Ad Code

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి - థాయ్‌లాండ్ టూర్ ని గెలుచుకొనే అవకాశం పొందండి !


ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఒకాయ ఈవీ తాజాగా సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారు థాయ్ లాండ్ టూర్‌ ను గెలుచుకొనే అవకాశం కల్పిస్తుంది. నాలుగు రోజులు పాటు ఈ టూర్ జరుగుతుంది. ఒకాయ కార్నివాల్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్లు అందుబాటులో చింది. థాయ్ లాండ్ ట్రిప్ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆఫర్ మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. అన్ని ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్లు ఉంటాయి. కంపెనీ ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఫాస్ట్ ఎఫ్2ఎఫ్, ఫాస్ట్ ఎఫ్2బీ, క్లాసిక్ ఐ10 ప్లస్, ఫాస్ట్ ఎఫ్2టీ, ఫ్రీడమ్ ఎల్ఐ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. మీరు మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫాస్ట్ మోడళ్లను హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లుగా చెప్పుకోవచ్చు. వీటి టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. రేంజ్ అనేది మోడల్ ప్రాతిపదికన మారుతుంది. ఫాస్ట్ ఎఫ్4 అనే మోడల్ రేంజ్ 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక ఫాస్ట్ ఎఫ్3 రేంజ్ రూ. 120 నుంచి 130 కిలోమీటర్లు. ఇక మిగతా మోడళ్ల రేంజ్ 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కంపెనీ వీటిల్లో బీఎల్‌డీసీ హబ్ మోటార్ అమర్చింది. బ్యాటరీ కెపాసిటీ మోడల్ ప్రాతిపదికన మారుతుంది. అన్నింటిలోనూ ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. టెలీ స్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. మోటార్‌పై కూడా మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది. ఫ్రీడట్, క్లాసిక్ అనేవి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. వీటి స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఇవి 75 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. వీటిలో కూడా బీఎల్‌డీసీ మోటార్ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో ఒక ఇన్‌వాయిస్ జనరేట్ అవుతుంది. కొనుగోలు దారులకు మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇందులో లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే డిజిటల్ స్క్రాచ్ కార్డు ఉంటుంది. ఇందులో క్యాష్ బ్యాక్, థాయ్ లాండ్ ట్రిప్ వంటివి ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu