Ad Code

వచ్చే వారం గెలాక్సీ ఏ14 4జీ విడుదల


శాంసంగ్ త్వరలో భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ తీసుకు రానున్నది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియాలో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ  ఫోన్ వచ్చే వారం భారతీయులకు అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ 6.6 -అంగుళాల (1,080×2,408 పిక్సెల్) పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ80 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ  ఫోన్.. రెండు స్టోరేజీ వేరియంట్లలో వస్తుందని తెలుస్తున్నది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో రావచ్చు. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.13,999, 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ రూ.14,999లకు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ బేస్డ్ వన్ యూఐ 5.0 వర్షన్ మీద పని చేస్తుందని తెలుస్తు్న్నది. గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాలతో రానున్నది. ఫ్రంట్ లో 13-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 15 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu