Ad Code

దేశీయ మార్కెట్లోకి త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 న్యూ లైమ్


దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. తన గెలాక్సీ ఎస్23 'న్యూ లైమ్' కలర్ వేరియంట్ ఫోన్ త్వరలో దేశీయ మార్కెట్లోకి తేనున్నది. గత ఫిబ్రవరిలో నాలుగు కలర్స్ క్రీం, గ్రీన్, లావెండర్, ఫాంటం బ్లాక్ వేరియంట్లలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ రామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజీతో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 +, గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా వేరియంట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎస్23 'న్యూ లైమ్' కలర్ వేరియంట్ 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సర్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 3900 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ వారాంతంలో న్యూ లైమ్ కలర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 యూజర్లకు అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఎస్23 ఫోన్ విత్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999లకు లభిస్తుంది. టాప్ హై ఎండ్ ఫోన్ 8జీబీ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.79,999లకు కొనుగోలు చేయొచ్చు. న్యూ లైమ్ కలర్ వేరియంట్ ఫోన్ కూడా ఇదే ధరకు లభిస్తుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ఆండ్రాయిడ్ 13 విత్ వన్ యూఐ5.1 వర్షన్ తో పని చేస్తుంది. 6.1-అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ గేమ్ మోడ్ లో 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ అందిస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ సెన్సర్, 12 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూ టూత్ 5.3, వై-ఫై డైరెక్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu