Ad Code

వాట్సాప్‌ లో రిప్లై విత్ ఏ మెసేజ్ ?


వాట్సాప్‌లో కాల్స్ వస్తుంటే వాటిని సింపుల్‌గా కట్ చేసి, కట్ చేయడానికి గల కారణాన్ని మెసేజ్ రూపంలో పంపించేందుకు వీలుగా సరికొత్త స్పెసిఫికేషన్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఈ వివరాలను వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా వెల్లడించింది. బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్టు ప్రకారం, ఆండ్రాయిడ్ వెర్షన్‌లోని లేటెస్ట్ వాట్సాప్ బీటా 2.23.9.16 అప్‌డేట్‌లో "రిప్లై విత్ ఏ మెసేజ్" ఫీచర్ రిలీజ్ అవుతోంది. ఇప్పుడు కాల్ నోటిఫికేషన్లలో కొత్తగా ఒక రిప్లై బటన్ కనిపిస్తోంది. ఈ బటన్ పైన నొక్కి, యూజర్లు ఇన్‌కమింగ్ కాల్‌ను రిజెక్ట్ చేయవచ్చు. అదే సమయంలో కాలర్‌కు ఒక మెసేజ్‌ను చాలా ఫాస్ట్‌గా పంపవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా వాట్సాప్ బీటా ఇన్ఫో పంచుకుంది. దాని ప్రకారం, ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ స్క్రీన్‌లో డిక్లైన్, ఆన్సర్ బటన్స్‌తో పాటు రిప్లై బటన్ కూడా కనిపించింది. కొత్త కాల్ నోటిఫికేషన్స్‌లో కనిపించే మూడు ఆప్షన్స్‌లో యూజర్ రిప్లై బటన్‌పై నొక్కితే, ఇన్‌కమింగ్ కాల్ క్షణాల్లోనే కట్ అవుతుంది. తర్వాత మెసేజ్ బాక్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఇది కాలర్‌కు త్వరగా మెసేజ్ పంపడానికి వీలు కల్పిస్తుంది. ఈ మెసేజ్ బాక్స్‌లో వినియోగదారు కాల్‌కు సమాధానం ఇవ్వలేకపోవడానికి కారణాన్ని వివరించవచ్చు. లేదా తర్వాత కాల్ చేస్తానని చెప్పవచ్చు. యూజర్లు అన్ని సందర్భాలలో అన్ని వాట్సాప్ కాల్స్ ఆన్సర్ చేయలేరు. అలాగే కాలర్స్‌కు మెసేజ్ పంపించేంత సమయాన్ని కూడా కేటాయించలేరు. ముఖ్యంగా మీటింగ్స్‌, జర్నీలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వడం కుదరదు. దీనివల్ల అవతలి వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులన్నీ రాకుండా, పెద్దగా శ్రమ లేకుండా రిప్లై ఇస్తూ కాలర్‌తో కమ్యూనికేట్ అయ్యే అవకాశాన్ని కొత్త ఫీచర్ కల్పిస్తుంది. కాల్ నోటిఫికేషన్‌లో రిప్లై బటన్ అనేది కేవలం లేటెస్ట్ బీటా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న టెస్టర్లకు మాత్రమే రిలీజ్ అవుతోంది. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ సరికొత్త ఫీచర్‌ను టెస్ట్ చేయవచ్చు. ఇక స్టేబుల్‌ వెర్షన్‌ యూజర్లకు కూడా ఇది మరికొద్ది వారాల్లో విడుదల కావచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu