Ad Code

పోకో సీ 51పై బిగ్ డీల్ ?


పోకో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోకో సీ 51పై బిగ్ డీల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ బిగ్ 7GB RAM మరియు స్టోరేజ్ లతో కూడా వస్తుంది. పోకో ఇటీవల ఇండియన్ మార్కెట్ లో రూ. 8,499 రూపాయల ధరలో విడుదల చేసిన ఈ ఫోన్ ను ఎయిర్టెల్ బండిల్ ఆఫర్ తో రూ. 4,999 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. పోకో సి51 స్మార్ట్ ఫోన్ ను రూ. 8,499 రూపాయల ప్రారంభ ధరలో అందించిన పోకో, ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ ద్వారా గొప్ప ఆఫర్ ను జత చేసింది.  ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ SIM తో లాక్ చేసిన ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 4,999 రూపాయలకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన కేవలం రూ. 245 రూపాయల అతి తక్కువ EMI ఆఫర్ ను కూడా అందించింది. పోకో సి51 స్మార్ట్ ఫోన్ ను ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ SIM కార్డ్ తో లాక్ చేస్తుంది. అంటే, ఈ ఫోన్ లో మైన్ సిమ్ కార్డ్ కేవలం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ ను మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు, ఈ ఫోన్ ను రూ. 199 లేదా అంతకంటే పైన ఉండే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ తో 18 నెలల పాటు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.ఈ ఫోన్ తో ఎయిర్ టెల్ సిమ్ కార్డ్ ను ఉపయోగించే వారికి అధనపు లాభాలను కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లాక్ సిమ్ కార్డ్ తో పైన తెలిపిన రీచార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి 50GB అధనపు డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 750 వరకూ అధనపు తగ్గింపు ను పొందవచ్చని పోకో చెబుతోంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G36 5G ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB RAM మరియు 64 GB ఇంటర్నల్ మెమొరీతో పాటు 1TB వరకూ స్టోరేజ్ పెంచుకోవడానికి అవకాశం వుంది. ఈ స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD కార్డ్ ను ఉపయోగించాలి. అంతేకాదు, ఈ ఫోన్ లో 3GB Turbo RAM ఫీచర్ తో కలిపి టోటల్ 7GB RAM అందుతుంది. 6.52 ఇంచ్ HD+ స్క్రీన్ ను 120Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP AI Dual Camera మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Android 13 (Go Edition) పైన నడుస్తుంది మరియు 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది.

Post a Comment

0 Comments

Close Menu