Ad Code

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేలో గ్రీన్‌ లైన్‌ కనిపిస్తే వారంటీ లేకున్న ఉచిత సర్వీసు !


కొన్ని శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లలో డిస్‌ప్లే సమస్యలు తలెత్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే పైన గ్రీన్‌ లైన్‌ సమస్య భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లకు స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ చేయనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో మరిన్నింటికి ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్‌ అమోలెడ్‌ స్క్రీన్‌ అప్‌డేట్‌ తర్వాత ఈ సమస్య వచ్చింది. అయితే స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ జాబితాలో శాంసంగ్‌ గెలాక్సీ S21, గెలాక్సీ S22 మోడళ్లకు ఈ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శామ్‌మొబైల్‌ నివేదిక ప్రకారం 2023 జులై వరకు కొనుగోలు చేసిన హ్యాండ్‌సెట్‌లో ఎంపిక చేసిన మోడళ్లను ఉచితంగా డిస్‌ప్లేను రీప్లేస్‌మెంట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో గెలాక్సీ నోట్ 20 సిరీస్‌ మరియు గెలాక్సీ S20 సిరీస్‌ ఉండగా.. తాజాగా గెలాక్సీ S21 మరియు గెలాక్సీ S22 సిరీస్‌ మోడళ్లు చేరాయి. మరో నివేదిక ప్రకారం కేవలం డిస్‌ప్లే రిపేర్‌ మాత్రమే కాకుండా ఒక్కసారికి వర్తించేలా OCTA అసెంబ్లీ, బ్యాటరీ మరియు రీవర్క్‌ కిట్‌ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఏప్రిల్ 30 2024 వరకు రిపేర్‌ వర్క్‌కు సంబంధించిన బుకింగ్‌లను శాంసంగ్ సర్వీస్‌ పాయింట్లలో చేయవచ్చు. కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల్లోపు ఒకసారి ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను చేయవచ్చు. గ్రీన్‌ లైన్‌ సమస్య తలెత్తిన డివైస్‌లలో వారంటీ పూర్తయిన కూడా ఉచితంగా సర్వీస్‌ చేయనున్నారు. శాంసంగ్‌ గెలాక్సీ S22 అల్ట్రా, గెలాక్సీ S21, గెలాక్సీ S21 ప్లస్‌, S21 అల్ట్రా, గెలాక్సీ S20, గెలాక్సీ S20 ప్లస్‌, గెలాక్సీ S20 అల్ట్రా, గెలాక్సీ నోట్‌ 20, గెలాక్సీ నోట్‌ 20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లకు గ్రీన్‌ లైన్ సమస్య ఉంటే వారంటీ లేకున్నా ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్‌ చేస్తారు. అయితే పిజికల్‌ డ్యామేజీ, వాటర్‌ డ్యామేజీని ఈ జాబితా కింద పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. మార్చిలో వచ్చిన అప్‌డేట్‌తో శాంసంగ్ గెలాక్సీ S21 FE స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ సమస్య తలెత్తింది. అయితే ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ చేసుకొనే అవకాశం ఉన్న జాబితాలో ఈ హ్యాండ్‌సెట్‌ లేదు. అయితే గతంలో వన్‌ప్లస్‌ ఫోన్లలో కూడా ఇదే తరహా గ్రీన్‌ లైన్‌ సమస్య తలెత్తింది. ఏప్రిల్ 20 2024 వరకు పై జాబితాలో ఉన్న శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్లలో ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన మూడేళ్ల వరకు ఉచితంగా రీప్లేస్‌మెంట్‌ చేసుకోవచ్చు. వారంటీ లేకున్న ఉచిత సర్వీసులను పొందవచ్చు

Post a Comment

0 Comments

Close Menu