Ad Code

ఎలెస్కో ఈవీ కంపెనీ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు !


ఎలెస్కో ఈవీ కంపెనీ తాజాగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎలెస్కో వీ1, ఎలెస్కో వీ2. ఇవి ఫుల్‌గా చార్జ్ కావడానికి దాదాపు 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఇంకా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 2 గంటల్లోనే 70 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్‌షోరూమ్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది అందుబాటు ధర అనే చెప్పుకోవచ్చు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. వీటిల్లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 72వీ హబ్ మోటార్ అమర్చింది. ఎలెస్కో వీ1 మోడల్‌ అయితే ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 నుంచి 70 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక వీ2 మోడల్ అయితే 75 నుంచి 85 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. వీ1, వీ2 మోడళ్ల గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం. ఇంకా వీటిల్లో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్, డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ లైట్స్ వంటి పీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంటుంది. కీలెస్ ఇగ్నిషన్, ఎల్ఈడీ బేస్డ్ స్మార్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, మొబైల్ అప్లికేషన్ కంట్రోల్, జీపీఎస్ ఎనెబుల్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉన్నాయి. మూడేళ్ల వరకు ఈ స్కూటర్లకు వారంటీ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ కాస్ట కూడా తక్కువగానే ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఒక కిలోమీటర్ల వెళ్లడానికి 10 నుంచి 15 పైసలు ఖర్చు అవుతుంది. అంటే మీరు ఒక్క రూపాయిలో పది కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu