ఫ్లిప్‌కార్ట్‌లో గోద్రేజ్ 180 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. దీని ఎంఆర్‌పీ రూ. 17,500గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ ఫ్రిజ్‌ను కేవలం రూ. 12,490కే కొనొచ్చు. అంటే మీరకు 28 శాతం మేర డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఆఫర్ ఇంతటితో అయిపోలేదు. ఇంకా ఇతర డీల్స్ కూడా ఉన్నాయి. వీటిని కలుపుకుంటే ఇంకా తక్కువ ధరకే ఈ ఫ్రిజ్‌ను ఇంటికి తీసుకువెళ్లొచ్చు. బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫ్రిజ్ కొంటే రూ. 500 అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా ప్రిపెయిడ్ ఆఫర్ కింద రూ. 500 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఇలా మీరు రూ. 1000 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్రిజ్ కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 4,500 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ కొత్త ఫ్రిజ్‌ను కేవలం రూ. 6,990కే కొనుగోలు చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత రిఫ్రిజిరేటర్ ఆధారంగా మారుతుంది. కొన్ని సార్లు మీ ఫ్రిజ్‌కు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు మీరు చేతి నుంచి ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎక్స్చేంజ్ ఆఫర్ పొందే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇంకా ఈ ఫ్రిజ్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. రూ. 4164 నుంచి ప్రారంభం అవుతోంది. 3 నెలలకు వర్తిస్తుంది. అదే రెగ్యులర్ ఈఎంఐ అయితే మీరు నెలకు రూ. 600 చెల్లించినా సరిపోతుంది. 24 నెలల టెన్యూర్ ఎంచుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అదే 18 నెలలు అయితే నెలకు రూ. 774 పడుతుంది. ఏడాది అయితే నెలకు రూ. 1122 చెల్లించాలి.
0 Comments