Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label tech. Show all posts
Showing posts with label tech. Show all posts

Saturday, March 25, 2023

శామ్‌సంగ్ బ్లూ ఫెస్ట్ 2023 ఈవెంట్ !


శామ్‌సంగ్‌ కంపెనీ వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్లతో బ్లూ ఫెస్ట్ 2023 పేరుతో కొత్త ప్రమోషనల్ ఈవెంట్ స్టార్ట్ చేసింది.  ప్రస్తుతం కొనసాగుతున్న ఈవెంట్ ఏప్రిల్ 30, 2023 వరకు ఉంటుంది. ఈ ఈవెంట్‌లో వినియోగదారులు శామ్‌సంగ్‌ ఎయిర్ కండిషనర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, సౌండ్‌బార్లు, డిష్‌వాషర్ల వంటి వివిధ వస్తువులపై అదిరిపోయే డీల్స్‌, డిస్కౌంట్స్‌ పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ 2023లో వినియోగదారులు The Frame TV మోడల్ కొనుగోలు చేస్తే.. రూ.9,990 విలువైన బెజెల్‌/ఫ్రేమ్ కవర్‌ ఫ్రీగా లభిస్తుంది. కొనుగోలు చేసిన ఫ్రేమ్ టీవీ సైజుతో సంబంధం లేకుండా ఈ ఫ్రేమ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తుంది. అలానే ఎంపిక చేసిన 75-అంగుళాల, అంతకన్నా ఎక్కువ సైజు ఉన్న నియో QLED, QLED ఫ్రేమ్ టీవీలతో రూ.99,990 విలువైన సౌండ్‌బార్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ సమయంలో శామ్‌సంగ్ ప్రీమియం సిరీస్‌లోని Neo QLED, QLED, The Frame TVలను కొనుగోలు చేసే వినియోగదారులు Samsung Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. డిష్‌వాషర్లను కూడా ఇదే క్యాష్‌బ్యాక్‌తో దక్కించుకోవచ్చు. ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు చేసే వారు ఐదేళ్ల PCB కంట్రోలర్ వారంటీని, 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను, శామ్‌సంగ్ Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారు రూ.990 నుంచి జీరో డౌన్ పేమెంట్‌తో సులభమైన EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ సందర్భంగా, శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లపై కూడా ప్రత్యేక డీల్‌లను అందిస్తోంది. ఈ డీల్స్‌తో 12కేజీ కెపాసిటీ కలిగిన AI EcoBubble ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.40,000కే అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 20% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలానే వీటిని కొనుగోలు చేయడం ద్వారా 28L మైక్రోవేవ్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఇష్టపడే కస్టమర్‌ల కోసం ఇన్వర్టర్ రేంజ్ ప్రత్యేక ధర రూ.19,000 అందుబాటులో ఉంటుంది. అలాగే కస్టమర్లు 17.5% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌సంగ్ Wi-Fi సపోర్ట్‌తో బెస్పోక్ మైక్రోవేవ్‌తో వచ్చే బెస్పోక్ సైడ్-బై-సైడ్.. ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్‌ల కొత్త సిరీస్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ఆఫర్ సమయంలో బెస్పోక్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.1,03,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.2,490 నుంచి ప్రారంభమయ్యే జీరో డౌన్ పేమెంట్, EMI వంటి ఆప్షన్స్ సైతం పొందవచ్చు. Curd Maestro Frost ఫ్రీ మోడల్స్ కొనే కస్టమర్లు 15% వరకు క్యాష్‌బ్యాక్, రూ.990 నుంచి EMIలు, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను పొందవచ్చు.

Saturday, February 11, 2023

గోడాడీ, యాహూలో లే ఆఫ్స్ !


గోడాడీ తన ఉద్యోగులలో 8 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన ఆర్థిక పరిస్థితి మరియు రాబోయే సవాళ్ల కారణంగా కంపెనీ సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఈ సమాచారాన్ని కంపెనీ సీఈవో అమన్ భూటానీ తెలిపారు. 530 మంది ఉద్యోగులను తొలగించినట్లు అమన్ భూటానీ తెలిపారు. దీని ప్రభావం ఎక్కువగా అమెరికాలో పడింది. కంపెనీ అన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి మొత్తం 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు. మీడియా టెంపుల్, మెయిన్ స్ట్రీట్ హబ్ లను ఏకతాటిపైకి తీసుకురావడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు భూటానీ చెప్పారు. తొలగించబడిన ఉద్యోగులకు స్థానిక నిబంధనల ప్రకారం ప్యాకేజీలను అందిస్తున్నట్లు సిఇఒ చెప్పారు. అమెరికా లోని మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలతో కూడిన 12 వారాల ప్యాకేజీ సెలవు ఇవ్వబడుతుంది. అదనంగా, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు, అవుట్‌ప్లేస్‌మెంట్ మరియు ఇమ్మిగ్రేషన్ మద్దతు కనీసం నాలుగు వారాల పాటు అందించబడతాయి. కొత్త సంవత్సరంలో అంటే రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలోలో 336 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు 1 లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. కొద్ది రోజుల క్రితమే జూమ్, డెల్, యాహూ వంటి ఉద్యోగులు లేఆఫ్‌లు ప్రకటించారు. మరోవైపు.. గ్లోబల్ మాంద్యాన్ని పేర్కొంటూ గూగుల్ , మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగించాయి. యాహూలో యాడ్‌ టెక్‌ డివిజన్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తమ సంస్థలోని 20 శాతం మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు శుక్రవారం కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా 50 శాతం యాడ్‌ టెక్‌ విభాగం ఉద్యోగులను ఈ ఏడాది ఆఖరులోగా, అందులో వెయ్యి మందిని ఈ వారంలో తొలగిస్తున్నట్టు వివరించింది. 2021లో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేసిన యాహూలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మాంద్య పరిస్థితుల వల్ల ఆదాయం తగ్గింది. దాంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని యాహూ నిర్ణయించి 20 శాతం మందిని పైగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇలా వరకు టెక్ కంపెనీలు ఆర్థిక మాంద్యం కారణంగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Monday, April 4, 2022

వాట్సాప్‌ లో కొత్త నిబంధన ?


ఫార్వర్డ్‌ సందేశాలను ఒకసారి ఒక గ్రూప్‌ లేదా వ్యక్తికి మాత్రమే ఫార్వార్డ్‌ చేసేలా వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. వాట్సాప్‌ సమాచారాన్ని అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో పోర్టల్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. దాని ప్రకారం.. ''అప్పటికే ఒకసారి ఫార్వార్డ్‌ అయిన సందేశాన్ని ఒక గ్రూప్‌నకు మించి ఫార్వార్డ్‌ చేసేందుకు వీలుండదు. ఒకవేళ్ల వినియోగదారులు అలా చేసేందుకు యత్నిస్తే వారు ఒకరికే పంపగలరన్న సందేశం తెరపై వస్తుంది. ఒక గ్రూప్‌నకు మించి పంపాలని వినియోగదారుడు అనుకుంటే సందేశాన్ని మరోసారి సెలక్ట్‌ చేసి విడిగా ఫార్వార్డ్‌ చేసుకోవాల్సిందే'' అని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఈ కొత్త నిబంధనలను ఆండ్రాయిడ్‌ 2.22.7.2 వెర్షన్‌లోని వాట్సాప్‌ బీటాలో, ఐఫోన్‌ 22.7.0.76 వెర్షన్‌లోని వాట్సాప్‌ బీటాలో సంస్థ ప్రవేశపెట్టిందని పేర్కొంది.

Wednesday, October 13, 2021

నవంబర్ 15 నుంచి వర్క్‌ఫ్రం హోంకు స్వస్తి ?

 

నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆపీసులకు రావాలని టీసీఎస్ ఆదేశించినట్లు టెక్ వెబ్‌సైట్ ట్రాక్ ఇన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీంతో కరోనాను నియంత్రించడానికి గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లైందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీసీఎస్‌లోని ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ హెచ్ఆర్ హెడ్ మిలిండ్ లక్కాడ్ చెప్పారు. రెండు డోస్‌ల వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాత్రమే ఆఫీసులకు రావాలని మిలింద్ లక్కాడ్ చెప్పారని తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం 70 శాతానికి పైగా రెండు డోస్‌లు వేసుకున్నారు. 95 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు సింగిల్ డోస్ వేయించుకున్నారు. అర్హులైన ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి 100 శాతం అలవెన్స్‌లు పొందుతారన్నారు.  2025 నాటికి కేవలం 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులో సేవలందిస్తారని, మిగతా 75 శాతం మందికి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుందని ప్రకటించింది. గత కొన్ని వారాలుగా టీసీఎస్ ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా ఆఫీసులకు వస్తున్నారని సంస్థ ఇంతకుముందు తెలిపింది.

Monday, October 11, 2021

మార్కెట్‌లోకి వివో వై20టీ


'వివో వై20టీ' సిరీస్‌లో విడుదలైన ఫోన్‌లో చక్కటి ఫీచర్లు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్‌డీ క్వాలిటీతో పాటు సెక్యూర్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 662 చిప్‌ సెట్‌, 6జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌, ర్యామ్‌ను ఎక్స్‌టెండ్‌ చేసుకుందుకు ర్యామ్‌ 2.0 ఫీచర్‌, 1జీబీ వర్చువల్‌ మెమెరీ, గేమ్‌లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్‌ వర్క్‌ పర్పస్‌ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది. ట్రిపుల్‌ రేర్ కెమెరా సెటప్‌, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 2ఎంపీ బొకేహ్ కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్‌ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్‌ లైట్‌ అండ్‌ పోట్రేట్‌ మోడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌ మోడ్‌లో 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ సదుపాయం ఉంది. భారత్‌లో విడుదలైన వివో వై20 టీ ఫోన్‌ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్‌ స్టోర్‌ వేరియంట్‌ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్‌ ను బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌లో 12నెలలు పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్‌లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్‌ బ్యాక్‌తో పాటు అమెజాన్‌, పేటీఎం, టాటా క్లిక్‌ స్టోర్‌లలో 6నెలల పాటు నో కాస్ట్‌ ఎక‍్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది.

Sunday, September 26, 2021

టోకెనైజేషన్ వ్యవస్థ !

 

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకు వస్తోంది. అయితే ఈ రూల్స్ ప్రకారం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు కలిగిన వారు సీవీవీ నెంబర్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం అవ్వనున్నాయి. ఈ కొత్త రూల్స్ 2022 జనవరి నుంచి అమలులోకి వస్తున్నాయి. కార్డు వివరాల స్థానం లో టోకెనైజేషన్ వ్యవస్థను అమలు లోకి తీసుకు రానున్నారు. అంటే కార్డు ట్రాన్సక్షన్స్ ని చేసేటపుడు కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు. దీంతో మీ కార్డు సమాచారం ఎవ్వరికీ తెలియదు. మీ వివరాలు సురక్షితంగానే ఉంటాయి.  కార్డు వివరాలు స్టోర్ చేసుకోవద్దని ఆర్‌బీఐ ఇప్పటికే మర్చంట్లకు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ పే, పేటీఎం, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిల్లో కార్డు వివరాలు ఎంటర్ చేసినప్పుడు.. ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డు వంటి వాటికి టోకెన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. కస్టమర్ డివైజ్‌తో ఇవి లింక్ అవుతాయి.

Monday, September 20, 2021

కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేశ్‌

 

దిల్లీ లోని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 28నే వీరు పార్టీలో చేరాల్సి ఉండగా.. కొంచం ఆలస్యంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాహుల్‌ గాంధీతో భేటీ అయినప్పుడే కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని తెలుస్తోంది. ఆయనను బిహార్‌ పార్టీశాఖకు అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు గుజరాత్‌ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ సైతం చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో టచ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం ఇందుకు బలం చేకూరింది. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్‌ చేరిక కాంగ్రెస్‌కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనను పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

Tuesday, August 31, 2021

నవారు మంచం రూ.41వేలు ... !

 


న్యూజిలాండ్‌ లోని అన్నాబెల్లే  బ్రాండ్ నవారు మంచాన్ని భారతీయ ప్రాచీన పగటివేళ పడుకునే మంచం  అనే పేరుతో తన వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది. దాని ధరను 800 న్యూజిలాండ్ డాలర్లుగా ఫిక్స్ చేసింది. అంటే మన భారతీయ రూపాయల్లో రూ.41,297. ఇది ఇంత రేటు ఎందుకు మన దేశంలో మహా అయితే రూ.10 వేల లోపే ఉంటుంది కదా అని మనకు అనిపించవచ్చు. ఇలా విమర్శిస్తామని తెలిసే అ కంపెన ఇది ప్రత్యేకమైన మంచం అనీ, ఒరిజినల్ అనీ చెప్పింది. దాని అసలు ధర 1200 న్యూజిలాండ్ డాలర్లు అని చెప్పింది. అంటే మన రూపాయిల్లో రూ.61,980 అన్నమాట. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.41,297గా చెప్పింది. నవారు మంచంలో ఏముంటుంది... ఓ దీర్ఘ చతురస్రాకార కలపకు చుట్టూ నాలుగు కాళ్లు, మధ్యలో దారాలతో అల్లి ఉంటుంది. దాన్ని తయారుచేయడం తేలికే. అలాంటి దాన్ని అరుదైనదిగా చెబుతూ అదిరిపోయే రేటుకు అమ్మడం ఆశ్చర్యకరమే. ఈ రోజుల్లో ఇలాంటి మంచాల్ని కొనడమే తగ్గిపోయింది. ఇంతకంటే క్వాలిటీ ఉన్నవి కొంటున్నారు. బెడ్ షీట్లు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పెద్ద డబుల్ కాట్ మంచాలు కొనుక్కుంటున్నారు. అందుకే దీన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ మంచం ఫొటో వైరల్ అయ్యింది.

Thursday, August 19, 2021

గూగుల్‌కు మరోసారి భారీ షాక్‌...!

 


రష్యా లో విదేశీ టెక్‌ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ దిగ్గజ టెక్‌ సంస్థ గూగుల్‌ కు రష్యాలో మరోసారి షాక్‌ తగిలింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు మాస్కో కోర్టు గురువారం గూగుల్‌కు మరో జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో రష్యా విదేశీ టెక్ కంపెనీలపై నిషేధించిన కంటెంట్‌ను తొలగించనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంది.రష్యాలో నిషేధిత కంటెంట్‌లో భాగంగా అశ్లీల అంశాలు, తీవ్రవాది భావజాల పోస్ట్‌లు, డ్రగ్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిషేధిత జాబితాలో ఉన్నాయి. నిషేధిత కంటెంట్‌ను ప్రదర్శించినందుకు గాను గూగుల్‌పై స్థానిక కోర్టు ఆరు మిలియన్‌ రూబీళ్లను (సుమారు రూ. 60 లక్షలు) జరిమానా విధించింది. కాగా ఈ వారం ప్రారంభంలో ఇదే విషయంపై వేరువేరు కేసుల్లో మొత్తంగా రూ. 14 మిలియన్ రూబిళ్ల (సుమారు రూ. 1.4 కోట్లు) జరిమానాలు విధించబడ్డాయి. గతనెల డేటానిల్వ చట్టాలను ఉల్లంఘించినందుకు గత నెల గూగుల్‌ సుమారు 3 మిలియన్‌ రూబిళ్లు (సుమారు రూ. 30 లక్షలు) జరిమానా కట్టింది.

Wednesday, August 18, 2021

పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్



గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సబ్సిడీ కూడా అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో సామాన్యులకు గ్యాస్ సిలిండర్ కొనడం భారం అయిపోయింది. ఇలాంటి టైమ్‌లో పేటీఎం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.  ఇలా ఒక్కసారి కాదు... వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మొత్తం రూ.2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. '3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది పేటీఎం. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త యూజర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మూడు నెలల పాటు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రూ.900 క్యాష్‌బ్యాక్ పొందడం మాత్రమే కాదు... డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. తర్వాతి నెలలో గ్యాస్ సిలిండర్ డబ్బులు చెల్లించొచ్చు. పేటీఎం అందిస్తున్న పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆఫర్ ద్వారా ఇది సాధ్యం. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రస్తుత యూజర్లు ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్‌కు రీడీమ్ చేయొచ్చు. ఇక ఇటీవల పేటీఎం సరికొత్త ఫీచర్స్‌తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచింది. యూజర్లు సిలిండర్ బుక్ చేసిన తర్వాత ట్రాకింగ్ కూడా చేయొచ్చు. దీంతోపాటు మీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయాలంటూ పేటీఎం రిమైండర్స్ కూడా పంపిస్తుంది. పేటీఎం యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌లో బుక్ గ్యాస్ సిలెండర్  ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఓసారి వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

Tuesday, August 17, 2021

బెస్ట్ 5జీ ఫోన్‌లు

 



మార్కెట్‌లో 5జీ టెక్నాలజీ ఫోన్‌లు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. వేగవంతమైన పనితీరుతోపాటు కొత్త ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెడియాటెక్ న్యూ డైమెన్సిటీ 1200 చిప్‌తో నడిచే ఫోన్‌లను జనాలు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. వీటి ధర రూ.30,000 లోపే ఉండడం విశేషం.

షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ

- ధర: రూ. 27,499

- బేసిక్ ఫీచర్స్: 6జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ

మెరుగైన ప్రాసెసింగ్ స్పీడ్ షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ మొబైల్ సొంతం. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీతో అందుబాటులో ఉంది. దీనితోపాటు 6జీబీ RAM, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. ఆకర్షణీయమైన రంగులతోపాటు 6.67 అంగుళాల సూపర్ ఏఎమ్‌ఓఎల్‌ఈడీతో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్టే ఫోన్ ప్రత్యేకత. అంతే కాకుండా హెచ్‌డీఆర్‌10+, 13,000 నిట్స్ లైటింగ్ ఉంటుంది. ఫోన్‌కి ఉండే 5 పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్ పై గీతలు పడకుండా కాపాడుతుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేలో గేమ్స్ ఆడడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఫోన్ మందం 8మిమీ కంటే తక్కువ ఉంది. కెమెరా 48 ఎంపీ దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్‌, 5 ఎంపీ అదనపు కెమెరాలు ఉన్నాయి. 20 ఎంపీతో ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బ్యాటరీ 4,520 ఎంఏహెచ్‌. గంటలో ఫోన్ మొత్తం చార్జ్ అయ్యేలా 33W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తోపాటు వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పై MIUI 12 తో రన్ అవుతుంది.


రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ

- ధర: రూ. 27,999

- బేసిక్ ఫీచర్స్: 12జీబీ RAM/ 256 జీబీ స్టోరేజీ

అందమైన ఫిన్షింగ్‌తోపాటు మెరుగైన ఫీచర్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది . రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 1200 SoC ని ఉపయోగించారు. 8 జీబీ RAM/ 128 జీబీ మెమోరీ స్టోరేజ్ మోడల్‌తో పాటు 12 జీబీRAM/256 జీబీ స్టోరేజ్ మోడల్‌లు ఉన్నాయి. 6.43 అంగుళాలతో ఫుల్ హెచ్‌డీ ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే 120 హెడ్జ్‌తో పాటు 1,000 నీట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ సెటప్ కెమెరా ఉంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా కెమెరా, 2 అదనపు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ వీడియోలు, ఫోటోలకు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, 50 W ఫాస్ట్ చార్జర్ ఫోన్‌తోపాటు వస్తాయి. ఫోన్ రియల్‌మీ UI 2.0 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.


వన్‌ప్లస్ నార్డ్ 2

- ధర: రూ. 29,999

- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ

కొత్త 5జీ మోడల్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2 ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. 6.43 అంగుళాల స్క్రీన్‌తోపాటు హెచ్‌డీ+తో పాటు ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్‌10+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఐదు పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్‌కు అదనపు ఆకర్షణను ఇస్తుంది. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కొత్త ఆక్సిజన్ ఓఎస్ 11.3 ని వినియోగిస్తున్నారు. 50 MP ప్రధాన కెమెరతో పాటు ఆప్టికల్ ఇమేజ్‌స్టెబిలైజేషన్ (OIS), సోనీ కొత్త IMX766 సెన్సార్ ఫీచర్ ఫోన్ సొంతం. విభిన్న లైటింగ్‌లలోనూ మంచి ఫోటోలు పొందేలా రూపొందించారు. ప్రధాన కెమెరాకు సపోర్టుగా 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 MP ఫ్రంట్ కెమెరా కారణంగా ఎక్కువ మంది సెల్ఫీ ప్రియులు ఈ ఫోన్‌పై మక్కువ చూపుతున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2 బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, అర్ధగంటలో చార్జ్ అయ్యేలా 65 W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తో పాటు పొందవచ్చు.


పోకో ఎఫ్ 3 జీటీ

- ధర: రూ. 28,999

- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ

పోకో ఎఫ్ 3 జీటీ డిజైనింగ్ఎక్కువగా గేమర్‌లను ఆకట్టుకొనేలా ఉంది. ఈ ఫోన్‌లో ఒక గ్లాస్ బ్యాక్, ఫిజికల్ గేమింగ్ ట్రిగ్గర్స్ (డెడికేటెడ్ గేమింగ్ బటన్స్) తో డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ 6.67 అంగుళాల సైజ్‌తోపాటు హెచ్‌డీ+ ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్ వెనుకభాగానికి గొరిల్లా గ్లాస్‌తో రక్షణ కల్పించారు. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,065 ఎంహెచ్ఏ బ్యాటరీ ఉంది. 67 W సోనిక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జర్ కేవలం 45 నిమిషాల్లో బ్యాటరీని మొత్తం చార్జ్ చేయగలదు. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీని పట్టించుకోలేదు. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 MP అదనపు కెమెరాను ఇచ్చారు. 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో MIUI 12.5 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.


ఒపో రెనో6 5 జి

- ధర: రూ. 29,990

- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ

మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌తో నడిచే ఒపో రెనో6 5జీ కూడా మిగతా మొబైల్స్ లాగా వినియోగదారులు ఇష్టపడే జాబితాలో ఉంది. ఫోన్‌తో 8జీబీ RAM మరియు 128 జీబీ స్టోరేజ్ లభిస్తాయి. ఈ ఫోన్ ఐఫోన్ 12. షేడ్స్ కలిగి ఉంది. 6.43-అంగుళాలు పరిమాణంలో ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ,90 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 750 నీట్స్ డిస్‌ప్లే సామర్థ్యం కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తో పాటు లభిస్తుంది. ఈ ఫోన్ పోకో ఎఫ్ 3 జీటీ, రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ మాదిరిగానే కెమెరా విభాగం ఉంది. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2 MP అదనపు కెమెరా లభిస్తుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5G ఫోన్ కలర్‌ఓఎస్ 11.3 తో ఆండ్రాయిడ్ 11ని వినియోగిస్తున్నారు.

తాలిబన్లకు ఫేస్‌బుక్ షాక్‌ !


ఫేస్‌బుక్‌ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లను వినియోగించకుండా నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా ఫేస్‌బుక్‌ నిషేధం విధించనుంది. తాలిబన్లకు అనుకూలంగా ఉన్న కంటెంట్‌, వీడియోలను, పోస్ట్‌లను తొలగించేందుకు ప్రత్యేకమైన ఆప్ఘన్‌ నిపుణుల బృందాన్ని ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసింది. తాలిబన్లను యూఎస్‌ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

Thursday, August 5, 2021

పురుషుల హాకీలో కాంస్య పతకం

 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం  గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో హాకీ పోటీల్లో పతకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది. ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటిన హాకీ క్రీడాకారులకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మ్యాచ్ ఆరంభంలో భారత్‌పై జర్మనీ పైచేయి సాధించినప్పటికీ.. సిమ్రంజీత్ సింగ్, హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో జర్మనీపై భారత్ విజయం సాధించింది. 

Sunday, July 11, 2021

టిక్ టాక్ మోజు ప్రాణం తీసింది !

 


పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది.  కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ప్రియాంక బాగా అలవాటు పడింది. ఇది రాను రాను మరీ ఎక్కువైంది. రాత్రికి రాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ప్రియాంక మొత్తంగా సోషల్ మీడియాకే పరిమితమైపో సాగింది. ఇది గమనించిన భర్త పవన్, ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రియాంక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్  ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పవన్ తల్లి  తన కుమారుడు  మృతికి కోడలే  కారణమని బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు.

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌పై దర్యాప్తు

 

ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను జగన్ సర్కార్ కోరింది. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో తాజాగా సీఐడీకి విచారణను అప్పగిస్తూ,  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి.

Monday, July 5, 2021

ధరల పెంచిన షావో"మీ"


చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ ధరలను పెంచుతూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుని వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్థ తన ఉత్పత్తులధరలపై 3 నుండి 6 శాతం పెంచింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లలో (చిప్‌సెట్‌లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని , సముద్ర సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని, ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్‌లో బాగా పుంజుకున్నాయని సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో తప్పని సరై ధరలను పెంచాల్సి వచ్చినట్లు పేర్కొంది. 

ఫోన్‌లో విండోస్‌ 11 ?


విండోస్‌ 11 విడుదలకు ముందు నుంచే  ఆసక్తిరేపింది. అయితే ఈ ఓఎస్‌ అప్‌డేట్ కావాలంటే మాత్రం కంప్యూటర్‌లో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. చాలా మంది యూజర్స్‌ తమ కంప్యూటర్లలో విండోస్‌ 11 పనిచేయడం లేదని ఫిర్యాదు చేయడంతోపాటు మైక్రోసాఫ్ట్ కనీస ఫీచర్ల పరిమితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. రష్యాకు చెందిన గుస్తావే మోన్సే అనే ఇంజనీరింగ్ విద్యార్థి విండోస్‌ 11 ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్‌ఎల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ..విండోస్‌ 11 ఫోన్‌లో కూడా చక్కగా పనిచేస్తుందని తెలిపాడు. యూజర్ ఇంటర్‌ఫేస్‌ లుమియా ఫోన్‌కు చక్కగా ఉందని, దాదాపు అన్ని యాప్‌లు చక్కగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. కంప్యూటర్‌ తరహాలోనే టాస్క్‌బార్‌ కూడా ఫోన్ కింది భాగంలో కనిపిస్తోంది. స్టార్ట్, సెర్చ్‌ బటన్‌తోపాటు స్క్రీన్‌ ఎడమవైపున విడ్జెట్స్‌ ఆప్షన్‌ కూడా ఉంది. అయితే కంప్యూటర్‌తో పోలిస్తే ఫోన్‌లో విండోస్‌ 11 పనితీరు కొంచెం మందకొడిగా ఉంది. లుమియా ఫోన్లలో విండోస్‌ ఓఎస్‌ ఇన్‌స్టాల్ చేయడం వెనక తన నాలుగేళ్ల శ్రమ ఉందని చెబుతున్నాడు మోన్సే. ఇందుకోసం 15 మంది మిత్రబృందంతో కలిసి విండోస్‌ ఆన్‌ విండోస్‌ ఫోన్స్‌ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపాడు. అలానే తమ విండోస్‌ ఫోన్లలో విండోస్‌ 10 లేదా విండోస్‌ 11 ఓఎస్‌ ఇన్‌స్టాల్ చేయాలకునే ఔత్సాహికుల కోసం తమ వెబ్‌సైట్ ద్వారా అవసరమైన టూల్స్‌, గైడ్‌లైన్స్‌తో సహకారం అందిస్తున్నట్లు తెలిపాడు. 


Sunday, July 4, 2021

చైనా వ్యోమగాముల స్పేస్ వాక్

 

ఇద్దరు చైనా వ్యోమగాములు మొట్టమొదటిసారిగా తమ దేశ కొత్త ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేశారు. 15 మీటర్ల పొడవైన రోబోటిక్ ఆమ్ (చేతిని) అమర్చేందుకు వారు బయట ఈ వాక్ చేయడం విశేషం. ల్యూ బూమింగ్, టాంగ్ హాంగ్ బో అనే వీరు బయట నడుస్తుండగా కక్ష్య లోపల కమాండర్ నీ హైషింగ్ వీరి కదలికలను పర్యవేక్షించాడు. మూడు నెలల మిషన్ కి గాను ఈ ముగ్గురు ఏస్ట్రోనట్స్ గత జూన్ 17 న ఈ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చైనా ఈ స్పేస్ మిషన్ ని చేబట్టింది. కొద్దిసేపు శ్రమించిన అనంతరం స్పేస్ వాక్ చేసిన వ్యోమగాములు రోబోటిక్ చేతిని అమర్చగలిగారు. ఈ రోబోటిక్ ఆర్మ్ఆర్బిటల్ స్టేషన్ భాగాలను ఒకటిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే సుమారు ఆరు గంటల వరకు వాక్ చేయడానికి అనువుగా వీరి సూట్లను డిజైన్ చేశారు. షేంజూ క్యాప్స్యూల్ లో ఈ వ్యోమగాముల మిషన్ సాగింది.

వచ్చే సంవత్సరాంతానికి 70 టన్నుల ఆర్బిటల్ స్టేషన్ కి మరో రెండు మోడ్యూల్స్ ని కలిపేందుకు చైనా స్పేస్ ఏజెన్సీ మొత్తం 11 ప్రయోగాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలపై చైనా అభివృద్ధి పథంలో సాగుతుండగా అమెరికా లోలోపల విమర్శిస్తోంది. చైనా ఈ ప్రయోగాలను అంతరిక్షంలో కూడా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చేపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ మాత్రం ఎడారుల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల ద్వారా ఈ విధమైన మిషన్ లను కామ్ గా చేసుకునిపోతోంది.

వర్క్ ఫ్రం హోం కోసం శాటిలైట్‌ ఆఫీసులు



ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానం అమలులోకి రావడంతో ఇంటి నుంచి పనిచేసే వారికి అవసరమైన సేవలను అందించడానికి ఐటీ కంపెనీలు చిన్నచిన్న పట్టణాల్లో 30 సీట్ల సామర్థ్యంతో శాటిలైట్‌ ఆఫీసులు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నాయి. నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో పనిచేసే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఇక్కడ నుంచే పనిచేసే విధంగా వారికి బ్యాకెండ్‌ సపోర్ట్‌ ఇవ్వడానికి ఈ శాటిలైట్‌ ఆఫీసులను ఏర్పాటుచేయనున్నాయి. జోహో కార్ప్, ఫ్రెష్‌ వర్క్స్, సాప్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా వంటి సంస్థలు ఈ శాటిలైట్‌ కార్యాలయాలు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా బిల్డర్లతో ఏజెన్సీ చర్చలు జరుపుతోంది. టెస్కో, వాల్‌మార్ట్, టార్గెట్‌ వంటి రిటైల్‌ సంస్థలతో పాటు పలు బ్యాంకింగ్‌ సంస్థలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు గ్లోబల్‌ కాంపిటెన్సీ సెంటర్స్‌గా మారాయి. కానీ, అక్కడ భూమి ధరలు, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ భారీగా పెరిగిపోతుండటంతో తిరుపతి, అనంతపురం వంటి పట్టణాల్లో మినీ గ్లోబల్‌ కాపింటెన్సీ సెంటర్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.


ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కసరత్తులు చేస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఐటీ పార్కు నిర్మించకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్న సంస్థలు స్పేస్‌ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జగన్ సర్కార్ అభిప్రాయపడుతోంది. విశాఖ, తిరుపతిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి అనంతపురం, తిరుపతి, విశాఖలో ఒక్కోచోట వేయి నుంచి రెండు వేల  ఎకరాల్లో ఐటీ కాన్సెప్ట్‌ నగరాలను  నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవి అందుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉండడంతో తక్షణం ఐటీ స్పేస్‌ అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ ఒక పటిష్ట ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్ల సహకారం తీసకోవాలని నిర్ణయించింది.


రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైనవి ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉందన్న వివరాలతో ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ అందుబాటులోకి తీసుకురానుంది. ఐటీ పార్కుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో పాటు నిర్మాణం పూర్తిచేసుకున్నవి, నిర్మాణం పూర్తికావస్తున్న భవనాల్లో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందన్న వివరాలను ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం స్థానిక బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్లతో కలిసి అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేస్తారు. 


తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం దగ్గర ప్రైవేటు బిల్డర్లు నిర్మిస్తున్న బిల్డింగ్‌ల వివరాలను ఈ పోర్టల్‌లో ఉంచనున్నారు. అంతేకాక.. ఈ బిల్డింగ్‌ల చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, స్కూళ్లు, రెస్టారెంట్లు వంటి వాటి వివరాలను కూడా అందులో పేర్కొంటారు. మరో రెండు వారాల్లో బిల్డర్లతో సమావేశం కావడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఐటీ కంపెనీలు, బిల్డర్లకు మధ్యలో ఐటీ ఏజెన్సీ కేవలం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.




Popular Posts