Ad Code

10 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోయిన నెట్‌ఫ్లిక్స్ !


నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ పాస్‌వర్డ్స్ షేర్ చేసుకోవడం అనేది ఒకప్పుడు కామన్ విషయం. చాలామంది ఈ టెక్నిక్‌తో ఫ్రీగా కంటెంట్ స్ట్రీమింగ్‌ సేవలు పొందేవారు. క్రమంగా ఇది కంపెనీ లాభాలకు గండి కొట్టింది. దీంతో యూజర్లకు పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఛార్జీలు విధించాలని నెట్‌ఫ్లిక్స్ ఇటీవల నిర్ణయించింది. అయితే బిజినెస్‌ డెవలప్‌ చేసేందుకు తీసుకున్న నిర్ణయం నెగెటివ్‌ రిజల్ట్‌ ఇచ్చింది. కొన్ని దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించగా, భారీగా సబ్‌స్కైబర్స్ ఈ పోర్టల్‌ను వీడుతున్నారు. 2023 మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ 10 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ కాంతర్ హౌస్‌హోల్డ్స్‌ స్ట్రీమింగ్ హ్యాబిట్స్‌పై చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. నెట్‌ఫ్లిక్స్ కోల్పోయిన వినియోగదారులలో మూడింట రెండు వంతుల మంది ఇతర కుటుంబాలతో పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకునే వారని తేలింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఛార్జీలు విధించడంతో వీరిలో చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌కు దూరమయ్యారని పేర్కొంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు నెట్‌ఫ్లిక్స్‌ 2023 ఫిబ్రవరిలో స్పానిష్ వినియోగదారుల కోసం దాదాపు రూ.500తో కొత్త మంత్లీ ప్లాన్‌ తీసుకొచ్చింది. షేరింగ్‌ని డిటెక్ట్‌ చేయడానికి, నిరోధించడానికి టెక్నాలజీని ఇంప్లిమెంట్‌ చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మిలియన్ మంది వినియోగదారులను కోల్పోవడం, నెట్‌ఫ్లిక్స్‌ షోస్‌, సర్వీసెస్‌పై వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ రికమండేషన్స్‌పై నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపనుంది. స్పెయిన్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో నెట్‌ఫ్లిక్స్‌ ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. ఇదే విధమైన సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుతో పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్ వంటి ఇతర మార్కెట్‌లలో ప్లాన్‌ అమలు చేయనుంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం ద్వారా ఆదాయ నష్టాన్ని నిరోధించే ప్రయత్నాలు కొనసాగించే యోచనలో ఉంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ లేకపోవడంతో, ఇంతకుముందు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించని వారు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారని కంపెనీ భావిస్తోంది. భారత్‌లో ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే, యూజర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. కాంతర్ వరల్డ్‌ప్యానెల్ డివిజన్‌లో గ్లోబల్ ఇన్‌సైట్ డైరెక్టర్ డొమినిక్ సున్నెబో మాట్లాడుతూ.. పాస్‌వర్డ్-షేరింగ్‌పై కంపెనీ తీసుకున్న నిర్ణయాలతోనే వినియోగదారుల సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. అయితే ఇది డేటాలో కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే అని, దీర్ఘకాలికంగా ఇదే ట్రెండ్‌ ఉండకపోవచ్చని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ రెవెన్యూ లాస్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోందనే అంశం స్పష్టమవుతోంది. కానీ భవిష్యత్తులో మరింత మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోకుండా ఉండటానికి పాజిటివ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం ద్వారా బ్యాలెన్స్ చేయడం కీలకం. నెట్‌ఫ్లిక్స్ ఈ బ్యాలెన్స్‌ను ఎంతవరకు సాధించగలదనే దానిపై పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడానికి తీసుకునే ప్రయత్నాల విజయం ఆధారపడి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu