Ad Code

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో మరిన్ని ఆవిష్కరణ అందుబాటులోకి వస్తాయి !


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తి సామర్థ్యాన్ని సెర్చ్‌ ఇంజిన్‌కు అనుసంధానం చేయనున్నామని ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌కు కొత్త హంగులను మరియు వినియోగదారులు మరింత సులభంగా సమాచారం పొందగలుగుతారని చెప్పారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ మరింత కచ్చితత్వంతో పనిచేసేందుకు గత చాలా సంవత్సరాల నుంచి ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే గూగుల్ లెన్స్‌ నుంచి మ్యాప్స్‌, గూగుల్ ట్రాన్సిలేట్‌ సహా ఎన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. సెర్చ్‌ ఇంజిన్‌ మరింత పటిష్టం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. గూగుల్‌ సంస్థ మార్చి త్రైమాసికానికి సంబంధించిన సమావేశంలో సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని తన వద్దనున్న డేటా, అనుభవం నేర్పిందన్నారు. గూగుల్‌ సరైన సమాచారం అందిస్తుందని కోట్లాది ప్రజలు నమ్ముతారని సీఈవో సుందర్ పిచాయ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ఈ సంవత్సరం మార్చిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సాంకేతికత AI బార్డ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. బార్డ్‌ను మరింత శక్తివంతంగా మార్చేందుకు PaLM (పాత్‌వేస్‌ లాంగ్వేజ్‌) మోడల్‌ను జతచేసినట్లు తెలిపారు. గూగుల్‌ తీసుకొచ్చిన AI బార్డ్‌ ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ సహా కోడింగ్‌ రాయడంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు సాయం చేయగలదని సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. మరియు మరిన్ని సౌకర్యాలు భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు కోసం PaLM API మేకర్‌షూట్‌ టూల్‌ను గూగుల్‌ సంస్థ విడుదలచేసింది. ప్రపంచస్థాయి పరిశోధన వ్యవస్థ తమ వద్ద ఉందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో మరిన్ని ఆవిష్కరణ అందుబాటులోకి వస్తాయన్నారు. గూగుల్‌ రీసెర్చ్‌ టీమ్‌ మరియు డీప్‌ మైండ్‌ను ఒకే యూనిట్‌గా తీసుకొస్తున్నట్లు చెప్పారు. గూగుల్ యాడ్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ క్లౌడ్‌ సహా ఇతర సేవలు మరింత ప్రభావితంగా పనిచేసేలా ఏఐని ఓ సాధనంగా వినియోగించుకుంటామని సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను వేగంగా అందుబాటులోకి తీసుకురావడంతో కాస్త వెనుకబడినా.. AI సాంకేతికతలో వేగంగా దూసుకెళ్లేలా గూగుల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక దిగ్గజం తీసుకొచ్చిన AI బార్డ్‌ 20 ప్రోగ్రామింగ్‌ భాషల్లో కోడింగ్‌ రాయడంలో సాంకేతిక నిపుణులకు సాయం చేయనుందని తెలిపింది. ఇందులో Java, C++, Python సహా మరిన్ని భాషలు ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది మైక్రోసాఫ్ట్‌ సారధ్యంలోని స్టార్టప్‌ ఓపెన్‌ AI తీసుకొచ్చిన ChatGPT వినియోగదారులకు అత్యంత వేగంగా ఆకర్షిస్తోంది. దీంతో గూగుల్‌ AI బార్డ్‌ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ AI బార్డ్‌ కొద్ది మందికే అందుబాటులో ఉన్న నేపధ్యంలో పూర్తిస్థాయి వివరాలతో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ChatGPT 2021 వరకే ఉన్న సమాచారాన్ని విశ్లేషించి సమాధానాలిస్తుంది. అదే గూగుల్‌ బార్డ్‌ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా వినియోగదారులకు సమాధానం ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu