Ad Code

డేంజర్ యాప్ లను వెంటనే డిలీట్ చేయండి !


సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్‌ డేటాను యాక్సెస్‌ చేసుకోనేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు మాల్వేర్ ఫాక్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లోని కొన్ని ప్రమాదకర యాప్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్ ప్రోగ్రాం కావడంతో మాల్‌వేర్‌ ప్రోగ్రాం అయిన ట్రోజన్‌, యాడ్వేర్, స్పైవేర్‌, కీలాగ్గర్‌ లాంటివి వినియోగించి వారి యాజర్ల డేటాను యాక్సెస్‌ చేసేస్తున్నట్లు వివరించింది. సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ ప్లే స్టోర్‌లోని కొన్ని ఓరిజినల్ యాప్‌లకు కొన్ని హానికరమైన కోడింగ్‌ చేసి, కొత్త వెర్షన్‌, కొత్త పేర్లతో ప్రవేశపెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురి ఫోన్లలో ఈ యాప్ లు ఉండే అవకాశం కూడా ఉంది. వాటిని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రీ గేమ్‌హబ్‌ అండ్‌ బాక్స్‌, హోప్‌ కెమెరా- పిక్సర్‌ రికార్డ్, సేమ్‌ లాంచర్‌ అండ్‌ లైవ్‌ వాల్‌పేపర్‌, అమెజింగ్‌ వాల్‌పేపర్‌, కూల్‌ ఎమోజీ అండ్‌ స్టిక్కర్‌లు హార్లీ ట్రోజన్‌ కలిగి ఉన్న యాప్‌లు.సింపిల్‌ నోట్‌ స్కానర్‌, యూనివర్సల్‌ పీడీఎఫ్‌ స్కానర్‌, ప్రైవేట్‌ మెసెంజర్‌, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్‌ ప్రెజర్‌ చెక్కర్, కూల్‌ కీబోర్డ్‌, పెయింట్‌ ఆర్ట్‌, కూలర్‌ మెసేజ్‌లు జోకర్‌ స్పైవేర్ కలిగి ఉన్న యాప్‌లు. వ్లాగ్‌ స్టార్‌ వీడియో ఎడిటర్‌, క్రియేటివ్‌ 3డీ లాంచర్‌, వావ్‌ బ్యూటీ కెమెరా, గిఫ్ ఎమోజీ కీబోర్డ్‌, ఇన్‌స్టంట్‌ హార్ట్‌రేట్‌ ఎనీటైం, డెలికేట్‌ మెసేంజర్‌లు ఆటోలికోస్ మాల్వేర్‌ కలిగి ఉన్న యాప్‌లు. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినప్పుడు, దానికి సంబంధించిన కామెంట్స్‌ను చదివితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌, యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మేలు. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నప్పుడు ఓసారి రేటింగ్‌ను చూడడం కూడా మంచిది. థర్డ్‌ పార్టీ యాప్‌లు కాకుండా నేరుగా గూగుల్‌ ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నప్పుడు డెవలపర్‌ ఎవరో చెక్‌ చేయడం వల్ల మాల్‌వేర్‌ బారిన పడకుండా ఉంటాం. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత అనవసరమైన పర్మిషన్లు అడుగుతోందంటే., ఉదాహరణకు ఏదైనా ఫోటో ఎడిటింగ్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే దానికి సంబందించిన పర్మిషన్లే కాకుండా ఫోన్‌, ఎస్ఎంఎస్ పరిషన్లు కూడా అడుగుతోందంటే ఆ యాప్‌పై కొంచెం అనుమానం వ్యక్తం చేయాల్సిందే. ఫోన్‌కు వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయకూడదు. తనిఖీ చేసుకొని ఓపెన్ చేయడం మంచిది.

Post a Comment

0 Comments

Close Menu