Ad Code

30% ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భర్తీ చేయాలననుకుంటున్నఐబీఎం !


రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాల నియమాకాలను నిలిపివేయాలని ఇంటర్నేషన్ బిజినెస్ మిషన్స్ (ఐబీఎం) నిర్ణయించింది. దాదాపు 30 శాతం ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భర్తీ చేయాలని అనుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా 7800 జాబ్స్ ను రీప్లేస్ చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ ఆఫీస్ జాబ్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా నింపేందుకు ఐబీఎం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ వెల్లడించారు. నాన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్ కింద దాదాపు 26,000 మంది ఐబీఎంలో పనిచేస్తున్నట్లు సీఈవో అరవింద్ కృష్ణ వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా దాదాపు 30 శాతం ఉద్యోగాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 7,800 ఉద్యోగాలు పోతాయన్నారు. కస్టమర్ కేర్ సర్వీసెస్, కోడింగ్ వంటి ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ఆక్రమిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఐబీఎంలో 2లక్షల 60వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్‌ తో పలువురు ఉద్యోగులను కంపెనీ తీసేసింది. ఆ తర్వాత మళ్లీ రిక్రూట్‌మెంట్ చేయలేదు. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది. 

Post a Comment

0 Comments

Close Menu