Ad Code

సోనీ నుంచి ఎక్స్పీరియా 1 V విడుదల !


మొబైల్ తయారీదారీలో ఒకప్పుడు అగ్రగామి అయిన సోనీ, ఇప్పుడు ఎక్స్పీరియా 1 స్మార్ట్ ఫోన్ ను యూరోపియన్ మరియు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇది ఎక్సమోర్ టీ  ఇమేజ్ సెన్సార్ మరియు 4కే హెచ్ డీఆర్ డిస్‌ప్లే ఫీచర్లతో వస్తుంది. ఇది సోనీ Xperia 1 IV కి కొనసాగింపుగా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది.ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4K HDR మద్దతు కలిగి ఉంటుంది. మరియు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది IP65/68 నీటి నిరోధకతను కూడా అందిస్తుంది మరియు 5,000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. సోనీ సంస్థ యూరోపియన్ మార్కెట్‌లో కొత్తగా విడుదల చేసిన ఈ సోనీ ఎక్స్‌పీరియా 1 V ధర $1,399 (దాదాపు రూ. 1,14,700). ఇది గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ఒకే ఒక 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇది జూన్‌లో యూరప్‌లో సేల్ కు రాబోతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్, 21:9 సినిమావైడ్ 4K HDR, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు కలిగిన, 6.5 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇంకా,ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా 12GB RAM మరియు 256GB


ఇంటర్నల్ స్టోరేజీ తో జత చేయబడింది. ఈ సోనీ Xperia 1 V కొత్త Exmor T ఇమేజ్ సెన్సార్‌తో వస్తుంది. సోనీ Xperia 1 V ,హైబ్రిడ్ OIS/EIS మద్దతుతో 52 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 3.5-5x ఆప్టికల్ జూమ్ మరియు 15.6X హైబ్రిడ్ జూమ్‌తో మరో 12-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది. 85-125 mm (F2.3-F2.8) ఆప్టికల్ జూమ్ లెన్స్‌ని అందించే దాని అల్ట్రా-వైడ్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది S-సినిటోన్ మరియు క్రియేటివ్ లుక్ వంటి కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ముందు భాగంలో, ఈ ఫోన్ 12- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. సోనీ Xperia 1 V 30W (USB PD) ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ యొక్క కొలతలు చూస్తే 165 x 71 x 8.3 మిమీ మరియు బరువు 187 గ్రా. ఇతర ఫీచర్లలో IP65/68 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 mm ఆడియో జాక్ మరియు 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu