Ad Code

ఐఫోన్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ 'ఫోన్ లింక్' ఫీచర్‌ !


ఐఫోన్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ 'ఫోన్ లింక్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎట్టకేలకు ఐఫోన్ యూజర్లకు కూడా ఫోన్ లింక్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్లు కూడా విండోస్ నుంచి మెసేజ్‌లను పంపించవచ్చు. ఫోన్ కాల్స్ చేయవచ్చు. ఇన్‌కమింగ్ కాల్స్‌ రిసీవ్ చేసుకోవచ్చు. విండోస్ 11 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న ఐఫోన్ యూజర్లకు 'ఫోన్ లింక్' ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఐఓఎస్ 14 (iOS 14), ఆపై వెర్షన్ ఓఎస్ కలిగిన యూజర్లు తమ ఫోన్‌ను విండోస్‌తో లింక్ చేసుకోవచ్చని తెలిపింది. ఒకసారి విండోస్‌లో ఎనేబుల్ చేశాక.. కాల్స్ చేయడం, స్వీకరించడం; ఐమెసేజ్ యాప్‌ ఉపయోగించి మెసేజ్‌లు పంపించడం, రిసీవ్ చేసుకోవడం; ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్లను మేనేజ్ చేయడం వంటి యాక్టివిటీస్‌ చేయొచ్చు. అలాగే యూజర్లు కాంటాక్ట్స్‌ను సిస్టమ్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. బేసిక్ అప్‌డేట్‌గా మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఐపాడ్ఓస్ లేదా మ్యాక్ఓఎస్‌లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. దీన్ని ఉపయోగించి ఫొటోలు, వీడియోలను పంపలేరు. గ్రూప్ మెస్సేజింగ్ సైతం సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ మాదిరిగా ఫోన్ యాప్స్‌ను ఇందులో ఉపయోగించలేరు. ఫోన్ లింక్ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ ఇప్పటికే రోల్ అవుట్ చేసింది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజర్లకు ఇది ఇంకా తమ కంప్యూటర్లలో అందుబాటులోకి రాలేదు. మే రెండో వారం నాటికి అందరికీ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఐఫోన్లకు లాంచ్ చేసే ముందు సుధీర్ఘంగా టెస్టింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. బీటా యూజర్ల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పొందాకే మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు వెల్లడించింది. వరల్డ్‌వైడ్‌గా 39 భాషల్లో 85 మార్కెట్లలో ఈ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది. బ్లూటూత్‌ ద్వారా ఐఫోన్‌ను కనెక్ట్ చేసుకుంటేనే మెసేజ్‌లు వస్తాయని కంపెనీ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu