Ad Code

హోండా షైన్ 100 సీసీ బైక్ !


దేశీయ మార్కెట్‌ లో హోండా కంపెనీ 100 సీసీ విభాగంలో తమ డిమాండ్‌ పెంచుకునేందుకు సరికొత్త హోండా షైన్ తీసుకొచ్చింది. ఈ షైన్ 100 సీసీ మోడల్ తో ఈ సెగ్మెంట్ లో కూడా తమ ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ హోండా షైన్ 100సీసీ మోడల్‌ రూ.80 వేలకు కొనుగోలు చేయచ్చని చెబుతున్నారు. ఇందలో ఒకటే మోడల్‌ ఉంది. 5 కలర్‌ వేరియేషన్స్‌ తో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైక్ లో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏంటంటే ఇది స్కూటీ కంటే తక్కువ ధరలో లభిస్తోంది. నిజానికి స్కూటీల ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హోండా షైన్ రూ.80 వేల ప్రైస్‌ రేంజ్ లో రావడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ హోండా షైన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ హోండా షైన్ 98.9సీసీ సింగిల్ సిలిండర్ తో వస్తోంది. ఇది ఎయిర్ కూల్డ్ మోటార్ తో పనిచేస్తుంది. ఈ బైక్ 8.05NM పవర్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బైకులో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియల్ స్ప్రింగ్ లు, సీబీఎస్ టెక్లాజీతో ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఈ మోడల్ లో ట్యూబ్ ఉండే టైర్లనే ఇస్తున్నారు. ట్యూబ్ లెస్ టైర్లతో రావడం లేదు. ఇది లీటరుకు 60 నుంచి 70 కిలీ మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇందులో రెడ్ బ్లూ, గోల్డ్, గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ హోండా షైన్ డీలర్లకు చేరుకున్నాయని చెబుతున్నారు. త్వరలోనే అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu