క్యాష్‌బ్యాక్, రూ.990 నుంచి EMIలు, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను పొందవచ్చు.
0 Comments