Ad Code

ఐక్యూ జెడ్9 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్ !


మెజాన్‌ నిర్వహిస్తున్న ఐక్యూ క్వెస్ట్ డేస్ 4 లో భాగంగా ఐక్యూ జెడ్9 5G స్మార్ట్‌ఫోన్‌పై  డిస్కౌంట్‌ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గత నెలలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు పై ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అమెజాన్‌లో  ఈ ఆఫర్ ఏప్రిల్‌ 28 వరకు కొనసాగుతుంది. ఐక్యూ జెడ్9 5G స్మార్ట్‌ఫోన్‌పై  డిస్కౌంట్‌ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4nm డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. 44W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకెష్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్పీ, వీడియోల కోసం 16MP కెమెరాలను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఈ ఐక్యూ హ్యాండ్‌ సెట్ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. బ్రష్డ్‌ గ్రీన్‌ మరియు గ్రాఫేన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఐక్యూ జెడ్9 5G స్మార్ట్‌ఫోన్‌పై  డిస్కౌంట్‌ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.21,999 గా ఉంది. ICICI క్రెడిట్‌, డెబిట్ కార్డు మరియు SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును పొందవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu