Ad Code

టోకెనైజేషన్ వ్యవస్థ !

 

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకు వస్తోంది. అయితే ఈ రూల్స్ ప్రకారం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు కలిగిన వారు సీవీవీ నెంబర్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం అవ్వనున్నాయి. ఈ కొత్త రూల్స్ 2022 జనవరి నుంచి అమలులోకి వస్తున్నాయి. కార్డు వివరాల స్థానం లో టోకెనైజేషన్ వ్యవస్థను అమలు లోకి తీసుకు రానున్నారు. అంటే కార్డు ట్రాన్సక్షన్స్ ని చేసేటపుడు కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు. దీంతో మీ కార్డు సమాచారం ఎవ్వరికీ తెలియదు. మీ వివరాలు సురక్షితంగానే ఉంటాయి.  కార్డు వివరాలు స్టోర్ చేసుకోవద్దని ఆర్‌బీఐ ఇప్పటికే మర్చంట్లకు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ పే, పేటీఎం, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిల్లో కార్డు వివరాలు ఎంటర్ చేసినప్పుడు.. ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డు వంటి వాటికి టోకెన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. కస్టమర్ డివైజ్‌తో ఇవి లింక్ అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu