Ad Code

క్యూఆర్ కోడ్ అంటే ఏంటి ?


క్విక్ రెస్పాన్స్ కోడ్ ఇదో రకమైన 2D  బార్ కోడ్. ఇందులో సమాచారం.. నలుపు, తెలుపు చదరంగాల రూపంలో ఉంటుంది. ఆ చదరంగాల్లో సమాచారం టెక్స్ట్ రూపంలో లేదా URL రూపంలో లేదా కాంటాక్ట్ సమాచారం రూపంలో లేదా క్యాలెండర్ ఈవెంట్ రూపంలో లేదా ఇతర ఏ విధంగానైనా ఉంటుంది. సంప్రదాయ బార్ కోడ్‌ల కంటే QR కోడ్‌లలో ఎక్కువ సమాచారం ఉంటుంది. ఎందుకంటే వాటిని ఏ దిక్కు నుంచైనా స్కానర్లు చదివేందుకు వీలు ఉంటుంది. అందువల్ల తక్కువ ప్రదేశంలో ఎక్కువ సమాచారాన్ని ఉంచవచ్చు. అందుకే QR కోడ్ లను యాడ్స్, ప్యాకేజింగ్, మొబైల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలుగా వాడుతున్నారు. QR కోడ్‌ని మన కళ్లు చదవలేవు. మొబైల్ కెమెరాలు కూడా చదవలేవు. వాటిని చదవాలంటే  కోడ్ రీడర్ తప్పనిసరి. ఈ రీడర్ చాలా యాప్స్‌లో ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్స్ కూడా ప్రత్యేకంగా లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఏ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చెయ్యవచ్చు. క్యూఆర్ కోడ్‌ని చదివేందుకు కోడ్ రీడర్ మొబైల్ కెమెరాను ఉపయోగించుకుంటుంది. ముందుగా కోడ్ మొత్తాన్నీ స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత అందులోని సమాచారాన్ని డీకోడ్ చేసి చూపిస్తుంది. అది డేటా కావచ్చు, యూఆర్ఎల్ కావచ్చు, మరో వెబ్‌సైట్ కావచ్చు లేదా పేమెంట్ కావచ్చు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో మనీ మాయం అయ్యే ఛాన్స్ ఉంటుందా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటుంది. మనం ఏ కోడ్ రీడర్ వాడుతున్నామన్నది ఒక అంశం. వాడే కోడ్ రీడర్ ప్రమాదకరమైనది అయితే ఆ కోడ్ రీడర్ ద్వారా హ్యాకర్లు మనీ కొల్లగొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే స్కాన్ చేసే క్యూఆర్ కోడ్‌లో హ్యాకర్ యూఆర్ఎల్ లింక్ ఉంటే  స్కాన్ చేసిన తర్వాత ఆ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. దాని ద్వారా ఓ బగ్.. మొబైల్‌లో చేరి.. బ్యాంక్ అకౌంట్‌లో మనీ మాయం చేసే ప్రమాదం ఉంటుంది. తెలియని, అధికారికం కాని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయకపోవడమే మంచిది. ఈ రోజుల్లో ప్రజల డబ్బు కొట్టేసేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు ఇలాంటి టెక్నాలజీని అడ్డదారి పట్టిస్తున్నారు. అందువల్ల క్యూఆర్ కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటం మేలు.

Post a Comment

0 Comments

Close Menu