Ad Code

ఎంజీ మోటార్స్ నుంచి కమెట్ కారు !


ఎంజీ మోటార్స్ ఇండియా సరికొత్త ఫీచర్స్‎ తో కమెట్ కారును విడుదల చేసింది. గత వారమే ఈ కారు ఫీచర్స్‎ ను ప్రకటించిన సంస్థ తాజాగా ప్రైస్, బుకింగ్స్ వివరాలను తెలిపింది. కమెట్ కారు ధర రూ.7.98 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇది బేసిక్ ధర. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండే వెహికల్స్ కోసం చేసే కస్టమర్లను లక్ష్యం చేసుకుని ఈ కారును ఎంజీ ప్రవేశపెట్టింది. కమెట్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభం అవుతాయి. కమెట్ ఇదే కంపెనీ నుంచి వచ్చిన రెండో కారు. గతంలో ZS EVని లాంచ్‌ చేసింది. కమెట్‌ ఎలక్ట్రిక్ కారు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే వాటి ధరలను కంపెనీ ఇంకా తెలపలేదు. ఈ కారులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు నాన్ స్టాప్‎గా ప్రయాణించవచ్చు. 3.3 kW ఛార్జర్‌తో 100 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే సుమారు 7 గంటల సమయం పడుతుంది. అదే బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేస్తే 5 గంటలు సమయం పడుతుందని . కమెట్ కారు ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ ఇస్తున్నారు. కమెట్‎లో రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. కానీ నాలుగు సీట్లు ఏర్పాటు చేశారు. కెమెరా, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, ఎల్‌ఈడీ రియర్‌ ఫాగ్‌ ల్యాంప్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. సిటీల్లో నివసించే కస్టమర్లే టార్గెట్ ‎గా కమెట్ కారును మార్కెట్‎లోకి తీసుకువచ్చింది ఎంజీ సంస్థ. రూ.10 లక్షల్లోపు ఎలక్ట్రిక్ కార్ కోసం చూసే వారికి కమెట్‌ ఈవీ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ కార్ అన్ని రకాల సదుపాయాలతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2 శాతం ఉంది. భవిష్యత్తులో 10 శాతానికి ఈ సంఖ్య చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu