Ad Code

రాఫ్ట్ మోటార్స్ ఇండస్ ఎన్ఎక్స్ !


రాఫ్ట్ మోటార్స్ పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటిల్లో ఇండస్ ఎన్ఎక్స్ మోడల్ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కీలెస్ స్టార్ట్, థెఫ్ట్ అలారం, రిమోట్ లాకింగ్, ఇండికేటర్ బజర్, పోర్టబుల్ బ్యాటరీ, డీఆర్ఎల్ హెడ్‌లైట్, డిజిటల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ చార్జర్ కట్ ఆఫ్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ రెడ్, ఆరెంజ్, గ్రే రంగుల్లో లభిస్తోంది. ఏఆర్ఏఐ, ఐసీఏ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. లక్ష కిలోమీటర్లు లేదంటే మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీకి ఇది వర్తిస్తుంది. కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. మోటార్ వోల్టేజ్ 60వీ. బ్యాటరీ లిథియం రకానికి చెందినది. దీని కెపాసిటీ 30 ఏహెచ్. చార్జింగ్ టైమ్ 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ లోడ్ కెపాసిటీ 150 కేజీల వరకు ఉంటుంది. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టెలీ స్కోపిక్ సస్పెన్షన్ ఉంది. డిస్క్, డ్రమ్ బ్రేక్స్ ఉంయి. ట్యూబ్ లెస్ టైర్లు అమర్చారు. చార్జర్ వారంటీ ఏడాది పాటు ఉంటుంది. మోటార్ కంట్రోలర్ వారంటీ ఏడాది ఉంటుంది. అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. బ్యాటరీపై కంపెనీ ఎలాగూ మూడేళ్ల వరకు వారంటీని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో పలు మోడళ్లు ఉంటాయి. 480 కి.మి రేంజ్ స్కూటర్ అయితే ధర రూ. 2.57 లక్షలుగా ఉంటుంది. 325 కి.మి రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధ అయితే రూ. 1.9 లక్షలుగా ఉంది. ఇంకా 150 కి.మి రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అయితే రూ. 1.18 లక్షలుగా ఉంది. అందువల్ల మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu