Ad Code

బౌన్స్ ఇన్‌ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ !


బౌన్స్ ఇన్‌ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 64,299 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ స్కూటర్‌లో బ్యాటరీ స్వాపింగ్ ఫీచర్ ఉంది. అంటే మీరు ఇంట్లో బ్యాటరీ చార్జింగ్ పెట్టాల్సిన పని లేదు. బ్యాటరీ నెట్‌వర్క్ చార్జింగ్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫుల్ బ్యాటరీని పొందొచ్చు. మీ బ్యాటరీ అక్కడ పెట్టి అక్కడ చార్జింగ్ ఫుల్‌గా ఉన్న బ్యాటరీ తీసుకొని మీ స్కూటర్‌లో వేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు.  కేవలం రూ. 499తో ఈ స్కూటర్ ను కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. దీనిలో  లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, ట్రాక్ బ్యాటరీ హెల్త్, యాంటీ థెప్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పలు రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. వైట్, బ్లాక్, రెడ్, గ్రే, సిల్వర్ కలర్స్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో మీరు ఇగ్నిషన్ స్టేటస్, ఇండికేటర్ స్టేటస్, బ్యాటరీ ఎస్ఓసీ స్టేటస్, ఓడోమీటర్ రీడిండ్, స్పీడ్ డిస్‌ప్లే, వెహికల్ స్టేటస్, బ్లూటూత్ స్టేటస్, హైబీమ్ స్టేటస్, హజార్డ్ లైట్ స్టేటస్ వంటివి చూడొచ్చు. అంతేకాకుండా కస్టమైజేసన్ కూడా ఉంటుంది. అంటే మీకు నచ్చిన విధంగా స్కూటర్ కలర్ థీమ్స్‌ను ఎంచుకోవచ్చు. కంపెనీ అందుకు అనుగుణంగా మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తుంది. అందువల్ల నచ్చిన థీమ్‌లో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu