Ad Code

సూపర్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ !


జెమొపాయ్ కంపెనీ తన సరికొత్త రైడర్ సూపర్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. ఎక్కువ వేగంతో వెళ్తోంది. ఇదే ధరతో మార్కెట్లో లభించే మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో దీన్ని పోల్చితే ఇది బెటర్ అంటున్నారు. ధరను కంపెనీ రూ.79,999గా నిర్ణయించింది. BLDC హబ్ మోటర్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ మాగ్జిమం ఔట్‌పుట్ ఇస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్.  టాప్ స్పీడ్‌ గంటకు 60 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. 1.8kW పోర్టబుల్ బ్యాటరీ ఉంది. దీనికి స్మార్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఉంది. ఈ బ్యాటరీని తొలగించే వీలుంది. 2 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుందని తెలిపారు. ఈ స్కూటర్‌ని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు అంటున్నారు. స్కూటర్‌ను జెమొపాయ్ యాప్‌తో కనెక్ట్ చెయ్యవచ్చు. తద్వారా రియల్ టైమ్ మానిటరింగ్, అప్‌డేట్స్ లభిస్తాయి. యాప్ ద్వారా స్కూటర్ బ్యాటరీ, స్పీడ్ అలర్ట్స్, సర్వీస్ రిమైండర్లను పొందవచ్చు. 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో, సిటీ, స్పోర్ట్స్. సపోర్ట్ బ్యాక్, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యాంటీ థెఫ్ట్ అలారం, కీ-లెస్ ఎంట్రీ ఉన్నాయి. బాటిల్ హోల్డర్, ఆన్ బోర్డ్ ఛార్జర్, డిజిటల్ స్పీడో మీటర్, ట్యూబ్‌లెస్ టైర్, లార్జ్ బూట్ స్పేస్ ఉన్నాయి. ఆరు రంగుల్లో లభిస్తోంది. అవి జాజ్జీ నియోన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే, ఫ్లోరోసెంట్ ఎల్లో. మార్చి 10, 2023 నుంచి దేశంలోని అన్ని జెమొపాయ్ షోరూమ్స్‌లో లభిస్తుంది. స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో రూ.2,999కి బుక్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu